ఔదార్యంలోని ప్రావీణ్యతనమూనా

ఔదార్యంలోని ప్రావీణ్యత

5 యొక్క 4

ఔదార్యంప్రగతిశీలమైనది. ఇది మూలాలతో ప్రారంభం అవుతుంది – ఇవ్వడం అనేది మొదటిది, శ్రేష్ఠమైనది. నిరంతరంగానూ, క్రమంగానూ ఇవ్వడం జరగాలి. అప్పుడు వంతుప్రకారం ఇవ్వడం గురించిన అవగాహన వస్తుంది – భౌతికంగా దేవుడు నిన్ను ఆశీర్వదించిన స్థాయి ప్రకారం ఇవ్వడం జరగాలి. అయితే ఇవ్వడం వెనుక ఉన్న హృదయం అత్యంత ముఖ్యమైన అంశం.

ఆరాధన, త్యాగం రెండూ ప్రత్యేకంగా పెనవసుకొని ఉండడం ద్వారా నిజమైన ఔదార్యం రూపు దిద్దుకొంటుందని మీరు గమనించవచ్చు. ఔదార్యం ఒక నిపుణతగా ఉండడంలో ఇదొక కారణం. ఇది దేవుని పట్ల మనకున్న ప్రేమను చూపిస్తుంది. ఇది ఆలోచనాపూరితమైన, స్వచ్ఛంద ఆరాధనకు చెందిన ఆత్మీయ చర్య. ఇది మన జీవితాల్లోకి లోతుగానూ, మరింత లోతుగానూ చేరుకుంటుంది,మన పరలోకపు తండ్రితో మనకున్న పరిపక్వమైనా, సంతోషకరమైనా సంబంధాన్ని ప్రతిబింబిస్తుంది.

ప్రేమపూర్వక ఈ ఔదార్యం నూతన నిబంధనలో ఉన్నతంగా ప్రదర్శించబడింది. కొన్ని సంఘాలు ఎంత ఉదారంగా ఉన్నాయో పౌలు కొంత వరకూ వ్రాశాడు – కొందరిని ఆకట్టుకోవడమే కాదు,కానిఇతరులను అధిక భక్తిలోనికి పురికొల్పడం.2కొరింథీయులకు8-9లో,మాసిదోనియనుల సంఘాల త్యాగసహిత ఔదార్యాన్ని గురించి పౌలు చూపించాడు.

ఏలాగనగా,వారు బహు శ్రమవలన పరీక్షింపబడగా,అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృపవిషయములోను,పరిశుద్ధులకొరకైన పరిచర్యలో పాలుపొందు విషయములోను,మనఃపూర్వక ముగా మమ్మును వేడుకొనుచు,వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యముకంటె ఎక్కువగాను తమంతట తామే యిచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను.” (2కొరింథీయులు8:2-4).

మాసిదోనియలోని ఈ సంఘాలకు జీవితం కష్టంగా ఉండేది. వారు "తీవ్ర పేదరికంలో" ఉన్నారు. అయితే వారు కరువుతో బాధపడుతున్న తమ యూదు సోదరుల గురించి విన్నారు,వారికిఇవ్వాలని కోరుకున్నారు. ఎవరూ వారిని బలవంతం చేయలేదు లేదా దోషులుగా వేలెత్తి చూపించలేదు. వారు స్వచ్ఛందంగా త్యాగాలు చేసారు,దానిని వారు ఒక ప్రత్యేక ఆధిక్యతగా భావించారు. ఎక్కువ సంపద లేని ఈ విశ్వాసులు తమకంటే తక్కువగా ఉన్న ఇతర విశ్వాసులకు ఇచ్చారు. ఇది వారికి చాలా ఖర్చుతో కూడుకొన్నది. వారు తమను తాము ప్రమాదంలో ఉంచుకొన్నారు. నిజమైన ఔదార్యానికీ, త్యాగానికీ ఇది ఒక ఉన్నతమైన చిత్రపటం.

“మీ”ఆస్తులను దేవునివిగా చూస్తూ వాటిని వదులుగా పట్టుకొని ఉన్నట్లయితేనే మీరు ఆ విధంగా ఇవ్వగలుగుతారు.

మనల్ని ప్రభావితం చేయని విధానంలో మనం ఇవ్వగలుగుతాము. మన జీవనశైలి ప్రభావితం కాదు,మనప్రణాళికలు మార్చబడలేదు, అయినప్పటికీ మనం కోరుకున్న వాటన్నిటినీ మనం కొనగలుగుతున్నాము. ఇంకా ఇది దాతృత్వంగానే పరిగణించబడుతుంది – కాని ఇది త్యాగం కాదు.

మనం ఔదార్యంగా ఇచ్చినప్పుడు,అది మనకు కొంత ఖర్చు అవుతుంది. అయితే కానీ త్యాగం అనేది ఒక పెద్ద అవసరానికిగానీ లేదా ఒక ఒత్తిడికి మన స్పందనకోసం మనం చూపే సత్వర ప్రతిచర్యలో నుండి మాత్రమే బయటికి రాకూడదు. దీనికి ప్రతిగా ఇది ఒక జీవన విధానంగా ఉండాలి.

రోజు 3రోజు 5

ఈ ప్రణాళిక గురించి

ఔదార్యంలోని ప్రావీణ్యత

ఔదార్యం ఒక నిపుణత. ఈ ఐదు రోజుల పఠన ప్రణాళిక చిప్ ఇంగ్రాం గారు రాసిన ద జీనియస్ ఆఫ్ జెనెరోసిటి పుస్తకం నుండి తీసుకోబడ్డాయి, మనం నిర్దేశించబడిన విధంగా తెలివైన వ్యక్తులవలె ఏవిధంగా కాగలమో అనే అంశాలను ఈ పుస్తకంలో రచయిత వివరించాడు. ఈ తెలివైన వ్యక్తులు ఔదార్యంలో ప్రావీణ్యత కలిగియుండడాన్ని అర్థం చేసుకొంటారు, దాని నుండి ప్రయోజనాన్ని పొందుతారు. దేవుని ఔదార్య హృదయానికి సజీవ వ్యక్తీకరణగా మారినవారిని ఆశీర్వదించాలని దేవుడు ఏ విధంగా ఉద్దేశిస్తాడో, ఎటువంటి ప్రణాళికను కలిగియుంటాడో పరిశీలించండి.

More

ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము Rani Jonathan కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: http://ourupsdowns.blogspot.com/