విమోచననమూనా
రాజులు విడిపించడానికి ప్రయత్నించారు
దేవుని ప్రజలు మనవంటి వారే, ఈ పోలిక భయం కలిగిస్తుంది. న్యాయాధిపతుల కాలం తర్వాత, తన స్వరాన్ని ఎరిగిన ఒక ప్రవక్తను దేవుడు రప్పించాడు. దేవుడు స్వయంగా ఇచ్చిన సూచనల ప్రకారం సమూ యేలు ఇశ్రాయేలీయులను నడిపించాడు. అతను దేవునికి ప్రజలకు మధ్య ఉన్నాడు, తన ప్రజల పట్ల శ్రద్ధా సక్తులు కలిగినవాడు. అతని నాయకత్వం సజీవుడైన దేవునితో అన్యోన్యభాగస్వామ్యంయొక్క ఫలితం, కాబట్టి ప్రజలు తమను నడిపించడానికి ప్రవక్త వద్దని నిర్ణయించుకున్నప్పుడు అతను ఎంతగా దిగులుపడి ఉంటాడో మీరు ఊహించుకొనగలరు. ఇరుగుపొరుగున ఉన్న రాజ్యాలకు రాజులు ఉన్నట్టుగా వారు తమకు కూడ రాజు కావాలని అడిగారు. వారు తమ అస్తిత్వానికి మూలాధారమైన అంశాన్ని మర్చిపోయారు, దేవుడు వారిని లోకంలోని జనాలందరినుండి ప్రత్యేకపర్చాడు. ఆయన వారిని తనకొరకు ఎన్నుకున్నాడు. ఆయన వారిపట్ల పౌరుషం కలిగి ఉండి, వారిని గొప్ప ఉద్దేశాలకొరకు ప్రతిష్ఠించాడు. అయినప్పటికి వారు ఈ కోరిక కోరు కున్నప్పుడు, దేవుడు ఇశ్రాయేలుమీద రాజుగా సౌలును అభిషేకించాడు. సౌలు దేవునిపట్ల నమ్మకంగా ఉండ లేకపోయాడు, దేవుడు దావీదును రాజుగా చేశాడు. అనంతర కాలంలో వచ్చిన రాజులకు దావీదు ఆదర్శ వంతుడైన రాజు అయ్యాడు. రాజుకు అవశ్యంగా ఉండవలసినవి అతను దేవుని వాక్యానికి విధేయుడై జీవించడం, జ్ఞానవివేకాలతోను నీతిన్యాయాలతోను ప్రజలను పరిపాలించడం. అనుకున్నట్టుగానే ఉత్తమమై రాజులు సైతం నిర్దోషులుగా లేరు. కాలక్రమంలో రాజకుటుంబం నైతికంగా పతనం చెందింది, ఆధ్యాత్మికంగా భ్రష్టమైంది. తుదకు దేవుడు వారిని, దేశప్రజలను కఠినాత్ములు క్రూరులు అయిన శత్రువుల చేతులకు అప్ప గించాడు. అన్నిటికంటె ఘోరమైన విషయం ఏమిటంటే వాగ్దానదేశం శత్రువుల దాడులకు ధ్వంసమయ్యింది, దేశప్రజలు పరదేశాల చెర లోకి వెళ్లారు. విచారకరమైన విషయమేమిటంటే ప్రజలు చెరలోకి వెళ్లినప్పుడు వారి రాజులు రాబోయే విపత్తునుండి చీకటిముసుగులో తప్పించుకొనబోయారుగాని, శత్రువులచేత పట్టబడి బందీ లుగా తీసుకొనిపోబడ్డారు. ప్రజలను విమోచించవలసిన రాజులు వారిని విమోచించలేని అశక్తులు కావడం ఎంత హృదయవిదారకం. జాతిని దేవునివైపు, దేవుడు నిర్దేశించిన భవితవ్యంవైపు నడిపించడంలో రాజులకు ముఖ్యపాత్ర ఉందని స్పష్టమవుతుంది.
తలంపు:
మన నాయకులు మనలను బలంతోను జ్ఞానంతోను నడిపించడంలో కార్యసాధకులుగా ఉండడం కొరకు వారి నిమిత్తం ప్రార్థించడం చాలా ముఖ్యం.
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
మన విమోచన కొరకు దేవుడు క్రీస్తును పంపించడంలో చేసినదానినంతటిని పునరాలోచనతో ధ్యానించుకొనడానికి క్రిస్టమస్ ఒక సంపూర్ణమైన సమయం. మీరు ఈ ధ్యానాన్ని చదువుతూ ఉండగా, మీరు మీ స్వంత విమోచనను జ్ఞాపకం చేసుకుంటూ, మీ ముందు ఉన్న బాటమీద మీరు నిశ్చయతతో నడవడం కొరకు ఆయన మిమ్మల్ని మళ్లీ అన్నిటినుండి విమోచిస్తాడని నా ప్రార్థన.
More
ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము Christine Jayakaranకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.instagram.com/wearezion.in/