బలం మరియు ధైర్యంతో జీవించండినమూనా

బలం మరియు ధైర్యంతో జీవించండి

8 యొక్క 3

“పరలోక రాయబారి – పరిశుద్ధాత్మ”

రాయబారి అంటే ఒక ప్రభుత్వం వేరొక ప్రభుత్వం వద్దకు తమ ప్రతినిధిగా వారి ప్రజల మధ్యలో నివసించి, ఇరుదేశాల మధ్య శాంతి మరియు సదభిప్రాయం కలిగి ఉండేట్లు చూసే పనిని కలిగివుంటాడు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వ అధికారము, దాతృత్వము మరియు వనరుల విషయంలో బాధ్యతను వహిస్తాడు. తనపై పూర్తి నమ్మిక ఉంచినట్లే అతడు హుందాతనం మరియు సంపూర్ణతతో తనకు అప్పగింపబడిన ఉద్దేశాలను నెరవేరుస్తాడు.

అనేక విధాలుగా, పరిశుద్ధాత్మ పని పరలోకము నుండి వచ్చిన రాయబారి పనిని పోలి ఉంటుంది. దేవుని యొక్క సమస్త అధికారం, శక్తి మరియు వనరులు కలిగినవాడై, ఆయన సన్నిధి ద్వారా మరియు కార్యముల ద్వారా భూమిపై ఉన్న ప్రతి ఒక్కరికీ దేవుని ప్రేమను కనుపరుస్తాడు.

తన శిష్యులతో యేసు ఉండబోయే సమయం ముగింపుకు వస్తుండగా, ఆయన వెళ్ళిపోయిన తర్వాత వారు ఒంటరిగా విడిచిపెట్టబడరని వారితో చెప్పాడు. వారితో ఉండటానికి, వారిని మార్గము చూపించడానికి, బోధించడానికి, వారిని అదరించడానికి మరియు నడిపించడానికి ఆయన స్థానంలో పంపబడబోతున్నవాని గూర్చి ఆయన వారితో చెప్పాడు – అదే పరిశుద్ధాత్మ. యేసు ఇలా చెప్పాడు:

“అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్లిపోవుటవలన మీకు ప్రయోజనకరము; నేను వెళ్లనియెడల ఆదరణకర్త మీయొద్దకు రాడు; నేను వెళ్లినయెడల ఆయనను మీయొద్దకు పంపుదును.” యోహాను 16:7

భూమిపై యేసు పని ముగిసిన తర్వాత, ఆయన మరలా తిరిగి వచ్చేవరకు మనతో కూడా తన స్థానంలో ఉండటానికి పరిశుద్ధాత్మను పంపించాడు. పరిశుద్ధాత్మ మన జీవితాల్లో మార్గనిర్దేశం, నాయకత్వం, ఆదరణ మరియు ఆలోచన అనుగ్రహిస్తాడు. యేసు పరిశుద్ధాత్మ గూర్చి తన శిష్యులకు ఈవిధంగా వర్ణించాడు:

“ఆదరణకర్త, అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును.” యోహాను 14:26

పరిశుద్ధాత్మ రూపంలో దేవుని సన్నిధి నేడు మనతో ఉంది; మరియు ఆయన మన లోకంలో మరియు మన జీవితాల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్నాడు.

రోజు 2రోజు 4

ఈ ప్రణాళిక గురించి

బలం మరియు ధైర్యంతో జీవించండి

మీరు ఎన్నడూ ఒంటరి కాదు. మీరు క్రైస్తవ విశ్వాసంలో 1 రోజు ఉన్నప్పటికీ లేదా 30 సంవత్సరాలు ఉన్నప్పటికీ, మన జీవితంలో ఎటువంటి సవాళ్ళు వచ్చినా ఈ సత్యం మారదు. దేవుని సహాయం ప్రభావవంతంగా ఎలా పొందుకోవాలో ఈ ప్రణాళిక ద్వారా నేర్చుకోండి. డేవిడ్ స్వాండ్ రచించిన “ఈ లోకంలోనుండి: ఎదుగుదల మరియు ఉద్దేశమునకు క్రైస్తవుని మార్గనిర్దేశం” అనే పుస్తకంలోనుండి సంగ్రహించబడింది.

More

ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము Twenty20 Faith, Inc.కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.twenty20faith.org/devotion1?lang=te