విమోచననమూనా
మంచి మనుషులు తాత్కాలికమైన విమోచనను ఇస్తారు.
దేవుడు తన సృష్టిలోని అనంత మానవకోటి నుండి అబ్రాహామును తాను ఏర్పాటుచేసుకున్న ప్రజలకు తండ్రిగా ఎన్నుకున్నాడు. అబ్రాహాము సంతతి లెక్కపెట్టలేనంతగా ఉంటారని, వారు లోకంలోని జనా లందరికి ఆశీర్వాదకారణంగా ఉంటారని దేవుడు అతనితో వాగ్దానం చేశాడు. దేవుడు అబ్రాహామును, ఇస్సాకును, యాకోబును గొప్పగా ఆశీర్వదించాడు, వారి సంతతి అణచివేయబడలేనంతగా వర్ధిల్లి విశేషమైన గుర్తింపు గలవారయ్యారు. ఎంతగానంటే ఐగుప్తు రాజైన ఫరో వారు వర్ధిల్లకుండా వారిని అణచివేయాలని నిర్ణ యించుకున్నాడు. ఫరో వారికున్న దైవికమైన ఆశీర్వాదాన్ని చులకనగా అంచనా వేశాడు. వారికి విమోచన అవసరమైంది, వారిని ఐగుప్తునుండి వెలుపలికి నడిపించి వాగ్దానదేశానికి తీసుకొని వెళ్లడంకొరకు దేవుడు వారి స్వజనంలోనుండి ఒక వ్యక్తిని పంపించాడు. మోషే తన జీవితకాలమంతా దేవునిపట్ల నమ్మకంగా ఉన్నాడు, ఆరు లక్షలమంది ఇశ్రాయేలీయులను వారి ఆశీర్వాదపు అంచుకు నడిపించాడు. మోషే ఎక్కడ ఆపాడో అక్కడనుండి యెహోషువ కొనసాగించాడు. యెహోషువ వారిని వాగ్దానదేశంలోకి తీసుకొని వెళ్లి, దేశాన్ని స్వాస్థ్యంగా పంచి ఇచ్చాడు. ఇది మోషే యెహోషువలకు అంత సుళువైన విషయం కాదు, ఐగుప్తులో అన్యాచారాలను అనుసరిస్తూ తమ దేవునిగురించి స్వల్పజ్ఞానం గల స్త్రీపురుషులను నడిపించడం అంత సుళువైనది కాదు. వారిలో విగ్రహారాధన మరియు తిరుగుబాటుతనం లోతుగా పాతుకొని పోయాయి, దేవుడు క్రొత్త తరాన్ని వాగ్దానదేశంలోకి నడిపించడంకొరకు పాతతరం పూర్తిగా గతించేవరకు వేచిచూశాడు. యెహోషువ తర్వాత విచారకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి, తమ పితరుల దేవునిగురించి తెలియని క్రొత్త తరం వచ్చింది. దేవుడు తన మహాశక్తితో తన ప్రజల పక్షాన చేసిన మహాద్భుత కార్యాలు వీరికి తెలియవు. అందుచేత, వారు అపనమ్మకానికి నమ్మకానికి మధ్య ఊగిసలాడారు. కాబట్టి సర్వాధికారి అయిన దేవుడు వారిమీదకు శత్రు సైన్యాలను అనుమతించాడు, శత్రువులు దేవుని ప్రజలను అణచివేసి, వారి దేశాన్ని ధ్వంసం చేశారు. ప్రజలు తమ బాధను భరించలేక ఆయనకు మొఱపెట్టినప్పుడు ఆయన వారిమీద జాలిపడి వారికొరకు విమోచకు లను పంపించాడు. ఈ విమోచకులు వారికి శత్రువులమీద విజయం ఇవ్వడం మాత్రమే కాక వారిమీద న్యాయాధిపతులుగా కూడ ఉన్నారు. ఈ న్యాయాధిపతులు ప్రజల సామాజిక మరియు ఆధ్మాత్మిక అవసరా లను కూడ చూశారు. అయితే ఇది శాశ్వతమైన పరిష్కారం కాదు, ఎందుకంటె న్యాయాధిపతి మరణానంతరం ప్రజలు త్వరలోనే దేవుడిని మరచిపోయారు. వారి ఆధ్యాత్మిక జీవితంలోని ఒడిదుడుకులు మనకు విసుగు తెప్పించినా వారు మనవంటి వారే కదా!
తలంపు:
మన జీవితాలలో ఏ మనిషీ దేవుడు రప్పించిన శూన్యతను నింపలేడు.
ఈ ప్రణాళిక గురించి
మన విమోచన కొరకు దేవుడు క్రీస్తును పంపించడంలో చేసినదానినంతటిని పునరాలోచనతో ధ్యానించుకొనడానికి క్రిస్టమస్ ఒక సంపూర్ణమైన సమయం. మీరు ఈ ధ్యానాన్ని చదువుతూ ఉండగా, మీరు మీ స్వంత విమోచనను జ్ఞాపకం చేసుకుంటూ, మీ ముందు ఉన్న బాటమీద మీరు నిశ్చయతతో నడవడం కొరకు ఆయన మిమ్మల్ని మళ్లీ అన్నిటినుండి విమోచిస్తాడని నా ప్రార్థన.
More
ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము Christine Jayakaranకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.instagram.com/wearezion.in/