బలం మరియు ధైర్యంతో జీవించండినమూనా

బలం మరియు ధైర్యంతో జీవించండి

8 యొక్క 4

“ఆయన పని వ్యక్తిగతమైంది”

పరిశుద్ధాత్మ సృష్టి ఆరంభం నుండి అన్ని తరములలో మన మధ్య నివసిస్తున్నాడు.

“భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను; దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను.” ఆదికాండము 1:2

కాకపోతే యేసు తన పనిని సిలువలో ముగించేవరకు పరిశుద్ధాత్మ పరిచర్య ప్రతి విశ్వాసి జీవితంలో వ్యక్తిగతం మరియు సన్నిహితము కాలేదు. యేసు చనిపోకముందు తన శిష్యులతో పరిశుద్ధాత్మ వారి మధ్యలో ఉంటాడు కానీ ఇంకా వారిలో నివసించడం లేదని చెప్పాడు.

“లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొంద నేరదు; మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతోకూడ నివసించును, మీలో ఉండును. మిమ్మును అనాథలనుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడును చూడదు;” యోహాను 14:17-18

వారి జీవితాల్లో పరిశుద్ధాత్మ సన్నిధి ద్వారా వారితో కూడా ఆత్మీయంగా ఉంటానని యేసు తన మరణానికి ముందు తన శిష్యులతో అదరణతో కూడిన వాగ్దానం చేశాడు. యేసు మన జీవితాల్లో ప్రారంభించిన కార్యమును పరిశుద్ధాత్మ పూర్తిచేస్తాడు:

1. రక్షణను ఒక వ్యక్తిగత అనుభవంగా మారుస్తాడు.

2. మీరు విజయవంతంగా జీవించడానికి శక్తినిస్తాడు.

3. మీరు ఎదగడానికి మీలో క్రైస్తవస్వభాన్ని పెంపొందిస్తాడు.

4. సమస్తమును మీ మేలు కొరకు సమకూరుస్తాడు.

రోజు 3రోజు 5

ఈ ప్రణాళిక గురించి

బలం మరియు ధైర్యంతో జీవించండి

మీరు ఎన్నడూ ఒంటరి కాదు. మీరు క్రైస్తవ విశ్వాసంలో 1 రోజు ఉన్నప్పటికీ లేదా 30 సంవత్సరాలు ఉన్నప్పటికీ, మన జీవితంలో ఎటువంటి సవాళ్ళు వచ్చినా ఈ సత్యం మారదు. దేవుని సహాయం ప్రభావవంతంగా ఎలా పొందుకోవాలో ఈ ప్రణాళిక ద్వారా నేర్చుకోండి. డేవిడ్ స్వాండ్ రచించిన “ఈ లోకంలోనుండి: ఎదుగుదల మరియు ఉద్దేశమునకు క్రైస్తవుని మార్గనిర్దేశం” అనే పుస్తకంలోనుండి సంగ్రహించబడింది.

More

ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము Twenty20 Faith, Inc.కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.twenty20faith.org/devotion1?lang=te