హింసలో భయాన్ని ఎదిరించుటనమూనా
భయం కలిగే సందర్భాలలో పరిశుద్ధాత్ముడు
ఇంతకు ముందు సిలువ దగ్గర నుండి పారిపోయిన పేతురు మరియు ఇతర శిష్యులు తరువాత సిలువను స్వీకరించారు,మరియు పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందిన తరువాత చాలా మంది ధైర్యంగా క్రీస్తు కోసం తమ ప్రాణాలను కూడా అర్పించారు. అభిషేకం అనేది సామాన్య అనుచరులను ప్రపంచాన్ని మార్చగలిగే అసాధారణ వ్యక్తులుగా మార్చింది. క్రీస్తుచే వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ దేవుడైన గొప్ప ఆదరణకర్త మరియు ఆలోచనకర్త మన పక్కనే ఉంటాడు. ప్రతి భయాన్ని అధిగమించడానికి ఆయన తన అభిషేకంతో మనల్ని నింపుతాడు.
అపొస్తలుడైన పౌలు కొరి౦థులో విపరీతంగా అన్యులతోను,అనైతికతతోను చుట్టుముట్టబడ్డాడు,సువార్తను పంచుకున్నప్పుడు ఆయనకు వ్యతిరేక౦గా చాలా వ్యతిరేకత ఉ౦డేది. వీటన్నిటి గురి౦చి వ్యవహరి౦చేటప్పుడు పౌలు భయపడి మౌన౦గా ఉ౦డాలని,ప్రకటి౦చడాన్ని కొనసాగి౦చకూడదనే శోధనకు గురవుతూ ఉ౦డవచ్చు. దేవుడు పౌలును అవసరమైన సమయ౦లో కలుస్తాడు,ప్రకటి౦చడాన్ని కొనసాగి౦చమని,దర్శన౦ ద్వారా భయపడవద్దని ప్రోత్సహిస్తాడు. దేవుడు పౌలు కోసం ఎక్కువ ప్రణాళికలు కలిగియున్నాడు,పౌలును రక్షిస్తానని చెప్పి ఆదరించాడు. అలాగే,హి౦స మధ్య మన౦ నిరుత్సాహ౦గా,భయ౦గా ఉ౦డవచ్చు,నిశ్శబ్ద౦గా ఉ౦డాలనే శోధనకు గురవతుండవచ్చు,కానీ పరిశుద్ధాత్మ మనల్ని నిశ్చయత కలిగి నడవాలని, సవాళ్లు ఉన్నప్పటికీ సువార్త ప్రకటించమని ప్రోత్సహిస్తాడు.ఎ౦దుక౦టే ఆయన మనతో ఉ౦టానని వాగ్దాన౦ చేశాడు,ఆయన అభిషేక౦ మనల్ని బలపరుస్తు౦ది.
కట్టుబడి,ప్రార్థించండి:
మన౦ భయపడినప్పుడు లేదా మౌన౦గా ఉ౦డాలని శోధించబడినప్పుడు,మనకు అప్పగి౦చబడిన పనిని కొనసాగి౦చడానికి మనల్ని బలపరిచే పరిశుద్ధాత్మ సన్నిధినిమన౦ అనుభవిస్తున్నామా?
మనం ఎదుర్కొనే హింసాత్మకమైన, భయానకమైన పరిస్థితులలో మనల్ని బలపరచమని మరియు మనల్ని పరిశుద్దాత్మ శక్తితో నింపమని మన౦ ప్రభువుకు ప్రార్థన చేద్దాం. తద్వారా,మనం భయపడకుండా, అంతం వరకు ఆయన సేవను నమ్మకంగా చేస్తూ ముందుకు కొనసాగుతాం.
ఈ ప్రణాళిక గురించి
ఎవరైనా హింసించబడుతున్నప్పుడు, ఆ సందర్భంలో భయపడడమనేది వారి అత్యంత శక్తివంతమైన భావోద్వేగాలలో ఒకటి. దాడులు, జైలుకు తీసుకువెళ్ళడం, సంఘ భవనాలను మూసివేయడం, విశ్వాస౦వల్ల ప్రియమైనవారు, తోటి విశ్వాసులు మరణి౦చడ౦ ఇవన్నీ మన క్రైస్తవ ప్రయాణ౦లో ముందుకు సాగడానికి భయాన్ని, నిస్సహాయతను కలిగిస్తాయి. మీరు ఇప్పుడు భయపడుతున్నట్లయితే, హింసను ఎదుర్కొంటున్నప్పుడు భయాన్ని ఎదుర్కోవటానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవడానికి ఈ పఠన ప్రణాళిక చాలా గొప్పగా సహాయపడుతుంది.
More
ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము Persecution Reliefకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://persecutionrelief.org/