సంక్షోభ సమయంలో దేవుని మాట వినడంనమూనా
దేవుడు చెప్పేది ఏవిధంగా వినాలి
మన గమనం మరియు లక్ష్యం కోసం పోటీపడే అనేక విషయాలు ఉన్న ఈ లోకంలో, దేవుని ప్రజలు ఇతరులందరి స్వరాల కంటే ఒకే ఒక స్వరానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడానికి సవాలు చేయబడ్డారు: 'సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక.” (ప్రకటన 3:22).
మనం దేవుని స్వరాన్ని ఎలా గ్రహించగలం మరియు లోకం ఉన్న కలతల మధ్య మన దర్శనాన్ని రూపొందించే వానిగా ఆయన ఏవిధంగా అనుమతించగలం?
1 చదవడం: దేవుడు నాతో సంభాషించడానికి ప్రధాన మార్గం బైబిలు. నేను ప్రభువైన యేసును మొదటిసారిగా కలుసుకొన్నట్టుగా ఇది చూపిస్తుంది. నేను బైబిలు చదివినప్పుడు, నా ఆత్మ పోషించబడినట్లుగా నాకు అనిపిస్తుంది. నేను దేవుని మాట విన్నాను అని చెప్పే ప్రధాన మార్గం ఇదే.
2 వినడం. నేను ప్రతిరోజూ హైడ్ పార్క్ చుట్టూ దేవునితో నడవడానికి ఇష్టపడతాను––హనోకు దేవునితో నడిచివిధంగా నేను ఇలా చేస్తాను. ఈ విధంగా నడుస్తున్నప్పుడు, దేవుడు నాతో ఏమి చెపుతున్నాడో అని నేను దేవుణ్ణి దేవుడిని అడుగుతాను, ఆ తరువాత నేను వినడానికి సమయం తీసుకుంటాను.
3 ఆలోచించడం. దేవుడు మనకు మనస్సును ఇచ్చాడు మరియు మన మనస్సు ద్వారా మరియు మన హేతువు ద్వారా తరచుగా ఆయన మనకు మార్గనిర్దేశం చేస్తాడు. మనం ఒక పెద్ద నిర్ణయాన్ని ఎదుర్కొన్నప్పుడు లేదా దిశానిర్దేశం అవసరమైనప్పుడు, సమస్య గురించి మనం ఆలోచిస్తూ ఉండగా ఆయన మనకు మార్గనిర్దేశం చేస్తాడు.
4 మాట్లాడడం. మీ జీవితంలో దేవుడు నిలిపిన వ్యక్తులతో మాట్లాడండి. తరచుగా నా విషయంలో నేను అవివేక ప్రదేశాలను కలిగి ఉంటాను, నా మట్టుకు నాకు అవి కనిపించని సంగతులు. అయితే మీరు ఇతర వ్యక్తులతో సమాజంలో ఉన్నప్పుడు, వారు తరచుగా ఆ అవివేక ప్రదేశాలను గుర్తించగలుగుతారు. ఈ ప్రదేశాలను మీరు మరింత స్పష్టంగా చూడడంలో వారు మీకు సహాయపడగలరు. సంఘ సమాజం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు.
5 గమనించడం. దేవుడు సమస్తాన్ని తన ఆధీనంలో ఉంచుకొన్నాడు. మరియు ఆయన సింహాసనం మీద ఉన్నాడు. ఆయన ద్వారాలను మూసివేయగలడు మరియు ఇతర ద్వారాలను తెరవగలడు మరియు మన పరిస్థితుల ద్వారా మనకు మార్గనిర్దేశం చేయగలడు. కీర్తన 37:5 ఇలా చెపుతోంది, ‘నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము
నెరవేర్చును.” కాబట్టి, మీరు ఒక నిర్ణయాన్ని ఎదుర్కొన్నప్పుడు, మీరు ఇలా చెప్పవచ్చు, ‘ప్రభువా, ఇది మీ చేతులలో ఉంది. నేను నిన్ను విశ్వసిస్తాను’ మరియు ఆయన కార్యాన్ని జరిగించేలా ఆయన కోసం గమనించండి.
కాబట్టి, ఈ రోజు సంఘానికి దేవుడు ఇస్తున్న దర్శనం ఏమిటి?
