సంక్షోభ సమయంలో దేవుని మాట వినడంనమూనా
సౌవార్తీకరణకు పిలుపు
మీ ప్రాధాన్యతల జాబితాలో పరిచర్య మరియు సువార్త ప్రచారం – ప్రభువైన యేసును గురించిన వార్తను ఇతరులతో పంచుకోవడం అనేవి ఏ స్థానంలో ఉన్నాయి? ఇది పరిచర్య మీ జాబితాలో ఎక్కువగా లేకుంటే, దానికి కారణం ఏమిటి అని మీరు అనుకుంటున్నారు మరియు అది ప్రధాన ప్రాధాన్యతగా మారడానికి ఏమి జరగాలి?
నేను సువార్త ప్రచారం పట్ల ఎందుకు మక్కువ చూపుతున్నాను అని ఎవరైనా అడిగినప్పుడు, నేను 18 సంవత్సరాల వయస్సులో ప్రభువైన యేసును ఎదుర్కొన్న క్షణంలో యేసు నా జీవితం మీద చూపిన ప్రభావం వల్లనే అని నేను వివరిస్తాను. ప్రభువైన యేసు మరణం మరియు పునరుత్థానం మానవ చరిత్రలో అత్యంత ముఖ్యమైన క్షణం. ప్రభువైన యేసు వాస్తవంగా తిరిగి లేచాడు. అతని మరణం మరియు సమాధి అంతం కాదు. క్రీస్తులో, మీరు కూడా మృతులలో నుండి లేపబడతారు. మీరు ఎవరికైనా చెప్పగలిగే అత్యుత్తమ వార్త ఇది, నేను అందరికీ చెప్పాలనుకుంటున్నాను.
ప్రజలు ప్రేమ కోసం చూస్తున్నారు. ప్రభువైన యేసు మీ కోసం మరణించి కారణంగా మీరు గాఢంగా ప్రేమించబడ్డారని మీరు తెలుసుకోవచ్చు. పౌలు చెప్పినట్లుగా, దేవుని కుమారుడు నన్ను ప్రేమించి, నా కొరకు తన్ను తాను అర్పించుకున్నాడు (గలతీ 2:20). ప్రభువైన యేసు నీ కోసం మరణించేంతగా నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడని మీకు తెలిసినప్పుడు, అదే జీవితాన్ని మార్చివేసే తరుణం.
ప్రజలు కూడా తమ జీవితాలలో ఒక ఉద్దేశం కోసం వెదకుతున్నారు మరియు అంతిమంగా మీరు దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండేంత వరకు జీవితం అర్ధవంతంగా ఉండదు. దానిని యేసు సాధ్యం చేయడానికి వచ్చాడు. ప్రజలు దేవునితో సంబంధాన్ని ఎదుర్కొన్నప్పుడు, వారు తమ జీవిత ఉద్దేశ్యాన్ని కనుగొంటారు.
కాబట్టి, ప్రపంచంలో ఈ విపరీతమైన ఆకలి ఉంది, ఆ కారణం సంఘాలు అన్ని సమయాలలో సువార్త ప్రచారానికీ మరియు పరిచార్యకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రోత్సహిస్తాము. వాస్తవానికి సంఘం ప్రభువైన యేసు సువార్తను పంచుకోవడానికి ప్రాధాన్యతనిస్తే అది అభివృద్ధి చెందుతుంది. మీరు సువార్త ప్రచారానికి ప్రాధాన్యత ఇస్తే, మిగతా విషయాలన్నీ దానిని అనుసరిస్తాయి. సంఘంలో ఐక్యత చాలా ముఖ్యమైనది, అయితే మీరు దానిని మీ ఏకైక లక్ష్యంగా చేసుకుంటే, మీరు మీ విభేదాలను చర్చిస్తారు. మీరు సువార్త ప్రచారాన్ని మీ లక్ష్యంగా చేసుకుంటే, మీరు ఐక్యంగా ఉండాలి, ఎందుకంటే లోకం విశ్వసించేలా ఐక్యత కోసం ప్రభువైన యేసు ప్రార్థించాడు. సాంప్రదాయం, ప్రదేశం మరియు భాషలలో వ్యత్యాసాలు ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అనేక మంది క్రైస్తవులు ప్రభువైన యేసును ఇతరులతో పంచుకోవాలనే సాధారణ అభిరుచితో ఏకమవుతున్నారు.
మీరు సువార్త ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చినట్లయితే మీరు శిష్యరికంలో ఎదగాలి, ఎందుకంటే మీరు మీ జీవితంలో ఆత్మ యొక్క ఫలాన్ని కలిగి ఉండకపోతే మీరు ఎవరినీ విశ్వాసానికి నడిపించ లేరు. మీరు మరింత ప్రేమగా, మరింత ఆనందంగా, శాంతియుతంగా మారాలి. మనం యేసుకు సాక్షులుగా ఉండేందుకు ఆత్మతో నింపబడడం అనే అంశం అపొస్తలుల కార్యములు 1:8లో మనం దీనిని చూస్తాము, “అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురని వారితో చెప్పెను.” వాస్తవానికి మనం పరిశుద్ధాత మీద ఆధారపడటం యొక్క ప్రాముఖ్యతను ఈ ప్రణాళికను రేపు ధ్యానంలో ముగించినప్పుడు కనుగొంటాము.
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
మీరు దేవుని స్వరాన్ని ఎలా వింటారు? ప్రపంచ వ్యాపిత సంక్షోభ సమయాలలో దేవుడు ఏమి చెపుతున్నాడు? ఈ 4-రోజుల ప్రణాళికలో, ఆల్ఫా సంస్థ వ్యవస్థాపకుడు నిక్కీ గుంబెల్ దేవుని స్వరాన్ని వినడానికి సహాయపడే కొన్ని సాధారణ అభ్యాసాలను పంచుకోవడం ద్వారా ప్రారంభించాడు. మనం అందరం ప్రతిస్పందించడానికి దేవుడు మనలను పిలుస్తున్నాడని అతడు గ్రహించిన మూడు ప్రధాన సవాళ్లను అతడు బోధిస్తున్నాడు: సంఘంలో ఎక్కువ ఐక్యత, సువార్త ప్రచారానికి ప్రాధాన్యత ఇవ్వడం మరియు పరిశుద్ధాత్మ మీద అనుదినం ఆధారపడటం.
More
ఈ ప్లాన్‌ను అందించినందుకు మేము ఆల్ఫాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.leadershipconference.org.uk/