మహిమను తిరిగి స్వాధీనము చేసుకొనుటనమూనా
మహిమ నుండి మహిమకు
దేవుని యొక్క సన్నిధిలో మీరు దేవుని యొక్క మహిమను అనుభవిస్తారు. యేసు అనుచరులుగా,మనం సమర్పణతో మరియు ఉద్దేశపూర్వకంగా ప్రతిదినం ఆయన ఉనికిని పొందడం అవసరం. మేల్కొనడం లేదా పళ్ళు తోముకోవడం వంటి మన రోజువారీ దినచర్యల వలె ఇది చాలా ముఖ్యమైనది. క్రైస్తవునికి అవసరమైన "మౌనధ్యాన సమయం" గురించి బైబిలు పేర్కొనకపోవటం నిజమే అయినప్పటికీ,యేసు చాలా సందర్భాలలో అన్నింటికీ దూరంగా ఉన్నాడు,ఆయనతన తండ్రితో సమయం గడపడానికే చేస్తున్నాడని పేర్కొంది. దేవుని కుమారుడు,లోకాలను సృష్టించినవాడు మరియు శరీరముతో ఉన్న దేవుడు అలా చేయవలసి వస్తే,మనమందరం దీనిని చేయడం అత్యవసరం అనిపిస్తుంది.
మనం ఆయన సన్నిధిలో గడిపే ఈ సమయాలు మనం ఆయన మహిమను చూసినప్పుడు మరియు ఈ మహిమ ద్వారా మనం రూపాంతరం చెందడం. మన రక్షణ వరకు,మన హృదయాలను మరియు మనస్సులను కప్పి ఉంచే ఒక ముసుగు మనము కలిగి ఉన్నాము. యేసు వైపు తిరగడం మరియు ఆయనకు మన జీవితాలలో అత్యున్నతమైన అధికార పీఠాన్ని ఇవ్వడం ద్వారా,మేలు కోసం ముసుగు తీసివేయబడిందని మనం కనుగొంటాము. ఇప్పుడు ముసుగు పోయింది కాబట్టి పరిశుద్దాత్మ తీసుకువచ్చే స్వేచ్ఛను మనం అనుభవించవచ్చు మరియు దీనితో పాటు మనం దేవుని మహిమను ప్రతిబింబించడం ప్రారంభిస్తాము.
మీరు ఎప్పుడైనా వీధి దీపాలు లేని రహదారి లేదా కొండ మీద నడిపి ఉంటే,అయితే రహదారి మీద లేదా వంపులలో పరావర్తకాలు మాత్రమే ఉన్నట్లయితే,మీకు ప్రతిబింబించే పని గురించి తెలుస్తుంది. పరావర్తకము మీద కాంతి ప్రకాశిస్తే తప్ప అది చీకటిగా ఉంటుంది. ఇది కాంతిని స్వీకరించినప్పుడు మాత్రమే అది తిరిగి ప్రతిబింబిస్తుంది మరియు మన ప్రధాన దీపాలు వెలుగుతూ ఉండేలా ఉంచుకుని నడుపుచున్నప్పుడు మనకు కనిపిస్తుంది. దేవుని మహిమను ప్రతిబింబించేలా మనం సృష్టించబడ్డాము మరియు తిరిగి జన్మించాము. దీనర్థం మనం ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు ఆయన మహిమ మనమీదప్రకాశించడం ప్రారంభించి,మనలను కొద్దికొద్దిగా ఆయన పోలికగా మారుస్తుంది.
ఇది అక్కడితో ఆగదు. ఈ పరివర్తన మన జీవితంలోని ప్రతి అంశాన్ని తాకుతుంది. మన పొరుగు ప్రాంతాలు,ఉద్యోగాలు,పాఠశాలలు మరియు కళాశాలలోనికి అడుగుపెట్టినప్పుడు,ఆ ప్రదేశాల లోనికి మనతో పాటు దేవుని మహిమను తీసుకువెళతాము. మనము ఆయన వెలుగును మన లోకములోని చీకటి అతుకులు లోనికి ప్రకాశిస్తాము,తద్వారా యేసును ప్రతి సందు మరియు బీటలు లోనికి తీసుకువస్తాము.
మీరు మహిమ నుండి మహిమకు తీసుకు వెళ్ళబడటానికి సిద్ధంగా ఉన్నారా?
ప్రకటన: నేను దేవుని యొక్క మహిమను ప్రతిబింబించేవాడిని. నేను ఆయన మహిమను నాలో తీసుకువెళతాను మరియు నా లోకములో ప్రకాశిస్తాను.
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
దేవుని మహిమ అనేది మనం విన్న విషయం, అయితే దాని పరిచయం కారణంగా ఆ పదాన్ని మనం తేలికగా తీసుకుంటాము. ఈ క్రిస్టమస్ మీ దృక్కోణములో కొంత భాగాన్ని గానీ లేదా అంతటిని గానీ మార్చడానికి మీరు అనుమతిస్తూ ఉండగా, దేవుని గురించి బాగా తెలిసిన ఇంకా పదునైన సత్యాన్ని మీరు తిరిగి ఆలోచిస్తారని మేము ఆశిస్తున్నాము.
More
ఈ ప్లాన్‌ను అందించినందుకు మేము వి ఆర్ జియోన్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.instagram.com/wearezion.in/