పిల్లలు కోసం బైబిలునమూనా
యేసు చాలా అద్భుతాలు చేశాడు. యేసు దేవుని కుమారుడని మాత్రమే నిరూపించుటకు ఈ అద్భుతాలు జరిగాయి. మొదటి అద్భుతాన్ని యేసు ఒక వివాహవిందులో చేశాడు. ఆ విందులో అందరికి సరిపోయినంత ద్రాక్షారసము లేదు.
యేసు తల్లియైన మరియ ఆ సంగతిని యేసుకు తెలిపింది. యేసు చెప్పిన ప్రకారం చేయమని అక్కడి సేవకులకు చెప్పింది.
“ఈ రాతి బానలను నీళ్ళతో నింపండి” అని యేసు వారితో అన్నాడు. నీళ్ళతోనా? అన్నారు వారు. అవును నీళ్ళతోనే నింపండి అని యేసు ఆజ్ఞాపించాడు.
అప్పుడు యేసు ఆ సేవకులలో ఒకనితో ఇప్పుడు పాత్రను బానలో ముంచి, విందు ప్రధానికి మొదట ఇవ్వమని చెప్పాడు. అద్భుతం! నీరు రుచికరమైన, శ్రేష్టమైన ద్రాక్షారసంగా మార్చబడింది.
ఆ సేవకులు ఆశ్చర్యపోయారు. యేసు ఆ నీళ్ళను ద్రాక్షారసంగా మార్చాడు. దేవుడు మాత్రమే ఇలాంటి అద్భుతం చేయగలడు.
యేసు మరికొన్ని అద్భుతాలు చేశాడు. ఒక సాయంత్రం యేసు శిష్యులతో కలిసి పేతురు ఇంటికి వెళ్ళాడు. పేతురు అత్త జ్వరముతో బాధపడుతూ ఉంది.
యేసు ఆమె చేతిని ముట్టి స్వస్థపరిచాడు. మరుక్షణంలోనే జ్వరం ఆమెను విడిచింది. ఆమె లేచి యేసుకు ఆయన శిష్యులకు ఉపచారము చేయసాగింది.
ఆ సాయంత్రం పట్టణమంతయు యేసు వద్దకు వచ్చింది. గ్రుడ్డివారు, చెవిటివారు, మూగవారు, కుంటివారందరూ మరియు దయ్యములు పట్టిన వారు సహితము స్వస్థతనొందుటకు యేసు వద్దకు వచ్చారు. ఆయన వారినందరిని బాగుచేయగలడా?
దేవుని కుమారుడైన యేసు వారందరిని బాగుచేసి స్వస్థపరిచాడు. మంచములపై తేబడిన వారు లేచి నడచుచూ, గంతులు వేయసాగారు.
కుష్టరోగముతో బాధపడుతున్నవారు కూడా యేసు వద్దకు వచ్చారు. వారందరిని యేసు స్వస్టపరిచాడు.
దయ్యముల చేత బాధింపబడిన స్త్రీ, పురుషులందరూ ఆయన వద్దకు వచ్చారు. ఆయన దయ్యములను ఆజ్ఞచేత వెళ్ళగొట్టాడు. ఆయన విరోధులు యేసును ఏమియు అనలేక ఊరకున్నారు.
జనసమూహలు ఎక్కువగా ఉన్నందుచేత నలుగురు మనుష్యులు రోగిగాఉన్న తమ స్నేహితుడిని యేసుయొద్దకు తెచ్చుటకు ప్రయత్నించారు గాని వారు ఆ పని చేయలేకపోయారు. అప్పుడు వారేం చేశారు?
వారు ఆ రోగిని ఇంటిపైకి తీసుకువెళ్ళి ఆ ఇంటికప్పును తీసివేసి తాళ్ళళహాయంతో రోగిని యేసు ముందుకు దించారు. ఇప్పుడు ఆ రోగి యేసు ముందు ఉన్నాడు.
యేసు ఆ నలుగురి విశ్వాసమును చూచి ఆ రోగితో “నీ పాపములు క్షమింపబడియున్నవి, సీ పరుపెత్తుకొని నడువు” అన్నాడు. వెంటనే ఆ రోగి స్వస్థత పొంది లేచి నిలబడ్డాడు.
ఇది అయిపోయిన తరువాత యేసు తన శిష్యులతో కలిసి దోనెలో ఎక్కాడు. అకన్మాత్తుగా తుఫాను సంభవించింది. కాని యేసు దోనె క్రింది భాగంలో నిద్రపోతున్నాడు. ఆయన శిష్యులు భయంతో “ప్రభువా, మమ్మును కాపాడు, చనిపోతున్నామని కేకలు వేసి చెప్పారు.”
యేసు తుఫానును గద్దించినప్పుడు సముద్రం నిమ్మళంగా అయింది. “ఈయన ఏలాంటివాడో” గాలియు సముద్రమును కూడ ఈయనకు లోబడుచున్నవి అని ఆయన శిష్యులు తమలో తాము అనుకున్నారు. యేసు చేసిన అద్భుతాలు ఆయన మహిమను చూపించాయి. శిష్యులు ఆయన దేవుని కుమారుడని విశ్వసించారు. యేసు ఇక ముందుకూడా గొప్ప అద్భుతాలు చేయబోతున్నాడని శిష్యులకు తెలియలేదు.
ముగింపు
ఈ ప్రణాళిక గురించి
అది ఎలా మొదలైంది? మేము ఎక్కడ నుండి వచ్చాము? ఎందుకు ప్రపంచంలో చాలా కష్టాలను ఉంది? ఏదైనా ఆశ ఉందా? మరణం తరువాత జీవితం ఉందా? ప్రపంచంలోని ఈ నిజమైన చరిత్ర చదివేటప్పుడు సమాధానాలను కనుగొనండి.
More
ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము XXకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://bibleforchildren.org/languages/telugu/stories.php