మీకు ఒక ప్రార్థన ఉంది!నమూనా

మీకు ఒక ప్రార్థన ఉంది!

6 యొక్క 4

“ప్రభావవంతమైన వ్యక్తిగత ప్రార్థనకు దేవుని నమూనా”

ప్రభువు ప్రార్థన బైబిల్లో అత్యంత ఎక్కువగా గుర్తింపబడిన వచనాల్లో ఒకటి. అనేకమంది ప్రభువు ప్రార్థనను కంఠస్థం చేశారు లేదా కనీసం దానిని వినినప్పుడైనా గుర్తించగలుగుతారు. యేసు తన శిష్యులకు ఈవిధంగా ఉపదేశించాడు:

“కాబట్టి మీరీలాగు ప్రార్థనచేయుడి, –పర లోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరునుగాక, మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము. మా ఋణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా ఋణములు క్షమించుము. మమ్మును శోధనలోకి తేక దుష్టునినుండి మమ్మును తప్పించుము.” మత్తయి 6:9-13

ప్రభువు ప్రార్థన నేటికీ అత్యంత విరివిగా వల్లించబడే ప్రార్థన. కానీ యేసు ఈ అమూల్యమైన మాటలు ఆయన శిష్యులకు ఇచ్చినప్పుడు, కంఠత చేయడానికి మనకు ఒక ప్రభావవంతమైన ప్రార్థన ఇవ్వటం ఆయన ఉద్దేశం కాదు. మన ప్రార్థనలన్నీ ఆధారపడవలసిన ఒక ప్రాముఖ్యమైన విధానాన్ని ఆయన మనకిచ్చాడు.

మీరు ప్రార్థించినప్పుడు మిమ్మల్ని పరిమితిచేసే దాని గురించి మరియు మీ ప్రార్థనకు ఆటంకంగా ఉండే వాటి గురించి ఒక్క క్షణం ఆలోచించండి. బహుశా మీ పైనే ఎక్కువగా దృష్టి పెట్టుకునే ఆలోచన మీకు ఉందేమో. బహుశా ప్రార్థన సమయంలో సులువుగా మీ ఏకాగ్రతను కోల్పోతారేమో లేదా కునుకు వేస్తారేమో. ఇవన్నీ అప్పుడప్పుడు మనమంతా ఎదుర్కునే సాధారణ సమస్యలే.

ఇటువంటి ప్రవర్తన మరియు ఆటంకాలను ఎదుర్కొనటానికి ఒక చక్కటి ఆధారాన్ని ప్రభువు ప్రార్థన తరువాతి భాగాలలో విభజించి చెప్పబడినట్లు మనకు అందిస్తుంది.

వాక్యము

రోజు 3రోజు 5

ఈ ప్రణాళిక గురించి

మీకు ఒక ప్రార్థన ఉంది!

శక్తివంతమైన మరియు ప్రబావవంతమైన ప్రార్థనా జీవితాన్ని నిర్మించుకొనటానికి కావలసిన సూత్రాలను కనుగొనండి. ప్రార్థన – దేవునితో వ్యక్తిగత స్థాయిలో సంభాషించుట -మన జీవితాల్లో మరియు చుట్టుప్రక్కల అనుకూలమైన మార్పును చూచుటకు ఏకైక తాళపుచెవి. డేవిడ్ స్వాండ్ రచించిన “ఈ లోకంలోనుండి: ఎదుగుదల మరియు ఉద్దేశమునకు క్రైస్తవుని మార్గనిర్దేశం” అనే పుస్తకంలోనుండి సంగ్రహించబడింది.

More

ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము Twenty20 Faith, Inc.కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.twenty20faith.org/devotion1?lang=te