BibleProject | ఆగమన ధ్యానములునమూనా
దేవుని మార్గాలు మానవాళికి నిజమైన ఆనందం మరియు జ్ఞానాన్ని అందిస్తాయి (కీర్తన 19: 7-8 చూడండి). కానీ సాతాను మానవాళిని వారి స్వంత మార్గాలను జ్ఞానము కలిగినవిగా చూపించుట ద్వారా మోసగించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు (ఆదికాండము 3: 6 చూడండి). సాతాను మోసాలు సాధారణంగా మనకు తాత్కాలిక ఆనందాన్ని ఇస్తాయి కాబట్టి మోసపోవడం సులభం. కానీ మానవులు దేవుడి కంటే తమ స్వంత సూచనలను ఎంచుకున్నప్పుడు, వారు కోరుకునే నిజమైన మరియు శాశ్వత ఆనందాన్ని వారు కనుగొనలేరు.
చదవండి:
కీర్తన 19: 7-11, ఆదికాండము 3: 1-7
పరిశీలించు:
ఈ దినముయొక్క రెండు వాక్య బాగములలో పోలికలు మరియు తేడాలు గమనించండి. రెండు వాక్యాలలో ఏ పదాలు మరియు భావనలు పునరావృతమవుతాయి? మీరు ఏమి గమనిస్తున్నారు?
మీ పట్ల దేవుని మంచి ఉద్దేశాలపై మళ్లీ విశ్వాసము కోసం ప్రార్థించండి. మీరు అయనతో ఏకీభవించని లేదా సందేహించిన మార్గాల గురించి అయనతో యథార్థముగా ఉండండి మరియు ఈ రోజు మీరు అయన నాయకత్వాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందని ఆయనతో చెప్పండి.
ఈ ప్రణాళిక గురించి
యేసు ఆగమనం లేదా రాకను జరుపుకోవడానికి వ్యక్తులు, చిన్న సమూహాలు మరియు కుటుంబాలను ప్రేరేపించడానికి బైబిల్ ప్రాజెక్ట్ ఆగమన ధ్యానములును రూపొందించింది. ఈ నాలుగు వారాల ప్రణాళికలో పాల్గొనేవారికి నిరీక్షణ, శాంతి, ఆనందం మరియు ప్రేమ యొక్క బైబిల్ అర్థాన్ని అన్వేషించడానికి సహాయపడే యానిమేటెడ్ వీడియోలు, సంక్షిప్త సారాంశాలు మరియు ప్రతిబింబించే ప్రశ్నలు ఉంటాయి. యేసు ద్వారా ఈ నాలుగు ధర్మాలు ప్రపంచానికి ఎలా వచ్చాయో తెలుసుకోవడానికి ఈ ప్రణాళికను ఎంచుకోండి.
More
ఈ ప్లాన్‌ను అందించినందుకు మేము BibleProjectకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://bibleproject.com