పిల్లలు కోసం బైబిలునమూనా

పిల్లలు కోసం బైబిలు

8 యొక్క 8

ఈ బైబిల్‌ కథ మనలను సృష్టించిన అద్భుతమైన దేవుని గురించి తెలియజేస్తుంది. ఆయన ఎవరో తెలుసుకోవాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు.

మనము చెడుపనులు జరిగించి పాపము చేశామని దేవునికి తెలుసు. పాపమునకు శిక్ష మరణము, కాని దేవుడు నిన్ను బహుగా ప్రేమించి నీ పాపశిక్షను భరించుటకు తన ప్రియకుమారుడైన యేసును సిలువపై మరణించుటకు పంపాడు. ఆ తరువాత యేసు మరణమును జయించి పరలోకమునకు వెళ్లాడు. నీవు యేసుని నమ్మి నీపాపములను క్షమించమని అడిగినయెడల ఆయన నిశ్చయముగా క్షమించి నీయందు నివసించును. నీవు ఆయనతోయుగయుగములు జీవించెదవు.

ఇది నిజమని నీవు నమ్మినట్లయితే దేవునికి ఈలాగు ప్రార్ధన చేయుము. ప్రియమైన దేవా, నీవు దేవుడవని నమ్ముచున్నాను. నా పాపములకొరకు యేసు మరణించి తిరిగిలేచెనని నమ్ముచున్నాను. దయతో నా పాపములను క్షమించి నా జీవితములోనికి వచ్చి యుగయుగములు మీతో ఉండుటకు నాకు నిత్యజీవమును ప్రసాదించుము. నీ బిడ్డగా జీవించుటకు మరియు నీకు లోబడుటకు నాకు సహాయము చేయుము. ఆమెన్‌!

ప్రతిదినము బైబిలు చదివి దేవునితో మాట్లాడుము.

రోజు 7

ఈ ప్రణాళిక గురించి

పిల్లలు కోసం బైబిలు

అది ఎలా మొదలైంది? మేము ఎక్కడ నుండి వచ్చాము? ఎందుకు ప్రపంచంలో చాలా కష్టాలను ఉంది? ఏదైనా ఆశ ఉందా? మరణం తరువాత జీవితం ఉందా? ప్రపంచంలోని ఈ నిజమైన చరిత్ర చదివేటప్పుడు సమాధానాలను కనుగొనండి.

More

ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము XXకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://bibleforchildren.org/languages/telugu/stories.php