హింసలో భయాన్ని ఎదిరించుటనమూనా

హింసలో భయాన్ని ఎదిరించుట

7 యొక్క 5

భయం కలిగే సందర్భాలలో వాగ్దానాలు

శ్రమలు తప్పవని యేసు హెచ్చరి౦చాడు,కానీ దానికి భయపడవద్దని కూడా ఆయన మనల్ని హెచ్చరి౦చాడు. దెయ్యం హింసను ప్రేరేపిస్తుందని,తన సంఘము దానిని సహిస్తుందని ఆయన ముందుగానే చెప్పాడు. యేసు ఏడు దీప స్తంభముల మధ్య నడుస్తున్నాడు మరియు ఇక్కడ స్ముర్ణలో ఉన్న సంఘాన్ని ఉద్దేశించి చెప్తున్నాడు. దెయ్యం గురి చేసే హి౦సలకు,బాధలకు భయపడవద్దని ఆయన సంఘాన్ని ప్రోత్సహిస్తున్నాడు. మనము ఆయన ప్రజలము,ఆయన చేతి నుండి మనలను ఎవరూ అపహరించలేరు. కాబట్టి,వారు మనల్ని పరీక్షించవచ్చు లేదా జైలులో గాని,మరెక్కడైనా మనకు ఏమి జరుగుతుందోనని ఆందోళన చెందవద్దని ఆయన మనకు హామీ ఇస్తున్నాడు.

శ్రమలు ఉన్నప్పటికీ,యేసు దాని ద్వారా ఎల్లప్పుడూ మనతో ఉంటాడని చెప్పి మనల్ని ఓదార్చాడు. నమ్మకముగా ఉన్నవారికి మహిమాన్వితమైన, శాశ్వతమైన జీవ కిరీటం బహుమతిగా ఇవ్వబడుతుంది.. ప్రియమైన దేవుని బిడ్డలారా,మనము పొందే శ్రమ వృధా కాదని,అది శాశ్వత పరలోక ప్రతిఫలాన్ని పొందుకుంటుందని ఎరిగి మనము ఆదరణ పొందుకుందాం.

కట్టుబడి,ప్రార్థించండి:

మీకు,మీకుటు౦బానికి లేదా ఇతర విశ్వాసులకు ఏమి జరుగుతు౦దోనని మీరు చింతిస్తున్నారా?మీ భయాల మధ్య,మీరు ప్రభువు నుండి పొందుకునే శాశ్వత బహుమానాల గురించి ధ్యానించగలరా?

మన భయాలు,హి౦సల మధ్య మనము పొందుకునే శాశ్వత బహుమానాలు గుర్తుకు రావాలని ప్రార్థి౦చ౦డి.

వాక్యము

రోజు 4రోజు 6

ఈ ప్రణాళిక గురించి

హింసలో భయాన్ని ఎదిరించుట

ఎవరైనా హింసించబడుతున్నప్పుడు, ఆ సందర్భంలో భయపడడమనేది వారి అత్యంత శక్తివంతమైన భావోద్వేగాలలో ఒకటి. దాడులు, జైలుకు తీసుకువెళ్ళడం, సంఘ భవనాలను మూసివేయడం, విశ్వాస౦వల్ల ప్రియమైనవారు, తోటి విశ్వాసులు మరణి౦చడ౦ ఇవన్నీ మన క్రైస్తవ ప్రయాణ౦లో ముందుకు సాగడానికి భయాన్ని, నిస్సహాయతను కలిగిస్తాయి. మీరు ఇప్పుడు భయపడుతున్నట్లయితే, హింసను ఎదుర్కొంటున్నప్పుడు భయాన్ని ఎదుర్కోవటానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవడానికి ఈ పఠన ప్రణాళిక చాలా గొప్పగా సహాయపడుతుంది.

More

ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము Persecution Reliefకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://persecutionrelief.org/