మహిమను తిరిగి స్వాధీనము చేసుకొనుటనమూనా

మహిమను తిరిగి స్వాధీనము చేసుకొనుట

5 యొక్క 1

మహిమ

మహిమ అనేది క్రైస్తవ లోకములో తరచుగా ఉపయోగించే పదం మరియు నిజంగా దాని అర్థం ఏమిటో మీరు అయోమయంలో పడి ఉండవచ్చు. ఈ పదం యొక్క భావం ఏమిటో తెలిసినప్పటికీ ఇంకా అది సూచించే పరిమాణాన్ని పట్టించుకోని అనేకమందిలో మీరు ఒకరు కావచ్చు. ఈ రోజు మీరు ఏ ప్రదేశంలో ఉన్నా,అది పట్టింపు లేదు. మహిమ అనేది దేవునికి ఆపాదించబడిన పదం మరియు ఆయనకు మాత్రమే ఆపాదించబడాలి. మనము పనిలో గానీ లేదా పాఠశాలలో గానీ ఏదైనా అసాధారణమైన దానిని సాధించినప్పుడు,మనకు తరచుగా కొంత కీర్తి లభిస్తుంది. యుద్ధం మరియు జయము సంభవించిన సందర్భములో“ధైర్యం లేకపోతే కీర్తి లేదు”అని ప్రస్తావించబడిన పదబంధాన్ని మనం విన్నాము.

"డోక్సా"పదంమహిమ కోసం వాడబడిన గ్రీకు పదం. ఇది అక్షరాలా భారీ అని అర్థం. ఒకదాని అంతర్గత విలువ,సారాంశాన్నీ లేదా సారాన్నీ సూచిస్తుంది. మహిమ అనే పదాన్ని దేవునికి మాత్రమే ఆపాదించవచ్చు,ఎందుకంటే ఆయన మాత్రమే దానికి నిజంగా అర్హుడు. ఆయన శక్తి,ఆయనమహిమ,ఆయన కరుణ,ఆయన బలము,ఆయన సృజనాత్మక జ్ఞానం, ఆయన సార్వభౌమ సంకల్పం మరియు మానవజాతి యెడల ఆయన కరుణ (కొన్నింటిని మాత్రమే ప్రస్తావించడం జరిగింది), ఇవి ఆయన నుమహిమకు పూర్తిగా అర్హుడిని చేసే కొన్ని లక్షణాలు.

అపొస్తలుడైన యోహాను వ్రాస్తూ,యేసు శరీరమై మన మధ్య నివసించిన వాక్యము అని వ్రాసాడు. "షెకినా" అనే హీబ్రూ పదం దేవుని యొక్క మహిమను వర్ణించడానికి ఉపయోగించబడింది మరియు ఈ వచనములో యేసు భూమి మీదకు వచ్చినప్పుడు మనము ఆయన (షెకినా) మహిమను చూసాము,కృప,సత్య సంపూర్నుడిగా మనం దేవుని కుమారుని మహిమను చూసాము. షెకినా అనేది దేవుని సన్నిధిలో అద్భుతంగా కనిపించే మహిమ. ఇది మన తీవ్రమైన కలలకు మించినది,ఐశ్వర్యం మరియు ఆడంబరం యొక్క మన అత్యంత విపరీత ఆలోచనలకు మించినది. ఇది రాజుల రాజు, ప్రభువుల ప్రభువుకు సరిపోయే మహిమ.

ఈ రోజు,మీరు ఎవరైనా లేదా మీరు ఎక్కడ ఉన్నా లేదా మీరు ఏమి చేసినా,ప్రభువైనయేసును మీ జీవితము లోనికి తిరిగి ఆహ్వానించవచ్చు మరియు ఆయన వచ్చినప్పుడు,ఆయన మనతో ఉండడానికి వస్తాడు. ఆయన ఎక్కడ ఉన్నాడో,అక్కడ మనం ఆయన మహిమను చూస్తాము. ఆయన మీ సామర్థ్యానికి మించి మీకు అధికారం ఇచ్చినప్పుడు అది పనిలో ప్రదర్శించబడడాన్ని మీరు చూస్తారు. మీ అసహనాన్ని మీ బిడ్డ క్షమించినప్పుడు మీరు దానిని మీ గృహంలో చూస్తారు. ముఖ్యంగా కష్టతరమైన రోజున మీ యెడల ఒక అపరిచితుడు చూపిన దయతో మీరు దానిని చూస్తారు. యేసు ఎక్కడ ఉన్నాడో,అక్కడ ఆయన మహిమ కనుపరచాబడుతుంది. మీరు కొంత ప్రశంస పొందవచ్చు,అయితే మీరు ఆయనకు మహిమను అందించేలా చూసుకోండి!

ప్రకటన: యేసు - నీవు నాతో ఉన్న దేవుడవు,ఇమ్మానుయేలు. నీవు అన్ని విధాలుగా మహిమాన్వితుడవు!

వాక్యము

రోజు 2

ఈ ప్రణాళిక గురించి

మహిమను తిరిగి స్వాధీనము చేసుకొనుట

దేవుని మహిమ అనేది మనం విన్న విషయం, అయితే దాని పరిచయం కారణంగా ఆ పదాన్ని మనం తేలికగా తీసుకుంటాము. ఈ క్రిస్టమస్ మీ దృక్కోణములో కొంత భాగాన్ని గానీ లేదా అంతటిని గానీ మార్చడానికి మీరు అనుమతిస్తూ ఉండగా, దేవుని గురించి బాగా తెలిసిన ఇంకా పదునైన సత్యాన్ని మీరు తిరిగి ఆలోచిస్తారని మేము ఆశిస్తున్నాము.

More

ఈ ప్లాన్‌ను అందించినందుకు మేము వి ఆర్ జియోన్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.instagram.com/wearezion.in/