మీకు ఒక ప్రార్థన ఉంది!నమూనా
“మనకు ఒక ప్రార్థన ఉంది!”
నేటి సమాజంలో, జీవిత సవాళ్లను ఎదుర్కొనుటకు ఒక ప్రభావవంతమైన మార్గముగా చాలామంది ప్రార్థనను పరిగణిస్తారు. వాస్తవానికి, కొంతమంది అసలు ప్రార్థన చేయకపోవచ్చు. మరికొందరు ఎన్నో ప్రయత్నాలు చేసిన తర్వాత వారు కేవలం ప్రార్థన మాత్రమే చేస్తారు.
మన కష్టాలను ఎదుర్కొనుటలో మనకున్న అవకాశాలు మరియు వనరులు అన్నీ అయిపోయిన తర్వాత ప్రార్థన అనేది ఆఖరి ప్రయత్నంగా ఉండాలని దేవుడు కోరుకొనుటలేదు. ప్రార్థన ప్రతి క్రైస్తవుని జీవితానికి కేంద్రమై ఉండాలని దేవుని ఆశ అనేది నిజము: మనం అవసరతలో ఉన్నప్పుడు వెళ్ళే మొట్టమొదటి స్థలం, ఆఖరి స్థలం కాదు. మనం అవసరతలో ఉన్నప్పుడు మరియు మనకు సమృద్ధి మరియు సంతృప్తి ఉన్నప్పుడు కూడా దినమంతా, అనుదినం మన మాటలు వినాలని ఆయన కోరుకుంటున్నాడు. అంతేకాకుండా, మనం ప్రార్థించేటప్పుడు మనతో నిరంతర సంభాషణలో ఉంది అనేక విధాలుగా ఆయన ప్రేమను మన పట్ల వెల్లడి పరచాలని కోరుతున్నాడు.
మన జీవితాల్లో మరియు చుట్టుప్రక్కల అనుకూలమైన మార్పును చూచుటకు ఏకైక తాళపుచెవి ప్రార్థన.
“మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి; మీరు స్వస్థతపొందునట్లు ఒకనికొరకు ఒకడు ప్రార్థనచేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై యుండును.”యాకోబు 5:16
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
శక్తివంతమైన మరియు ప్రబావవంతమైన ప్రార్థనా జీవితాన్ని నిర్మించుకొనటానికి కావలసిన సూత్రాలను కనుగొనండి. ప్రార్థన – దేవునితో వ్యక్తిగత స్థాయిలో సంభాషించుట -మన జీవితాల్లో మరియు చుట్టుప్రక్కల అనుకూలమైన మార్పును చూచుటకు ఏకైక తాళపుచెవి. డేవిడ్ స్వాండ్ రచించిన “ఈ లోకంలోనుండి: ఎదుగుదల మరియు ఉద్దేశమునకు క్రైస్తవుని మార్గనిర్దేశం” అనే పుస్తకంలోనుండి సంగ్రహించబడింది.
More
ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము Twenty20 Faith, Inc.కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.twenty20faith.org/devotion1?lang=te