నియంత్రణ సంపాదించడంనమూనా
ఆవేశంపెరిగినప్పుడు
నేను బస్సులో ఖాళీగా ఉన్న సీటులో స్థిరపడ్డాను,నా ఇంటి నుండి బస్ స్టాప్ వరకు సుదీర్ఘ నడక తర్వాత నాకు దొరికిన నెమ్మది కోసం కృతజ్ఞతలు. రోజులో చేయవలసిన అనేక పనులను గురించి ఆలోచన చేయడంలో నా మనస్సు తీరిక లేకుండా ఉంది. అకస్మాత్తుగా,ఒక మోచేయి ఎముక నాపక్కటెముకలోకి గట్టిగా నొక్కినట్లు అనిపించింది. ఒక మధ్య వయస్కురాలైన బడగా మహిళ తన వేళ్ళతో వలిచిన అరటి ముక్కను నాకు అందిస్తున్నట్లు చూసి ఉలిక్కిపడ్డాను. బడగ ప్రజలు నీలగిరి ప్రాంతంలో స్వతంత్రంగా నివసిస్తున్న స్థానిక ప్రజలు,వారిది వ్యవసాయ నేపథ్యం,వారు తమసామరస్యపూర్వక సమాజ జీవనానికీ, ఉత్సాహపూరిత ఆతిథ్యానికీ ప్రసిద్ది చెందారు,ఇక్కడ నేను దానిలో కొంత భాగాన్ని అనుభవించాను. ఒక్క మాట కూడా మాట్లాడకుండా,ఆమె తల తీవ్రంగా కదులుతూ ఉండగా, ఒక అరటి ముక్కను తీసుకోవాలని ఆమె ఆమె నాకు సంకేతాలు ఇచ్చింది,నేను అయిష్టంగానే తీసుకొన్నాను. నేను బస్సులో అరటిపండు తినడం, నా వేళ్లతో దానితో అంటుకోవడం నాకు పెద్దగా ఇష్టం లేదు. అరటిపండు నా చేతిలో ఇంకా ఉండడం ఆమె చూసినప్పుడు ఆమె తల వంచి, తన తల ఊగుతుండగా దాన్ని తినమని నన్ను ప్రోత్సహించింది. తప్పించుకునే మార్గం లేకపోవడంతో,చివరకు ఆమెను సంతోషపరచడానికి నేను దానిని నా నోటిలో వేసుకున్నాను, ఆమె సంతృప్తి చెందింది. తియ్యగా ఉంది కాని కొంచెం కోపం! ఈ సంఘటన అంతా కొద్ది క్షణాల్లో జరిగిపోయింది, దాని తరువాత ఆతిథ్యమిచ్చే ఆ వృద్ధురాలు నిద్రలోకి జారుకొంది. అయితే ఇది నా ఆలోచనలను మంచులా కరిగిస్తుంది. ప్రభువైన యేసు సహనం స్థాయిని గురించి ఆలోచించినప్పుడు,నేను ఆశ్చర్యపోవడం మాత్రమే కాకుండా నన్ను నేను తగ్గించుకొన్నాను,సిగ్గుపడ్డాను కూడా. ఆయన సహనం స్థాయి అసాధారణమైనది. దీనిని గురించి ఆలోచించండి. మీరు మీ కుటుంబం, స్నేహితులతో భోజనానికి కూర్చున్నారు, మిశ్రమ వంటకాల రుచికరమైన సుగంధాలు మీ రుచి మొగ్గలను చక్కిలిగింతలు పెడుతున్నాయి. రసభరితమైన ఆ వంటకాలను మీరు తినబోతుండగా తేమతో కూడిన సుగందాలు మీ తల మీద నుండి మెడ మీదుగా వస్త్రాలలోనికి ప్రవహిస్తున్నట్టు మీకు అనిపిస్తుంది.
ఒక మహిళ ఖరీదైన అత్తరు సీసాను“దయచేసి నన్ను చెయ్యనివ్వండి”అని అడగడం లేకుండానే దానినంతా మీ మీద కుమ్మరిస్తుంది.మీ స్పందన ఏవిధంగా ఉంటుంది?నేను దానిని మీ ఊహకూ, నిజాయితీతో కూడిన స్వీయ పరీక్షకు వదిలివేస్తాను. ఇక్కడ ఉన్న ఆ పరిస్థితిని ప్రభువు ఏవిధంగా చక్కదిద్దుతున్నాడు అనే దానిని గురించి మనం ఆలోచించిస్తున్నాము. ఆయన చుట్టూ ఉన్న మిగిలిన వారందరూ ఆ స్త్రీ విషయంలో సణుగుతూ,ఆమెను దూషిస్తూ ఉన్నప్పుడు, ప్రేమతోనూ, ఆరాధనతోనూ కూడిన ఆమె అర్పణను ప్రభువైనయేసు అంగీకరించాడు,సంకేతికంగా ఆమె చూపిన కార్యానికి తన వాక్యంలో నిరంతరం స్థానం ఉంటుందని చెపుతూ ఆమెకు ప్రతిఫలాన్ని దయచేశాడు. ఈ సంఘటనను గురించి మరింత తెలుసుకోవడానికి మత్తయి26:6-13చూడండి.
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
మనం ఒత్తిడికి గురైనప్పుడు దానిని ఏవిధంగా ఎదుర్కోవాలి? మనం ఆత్మ ఫలాలను కనుపరుస్తామా, లేదా మన మామిడి చెట్లు చేదు ఫలాలను, మన ద్రాక్షవల్లి పుల్లని ద్రాక్షలను ఉత్పత్తి చేస్తాయా? పాదరసం స్థాయి పెరిగినప్పుడు, మన కోపాలు వేగవంతం అవుతాయా? కోపం, అసహనం, అహంకారం నియంత్రణ కింద మనం స్పందించినప్పుడు మరమత్తు చేయవీలుకాని నష్టం జరుగుతుంది. అయితే సహనం, కృప మనల్ని నూతన జీవన స్థితికి చేరుస్తాయి.
More
ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము Rani Jonathan కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: http://ourupsdowns.blogspot.com/