సంక్షోభ సమయంలో దేవుని మాట వినడంనమూనా
ఐక్యతకు పిలుపు
ఇతర క్రైస్తవులు లేదా సంఘం భాగాల నుండి మనల్ని ఏ అడ్డంకులు లేదా సరిహద్దులు వేరు చేస్తున్నాయి? దాని గురించి దేవుడు మనల్ని ఏమి చేయమని పిలుస్తున్నాడు మరియు యేసు అవసరమయ్యే గాయపడిన వ్యక్తులతో నిండిన ప్రపంచాన్ని అది ఏవిధంగా ప్రభావితం చేస్తుంది?
క్రైస్తవులు ఏకీకృతమైనప్పుడు లోకం ప్రభువైన యేసును మరింత స్పష్టంగా చూస్తుంది. ఐక్యత అనేది మన విశ్వాసంలో ప్రధానమైనది. మనం ఒకే దేవుణ్ణి నమ్ముతాము: తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ. త్రిత్వంలో ఐక్యత ఉంది. మరోవైపు, ఆదాము మరియు హవ్వ ఆరంభంలో పాపంలో పడినప్పటి నుండి అనైక్యత మానవజాతి యొక్క శాపంగా ఉంది.
యోహాను 17 అధ్యాయంలో, ప్రభువైన యేసు ప్రార్థించిన ప్రధాన విషయం ఏమిటి? ఐక్యత. లోకంలో విశ్వసించేలా ఐక్యత కోసం ప్రార్థించాడు. మరో మాటలో చెప్పాలంటే, సంఘం ఐక్యంగా లేకుంటే, లోకం విశ్వాసంలోని రాదు. మనం ప్రజలను చేరుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు, మనం ఐక్యంగా లేనట్లయితే వారు విశ్వసిన్హారు. నాకు క్రైస్తవేతరుడైన ఒక స్నేహితుడు ఉన్నాడు మరియు అతడు నాతో ఇలా చెప్పాడు., 'కాథలిక్కులు మరియు ప్రొటెస్టంట్లు నాకు సరిగ్గా ఒకేలా కనిపిస్తారు. మీ ఇద్దరికీ సంఘాలు ఉన్నాయి. మీరిద్దరూ పరలోక ప్రార్థన చేస్తారు. అయితే మీరు ఒకరితో ఒకరు పోట్లాడుకుంటున్నప్పుడు––మీరు దేని గురించి గొడవ పడుతున్నారో––నాకు ఆసక్తి లేదు.’ వారు విశ్వసించే వాటిని తమలో తాము కనీసం అంగీకరిస్తున్నారనే విషయంలో నాకు ఎటువంటి ఆసక్తి లేదు అనే అనే వారు అనేకమంది మంది వ్యక్తులు అక్కడ ఉన్నారని అనుకుంటున్నాను. వారు చేయలేనప్పుడు నాకు ఆసక్తి లేదు కూడా. కాబట్టి, అనైక్యత ప్రజలను దూరం చేస్తుందనీ, వారిని విశ్వసించకుండా ఆపివేస్తుందనీ ఆయనకు తెలుసు కాబట్టి లోకం ఆయన యందు విశ్వాసం ఉంచేలా మనం ఒకటిగా ఉండాలని యేసు ప్రార్థించాడు. అయితే ఐక్యత చాలా ఆకర్షణీయంగా ఉంటుంది మరియు ఇది సంఘంలో ఉండాలి.
ఒక రోజు, దేవుని సింహాసనం యెదుట సంఘంలో పరిపూర్ణ ఐక్యత ఉంటుంది. మనం దీనిని ప్రకటన 7:9లో చూస్తాము, అక్కడ వచనం ఈ విధంగా చెపుతోంది, 'అటు తరువాత నేను చూడగా, ఇదిగో, ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆయా భాషలు మాటలాడువారిలోనుండియు వచ్చి, యెవడును లెక్కింపజాలని యొక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకొన్నవారై, ఖర్జూరపుమట్టలు చేతపట్టుకొని సింహాసనము ఎదుటను గొఱ్ఱెపిల్లయెదుటను నిలువబడి.” వ్యత్యాసం తొలగించబడలేదు; దానిని బట్టి ఉత్సవంగా ఉన్నారు. మరియు చాలా రమ్యంగా ఉంది. “నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమిమీదను నెరవేరును గాక” (మత్తయి 6:10) అని ప్రార్థించమని యేసు మనకు బోధించాడు. కాబట్టి, పరలోకంలో దేవుని చిత్తం ఏమిటి? ఐక్యత, సింహాసనం ముందు కలిసి ఆరాధించడం. కాబట్టి, ఇది సంఘం యొక్క విధి–సంఘంలోని వివిధ భాగాలు, విభిన్న తెగలు, వివిధ సంఘాల మధ్య ఐక్యత ఉండడం. భూమి మీద ఉన్న సంఘం ఎంత త్వరగా పరలోకంలోని సంఘంలా కనిపిస్తుందో, అప్పుడు అది మరింత ప్రభావవంతంగా ఉంటుంది.
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
మీరు దేవుని స్వరాన్ని ఎలా వింటారు? ప్రపంచ వ్యాపిత సంక్షోభ సమయాలలో దేవుడు ఏమి చెపుతున్నాడు? ఈ 4-రోజుల ప్రణాళికలో, ఆల్ఫా సంస్థ వ్యవస్థాపకుడు నిక్కీ గుంబెల్ దేవుని స్వరాన్ని వినడానికి సహాయపడే కొన్ని సాధారణ అభ్యాసాలను పంచుకోవడం ద్వారా ప్రారంభించాడు. మనం అందరం ప్రతిస్పందించడానికి దేవుడు మనలను పిలుస్తున్నాడని అతడు గ్రహించిన మూడు ప్రధాన సవాళ్లను అతడు బోధిస్తున్నాడు: సంఘంలో ఎక్కువ ఐక్యత, సువార్త ప్రచారానికి ప్రాధాన్యత ఇవ్వడం మరియు పరిశుద్ధాత్మ మీద అనుదినం ఆధారపడటం.
More
ఈ ప్లాన్‌ను అందించినందుకు మేము ఆల్ఫాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.leadershipconference.org.uk/