ఔదార్యంలోని ప్రావీణ్యతనమూనా
దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు ఎందుకంటే ఆయన మంచి దేవుడు. అతను మనల్ని ప్రేమిస్తున్నాడు, మనం వృద్ధి చెయ్యాలని కోరుకుంటున్నాడు. ఆయన మనలను సమృద్ధిగా ఆశీర్వదించడానికి ఒక కారణం ఉంది.
ఆయనకు ఒక కార్యాచరణ ఉంది: ఇతరులను మనం ఆశీర్వదించేలా ఆయన మనలను ఆశీర్వదించాడు.
మనం ఔదార్యం కలిగి ఉన్నప్పుడు,దేవుడు తరచుగా మనకు అధికంగా అనుగ్రహిస్తాడు, తద్వారా మనం అధికంగా ఇవ్వగలుగుతాము.
2కొరింథీయులలోని భాగాన్ని ఇప్పుడు మనం చూద్దాం. విత్తడం, కోయడం గురించి పౌలు రాస్తున్నాడు. దేవుడు తన కృపను "విస్తారంగా" అనుగ్రహించడంలో ఆయన సామర్థ్యాన్ని ఈ వచనభాగం వివరిస్తుంది –అది మన జీవితాల్లో పొంగిపొర్లుతుంది. అయితే పౌలు దాని కారణాన్ని వివరించడానికి వ్యవసాయ రూపకాన్ని ఉపయోగిస్తున్నాడు:
వచన భాగం ఇలా వ్రాయబడినది:“ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడియున్నది. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడుమీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి,మీరు ప్రతి విషయములో పూర్ణౌదార్య భాగ్యముగలవారగునట్లు,మీ నీతిఫలములు వృద్ధిపొందించును. ఇట్టి,ఔదార్యమువలన మాద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును.” (2కొరింథీయులు9:9-11).
విత్తేవానికి దేవుడు విత్తనాన్ని ఇస్తాడు - అది రైతుకున్న సాధనాలు. వ్యవసాయ రూపకాన్ని ఆధ్యాత్మిక పదాలలో చెప్పాలంటే,దేవుడు మనకు ఇచ్చే డబ్బు అంతా ఇదే. రైతు తాను అందుకున్న దానిలో పాల్గొని దానితో రొట్టెలు తయారుచేస్తాడు. అతడు తననూ, తన కుటుంబాన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే“విత్తనాల నిల్వ”కూడా ఉంటుంది. దానితో ఏమి చేయాలో అతడు నిర్ణయించుకోవాలి. అతడు తన విత్తనాలన్నింటినీ నిల్వ ఉంచుకోడానికి పెద్ద గాదెలను నిర్మిస్తూ ఉండాలా?లేదా విస్తారమైన పంటకోసం అతడు విత్తనాన్ని భూమిలో తిరిగి పెట్టుబడి పెడతాడా?
విత్తనాల నిల్వలోని పెరుగుదల గురించి పౌలు వ్రాస్తాడు,తద్వారా పంట పెరుగుతుంది. ఔదార్యం నేపథ్యంలో,ఈ పెరుగుదల "నీతి ఫలం."
మీరు ఇక్కడ ఒక సూత్రాన్ని చూస్తున్నారా?దేవుడు మన జీవితాలను ఆధ్యాత్మికంగానూ, సంబంధపరంగానూ,భౌతికంగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. - లేదా పౌలు చెప్పినట్లుగా“అన్ని విధాలుగా”.ఎందుకు?మనం“ప్రతి సందర్భంలోనూ”ఔదార్యంగాఉండగలం.
మన అవసరాలు తీర్చబడేలా ఆయన తన ఆశీర్వాదాన్ని మనమీద కురిపిస్తాడు అంతమాత్రమే కాకుండా మనం ఇతరుల విషయంలో తిరిగి పెట్టుబడి పెట్టవచ్చు. ఈ విధంగా నిల్వగిడ్డంగి విస్తరిస్తుంది. మన“నీతి ఫలం” విస్తరిస్తుంది.విశ్వాసంలోని ప్రతీ దశకు అధిక ప్రతిఫలం లభిస్తుంది. దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం అంతిమ ఫలితం.
దేవుని ఔదార్యం నిపుణత అదే. మన దగ్గర ఉన్నదాన్ని ఇచ్చినప్పుడు ఆయన మనల్ని ఆశీర్వదించడం ద్వారా దురాశకు వ్యతిరేకంగా మన హృదయాలను కాపాడుతాడు.
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
ఔదార్యం ఒక నిపుణత. ఈ ఐదు రోజుల పఠన ప్రణాళిక చిప్ ఇంగ్రాం గారు రాసిన ద జీనియస్ ఆఫ్ జెనెరోసిటి పుస్తకం నుండి తీసుకోబడ్డాయి, మనం నిర్దేశించబడిన విధంగా తెలివైన వ్యక్తులవలె ఏవిధంగా కాగలమో అనే అంశాలను ఈ పుస్తకంలో రచయిత వివరించాడు. ఈ తెలివైన వ్యక్తులు ఔదార్యంలో ప్రావీణ్యత కలిగియుండడాన్ని అర్థం చేసుకొంటారు, దాని నుండి ప్రయోజనాన్ని పొందుతారు. దేవుని ఔదార్య హృదయానికి సజీవ వ్యక్తీకరణగా మారినవారిని ఆశీర్వదించాలని దేవుడు ఏ విధంగా ఉద్దేశిస్తాడో, ఎటువంటి ప్రణాళికను కలిగియుంటాడో పరిశీలించండి.
More
ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము Rani Jonathan కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: http://ourupsdowns.blogspot.com/