మహిమను తిరిగి స్వాధీనము చేసుకొనుటనమూనా
మన్నులో మహిమ
ఈ నాటి బైబిలు వచన భాగాన్ని మీరు దానిని త్వరగా చదవినట్లయితే,అదిదాదాపుగా ఐహిక సంబంధమైనదిగా కనిపిస్తుంది. అయితే మీరు దానిని తిరిగి చదవమని మిమ్ములను కోరుచున్నాను,ఈసారి నెమ్మదిగా చదవండి. వాస్తవంగా అక్కడ పేర్కొన్న అన్ని పేర్ల మీద మనసు పెట్టి చదవండి. అక్కడ కొన్ని తెలిసిన పేర్లు ఉన్నాయి,కొన్ని తెలియనివి కూడా ఉన్నాయి. మీకు సమయం ఉంటే ఆదికాండము,నిర్గమకాండము,రాజులు మరియు ప్రవక్తల పుస్తకాలకు తిరిగి వెళ్ళడానికి ప్రయత్నించండి,అక్కడ వారి జీవిత కథలు ప్రతి ఒక్కటి మరింత వివరంగా పొండుపరచబడడం మీరు చూస్తారు.
ఆశ్చర్యకరంగా వారి వృత్తాంతములు మహిమకరంగా లేవు. నిజానికి అవి నిస్సందేహంగా లజ్జాకరమయినవిగా ఉన్నాయి! యాకోబు కుమారుడైన యూదా తన కోడలిని వేశ్యగా భావించి ఆమెతో శయనించాడు. మరియు వారికి కవల కుమారులు జన్మించారు,వీరిలో ఒకడు వంశావళిలో చేర్చబడ్డాడు. రాహాబు,ఒక సత్రం నిర్వాహకురాలు, ఆమె వేశ్య జాబితాలో చేరింది,అయితే బోయజు వివాహం చేసుకున్న యూదురాలు కాని రూతుకూడా ఈ కుటుంబ శ్రేణిలో చేర్చబడినది. ప్రస్తావించబడిన కొందరు రాజులు ఘోరమైన పాపాలు చేసారు మరియు ఇశ్రాయేలు దేశాన్ని భయంకర పాపం,దుర్మార్గం మరియు విగ్రహారాధనలోనికి నడిపించారు. ఇంత రంగుల మాయమైన గతం ఉన్న మనుష్యులు దేవుని కుమారుడైన యేసు కుటుంబ వృక్షంలో చేర్చబదడం ఆశ్చర్యంగా ఉందా?
నిష్పక్షపాతంగా చెప్పాలంటే,ప్రభువైనయేసు అందుకు ప్రసిద్ధి. సమాజములోని అత్యంత తృణీకరించబడిన వారితో భోజనం చేసిన ఒక పాపుల స్నేహితుడు. స్వస్థత కోసం తన వద్దకు వెళ్ళిన అనేక మంది జబ్బుపడిన మరియు అనారోగ్యంతో ఉన్నవారిని తాకిన మనుష్యుడు. తన సందేశాన్ని వినే ప్రతి ఒక్కరితోనూ మరియు ఎవరితోనైనా అప్రయత్నంగా మమేకమయ్యే బోధకుడు.మనుష్యులను వారి అత్యల్ప,భయంకరమైన,విచారకరమైన స్థితిలో కనుగొనడం ఆయన ప్రత్యేకత. వారిని కుమారుడు మరియు కుమార్తె స్థాయికి తీసుకొని వెళ్ళడం.
గత జీవితంలో దయ్యము పట్టి దానినుండి యేసుచేత విడుదల చేయబడిన మగ్దలేనే మరియ,ఆయనపరివారములో ఒక భాగస్తురాలు. మత్తయి,తృణీకరించబడిన యూదు పన్ను వసూలు దారులలోభాగమైనవాడు, అతడు యేసు ప్రధాన బృందములో చేరాడు. యూదా,ఒకఅబద్ధాలకోరు మరియు కుట్రదారుడు ఆయన పక్కన మూడు సంవత్సరాలు ఉన్నాడు. ఆయన అంతర్గత వృత్తములో ఒకరైన సీమోను,ఆయనఅత్యంత అవసరమైన సమయములో ఆయనను తిరస్కరించాడు,అయినప్పటికీసువార్త యొక్క గొప్ప వాహకులలో ఒకడుగా పునరుద్ధరించబడ్డాడు.
వ్యసనం,తప్పుడు సంబంధం లేదా పాపభరితమైన గతం కారణంగా మీరు దేవుని యొక్క కుటుంబం నుండి మిమ్ములను మీరు అనర్హులుగా చేసికొని ఉండవచ్చు. మీ జీవితములో యేసు ఉన్నప్పుడు,ఆయనమట్టి నుండి మహిమను తీసుకొని వస్తాడు. మీ వృత్తాంతము ఆయన ఉత్తమ రచన అవుతుంది. కల్వరి వద్ద ఆ సిలువ మీద చిందించిన ఆయన రక్తం యొక్క శక్తితో మీ దుమ్ము కొట్టుకుపోతుంది.
ఆయన మాత్రమే మన ముక్కలను పైకి తీయగలడు మరియు వాటిని అత్యంత అద్భుతమైన మార్గాలలో కలుపగలదు. మిమ్ములను మీరు లెక్కించకోవద్దు. మీరు దేవుని కుటుంబానికి చెందినవారు మరియు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నుండి మరియు ఆయన కుటుంబం నుండి మిమ్ములను దూరంగా ఉంచిన విషయాల గురించి పశ్చాత్తాపపడండి. మిమ్ములను తిరిగి ఆలింగనం చేసుకోవడానికి ఆయనను అనుమతించండి!
ప్రకటన: నేను దేవుని యొక్క బిడ్డను. నేను అసంపూర్ణుడిని అయితే నేను పరిపూర్ణమైన ఒక తండ్రిచేత ప్రేమించబడ్డాను మరియు ఆదరించబడ్డాను.
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
దేవుని మహిమ అనేది మనం విన్న విషయం, అయితే దాని పరిచయం కారణంగా ఆ పదాన్ని మనం తేలికగా తీసుకుంటాము. ఈ క్రిస్టమస్ మీ దృక్కోణములో కొంత భాగాన్ని గానీ లేదా అంతటిని గానీ మార్చడానికి మీరు అనుమతిస్తూ ఉండగా, దేవుని గురించి బాగా తెలిసిన ఇంకా పదునైన సత్యాన్ని మీరు తిరిగి ఆలోచిస్తారని మేము ఆశిస్తున్నాము.
More
ఈ ప్లాన్‌ను అందించినందుకు మేము వి ఆర్ జియోన్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.instagram.com/wearezion.in/