ప్రస్తుతం, మనం సంఖ్య సంబంధ సాంకేతిక విప్లవంలో జీవిస్తున్నాము, చరిత్రలో మునుపెన్నడూ లేనంత సులభంగా సువార్తను వినడానికి ప్రతి ఒక్కరినీ ఇది అవకాశాన్ని కల్పిస్తుంది. ప్రభువైన యేసు యొక్క ముఖ్య ప్రణాళికను నెరవేర్చడానికి సంఘానికి ఇది ఒక పెద్ద అవకాశం అని నేను భావిస్తున్నాను. లూకా 4:18–19లో, ప్రభువైన యేసు యెషయా 61 అధ్యాయాన్ని ప్రస్తావిస్తూ ఇలా అన్నాడు, “–ప్రభువు ఆత్మ నామీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారికి విడుదలను,గ్రుడ్డివారికి చూపును, (కలుగునని) ప్రకటించుటకును నలిగినవారిని విడిపించుటకును ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు.” ఇది ప్రభువైన యేసు క్రీస్తు యొక్క ముఖ్య ప్రణాళిక. మరియు క్రైస్తవులముగా మనం చెయ్యడానికి పిలువబడిన ప్రణాళిక ఇదే.
ప్రభువైన యేసు ప్రణాళికలో, మన లోకాన్ని గురించి పునరాలోచన చెయ్యడంలో మనకు సహాయపడే మూడు ప్రధాన అంశాలు ఉన్నాయి: దేశాల సువార్తీకరణ, సంఘ పునరుజ్జీవనం మరియు సమాజం యొక్క పరివర్తన. సువార్త ప్రచారం విషయంలో, ప్రభువైన యేసును గురించి ప్రజలకు చెప్పడం మీరు వారి కోసం చేయగలిగే అత్యంత ప్రేమపూర్వకమైన పని. ఈ శుభవార్తను లోకానికి తెలియజేయాలని ప్రభువు ఆత్మ మనలనందరినీ ఆహ్వానిస్తున్నాడు. సంఘం యొక్క పునరుద్ధరణ కూడా అత్యంత ప్రాముఖ్యమైనది. మనుషులు తమకు ఎంతో ఆవశ్యకమైన ప్రేమ మరియు స్వస్థతను కనుగొనే స్థలమే ప్రభువైన క్రీస్తు సంఘం. కాబట్టి, లోకంలోని ప్రతి ప్రదేశంలోనూ మనకు సజీవమైన సంఘాలు అవసరం. అంతిమంగా సమాజం యొక్క పరివర్తన మనం కలిగియుంటాము. ప్రభువైన యేసు ప్రణాళికలో సువార్తను ప్రకటించడం మరియు సువార్తను కనుపరచడం రెండూ ఇమిడి ఉన్నాయి. ––పేదల పట్ల శ్రద్ధను కనుపరచడం, రోగులను స్వస్థపరచడం, అణగారిన వారికి అండగా నిలబడడం. కోసం నిలబడటం అనేవి ఉన్నాయి. ఇది సంఘం యొక్క నియామకంలో ఇది ఒక భాగం - రోగుల కోసం ప్రార్థించడం, అణగారిన వారి కోసం నిలబడడం, దేవుడు మన లోకంలో దైవికంగా కార్యాన్ని జరిగిస్తాడని విశ్వసించడం. ఈ అంశాలు అన్నీ సమాజ పరివర్తనలో భాగమే.
దేవుడు మనలను ఈ క్షణంలో ఇక్కడ ఉంచాడు–ఇలాంటి సమయం కోసం–– సువార్త ప్రచారం, పునరుజ్జీవనం మరియు పరివర్తన కోసం.
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
మీరు దేవుని స్వరాన్ని ఎలా వింటారు? ప్రపంచ వ్యాపిత సంక్షోభ సమయాలలో దేవుడు ఏమి చెపుతున్నాడు? ఈ 4-రోజుల ప్రణాళికలో, ఆల్ఫా సంస్థ వ్యవస్థాపకుడు నిక్కీ గుంబెల్ దేవుని స్వరాన్ని వినడానికి సహాయపడే కొన్ని సాధారణ అభ్యాసాలను పంచుకోవడం ద్వారా ప్రారంభించాడు. మనం అందరం ప్రతిస్పందించడానికి దేవుడు మనలను పిలుస్తున్నాడని అతడు గ్రహించిన మూడు ప్రధాన సవాళ్లను అతడు బోధిస్తున్నాడు: సంఘంలో ఎక్కువ ఐక్యత, సువార్త ప్రచారానికి ప్రాధాన్యత ఇవ్వడం మరియు పరిశుద్ధాత్మ మీద అనుదినం ఆధారపడటం.
More
ఈ ప్లాన్‌ను అందించినందుకు మేము ఆల్ఫాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.leadershipconference.org.uk/