విమోచననమూనా
ప్రవక్తలు విమోచన గురించి మాట్లాడారు
ఇశ్రాయేలును పరిపాలించిన రాజులు ప్రజలను చెర లోకి నడిపించగా, వారి ప్రవక్తలు చెర కొరకు మరియు చెర అనంతర జీవితంకొరకు ప్రజలకు సిద్ధబాటు కలిగించారు. ప్రవక్తల సందేశాలలో చాలా భాగం వినాశనంగురించి అగమ్యగోచరమైన పరిస్థితి గురించి ఉన్నప్పటికి, వారు నిరీక్షణాస్పదమైన సందేశాలను కూడ ప్రకటించారు. దేవుడు తన ప్రవక్తలతో మాట్లాడాడు, ఆ సందేశాలు ఎంత భయానకంగా ఉన్నప్పటికి వాటిని ప్రవక్తలు యథాతథంగా ప్రజలకు అందించారు. అయితే ప్రజలు వాటిని గుర్తించే విధంగాను వినయ విధేయతలతోను ప్రతిస్పందించక హీనమైన ఉదాసీనతతోను అనాసక్తతతోను వ్యవహరించారు. వారు సజీవు డైన దేవుడిని అనుసరించడం వదిలిపెట్టి, కొయ్యబొమ్మలను రాతి విగ్రహాలను అనుసరించారు. వారు తమ ఏకైక నిజదేవుడిని ఆరాధించడానికి బదులుగా ఏ దేశాలలోకి చెరలోకి వెళ్లారో ఆ దేశాలతో మిళితమయ్యారు. వారు భ్రష్టులైనప్పటికి దేవుడు వారిమీద చూపిస్తున్న ఎడతెగని ప్రేమగురించి ప్రవక్తలు సందేశాలు తెలియ జేశారు. దేవుని దగ్గరనుండి వచ్చే శిక్షమీద దేశవాసులు తమ దృష్టిని నిలిపేలా ప్రవక్తలు అవిశ్రాంతంగా ప్రయ త్నించారు. వారి మూర్ఖత్వానికి, అవిధేయతకు, బాహాటమైన పాపాలకు శిక్ష తగినదే. దైవజనులు దేవుని మాటలను ఉన్నవి ఉన్నట్టుగా చెప్పారు, వారి యథార్థతనుబట్టి శ్రమ పొందారు. ప్రవక్తలు తమ స్వంత జనంచేత తృణీకరించబడ్డారు, హింసించబడ్డారు. తమ స్వంత జనానికే పరాయివాళ్లైన ప్రవక్తలు అగ్నివంటి శ్రమలో ధైర్యానికి మారుపేరుగా నిలిచారు. విచారకరమైన విషయమేమిటంటే, దైవికమైన దర్శనాలు లేవు, వాటిని చూచిన ప్రవక్తలను వారు నమ్మలేదు. అందుచేత వారు శత్రువుల చేతులలో నాశనమయ్యారు. శేషం అనబడే కొద్దిమంది మాత్రమే ముందుగా చెప్పబడినట్టుగా యెరూషలేముకు తిరిగివచ్చారు. ఇశ్రాయేలీయుల అపనమ్మకానికి మూలకారణాన్ని గుర్తించినట్లయితే అది వారు తమ దేవుడిని కాక అన్యజనాన్ని అన్యాచారా లను ఆశ్రయించడమే. ఒక్క మాటలో చెప్పాలంటే వారి నాశనానికి కారణం వారి విగ్రహారాధన. వారి భావో ద్వేగాలు వారి ప్రేమానురాగాలు దేవునిమీద లేవు. అందువలన వారి ఆరాధన నీరుకారిపోయింది, చివరకు గురి తప్పింది. వారి దుష్టత్వంనుండి వారిని ఏ ఒక్క ప్రవక్త సైతం విమోచించలేకపోయాడు.
తలంపు:
దేవోక్తిలేనియెడల ప్రజలు నశించిపోతారు.
ఈ ప్రణాళిక గురించి
మన విమోచన కొరకు దేవుడు క్రీస్తును పంపించడంలో చేసినదానినంతటిని పునరాలోచనతో ధ్యానించుకొనడానికి క్రిస్టమస్ ఒక సంపూర్ణమైన సమయం. మీరు ఈ ధ్యానాన్ని చదువుతూ ఉండగా, మీరు మీ స్వంత విమోచనను జ్ఞాపకం చేసుకుంటూ, మీ ముందు ఉన్న బాటమీద మీరు నిశ్చయతతో నడవడం కొరకు ఆయన మిమ్మల్ని మళ్లీ అన్నిటినుండి విమోచిస్తాడని నా ప్రార్థన.
More
ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము Christine Jayakaranకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.instagram.com/wearezion.in/