నియంత్రణ సంపాదించడంనమూనా

నియంత్రణ సంపాదించడం

3 యొక్క 3

నియంత్రణను సంపాదించండి

కొంతమంది ప్రజలు అంత అధిక స్థాయిలో సహనాన్ని ఏవిధంగా వృద్ధి చేసుకొంటారు? మరికొందరు కనీసం గుంపులో భాగం కావడాన్ని కూడా భరించలేరు,లేదా ప్రజలు తమకు దగ్గరగా ఉండి వారి ఎదురుగా పండ్లు తోముకోవడం చూసి సిగ్గుతో బజారులోనుండి పక్కకు వచ్చేస్తారు. సహనంలోని ప్రాథమిక పాఠాలు బాల్యం నుండే అలవడతాయని నేను విశ్వసిస్తున్నాను. అనేక సంవత్సరాలుగా,మన ప్రకృతిలో చాలా వ్యర్థాలను మనం సేకరిస్తూ వచ్చాము, అవి మనలో భాగం అయ్యాయి. మీ ఆత్మలో కుళ్ళిన పదార్ధాలు రహస్యంగా ఉన్నట్లయితే వాటిని వేగంగా వదిలించుకోండి. నిండిపోయి, దుర్వాసనతో ఉండడంకంటే శుభ్రంగానూ, ఖాళీగానూ ఉండటం మంచిది. ప్రభువైన యేసు వంశావళి అంగీకరించబడడం ఒక అద్భుతమైన ఉదాహరణ. అందులోరాజులూ,నాయకులూ,యాజకులూ,సజీవుడైన దేవుని వైపుకు తిరిగిరక్షింపబడిన రాహాబు అనే వేశ్యతో పక్కపక్కనే ఉండి కవాతు చేసారు. రాహాబును ఈ వంశావళిలో కనిపించకుండా చెయ్యడానికి ప్రయత్నించవచ్చు కాని ప్రభువైన యేసు అలా చెయ్యడు. యేసు రాజ్యం కేవలం “కొంతమందికే” అని కాకుండా ప్రతిఒక్కరికీ తెరిచి ఉంటుందని ప్రపంచానికి తెలిసే విధంగా ఆమె పేరు ప్రస్తావించబడింది. ప్రభువైన యేసును హేళన చేస్తూ తీర్పు తీర్చడం, తరువాత ఆయన సిలువ వేయబడినప్పుడు, తనకు వ్యతిరేకంగాతప్పుడు ఆరోపణలను ఆయన ఎదుర్కొన్నప్పుడూ, శరీరం చీల్చివేయబడేలా వెన్ను భాగంలో కొరడా దెబ్బలు పొందుతున్నప్పుడూ, భయంకరమైన ముండ్ల కిరీటం తలమీద గుచ్చబడినప్పుడూ సహితం ఆయన శాంతిని కలిగి ఉన్నాడు,ఆయనతనను హింసించేవారిని కాంతివంతమైన మెరుపుతో సులభంగా కొట్టగలిడేవాడు, లేదా స్వనీతిపరులస్థానాలను మార్చివేసేవాడు, యాజకులనూఅరేబియాలోని విస్తారమైన ఎడారులలో100కిలోమీటర్ల వ్యాసార్థంలో ఎటువంటి బావి లేకుండా వారిని తిరస్కరించేవాడే. మత్తయి26:53వచనంలో,తనకు సహాయపడడానికి దేవదూతల సమూహాలను పొందగలడని ప్రభువు చెప్పాడు.అయితే ఆయనఒక ఉద్దేశ్యాన్ని నెరవేర్చడానికి వచ్చినందున వీటన్నిటినీ భరించాడు, కోపం దేవుని చిత్తానికి విరుద్ధంగా పనిచేస్తుంది. ఆ స్త్రీ అత్తరును ఆయన తన తలమీద కుమ్మరించినప్పుడు, ప్రజలు ఆమె బాహ్యరూపాన్ని బట్టి ఆమెను తీర్పు తీర్చారు, ఆమెగర్వితచర్యకు ఆమెను ఖండించారు,అయితే ప్రభువైనయేసు ఆమె ఆత్మలోకి చూశాడు,కన్నీటితో నిండిన కళ్ళ ద్వారా నిజమైన పశ్చాత్తాపం, విశ్వాసం మెరుస్తున్నట్లు చూశాడు, వెంటనే క్షమించి ఆమెను అంగీకరించాడు . ఇటువంటి ప్రేమ మన జీవితంలో పనిచేసినప్పుడు,ఇతరులలోని తప్పిదాలనూ, లోపాలను మనం చక్కగా తట్టుకోగలుగుతాము త్వరపడి తీర్మానాలు చెయ్యడం, తీర్పు చెయ్యడంలో మనం నిదానిస్తాము. యాకోబు4:12వచనం ఒక కటువైనప్రశ్నను అడుగుతుంది: మీ పొరుగువారిని తీర్పు తీర్చడానికి మీరు ఎవరు?ప్రభువైన యేసు అనేక మంది వ్యక్తులతో సన్నిహితంగానూ, వ్యక్తిగతంగా ఉండడానికీ వచ్చాడు. అయినప్పటికీ,వివాదాస్పద సమూహాలచే ఆయన ముట్టడి చెయ్యబడినప్పుడూ, వివాదాలు పెరుగుతున్నప్పుడూ,అతను ప్రతీకారం తీర్చుకోలేదు. ఆయన దూరంగా వెళ్ళిపోయాడు. ఆయన వివాదాలనుండి వైదొలిగాడు,అయితేప్రజలను దూరం చేయలేదు. పెరుగుతున్న పాదరసం (ఆవేశం) విషయంలో సహనంతో వ్యవహరించండి, వర్తమానానికి మించి భవిష్యత్తులోనికి చూడండి. ఇది ప్రభువైన యేసుకు ప్రాముఖ్యమైతే,అది మనకూ పాముఖ్యంగా ఉండాలి.

రోజు 2

ఈ ప్రణాళిక గురించి

నియంత్రణ సంపాదించడం

మనం ఒత్తిడికి గురైనప్పుడు దానిని ఏవిధంగా ఎదుర్కోవాలి? మనం ఆత్మ ఫలాలను కనుపరుస్తామా, లేదా మన మామిడి చెట్లు చేదు ఫలాలను, మన ద్రాక్షవల్లి పుల్లని ద్రాక్షలను ఉత్పత్తి చేస్తాయా? పాదరసం స్థాయి పెరిగినప్పుడు, మన కోపాలు వేగవంతం అవుతాయా? కోపం, అసహనం, అహంకారం నియంత్రణ కింద మనం స్పందించినప్పుడు మరమత్తు చేయవీలుకాని నష్టం జరుగుతుంది. అయితే సహనం, కృప మనల్ని నూతన జీవన స్థితికి చేరుస్తాయి.

More

ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము Rani Jonathan కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: http://ourupsdowns.blogspot.com/