బలం మరియు ధైర్యంతో జీవించండినమూనా
“ఆయన రక్షణను ఒక వ్యక్తిగత అనుభవంగా మారుస్తాడు”
యేసే మన రక్షణ కోసం మూల్యం చెల్లించినవాడైనప్పటికి, దానిని పొందుకొనువారికి రక్షణను వ్యక్తిగత అనుభవంగా మార్చేది పరిశుద్ధాత్మ ద్వారా దేవుని సన్నిధి. మనం పుట్టగానే మనకు రక్షణ కలుగదని యేసు చాలా స్పష్టంగా చెప్పాడు. పరిశుద్ధాత్మ మాత్రమే అనుగ్రహించగలిగిన ఆత్మీయమైన తిరిగి జన్మించిన అనుభవం ప్రతి ఒక్కరూ పొందుకోవాలి.
“యేసు ఇట్లనెను–ఒకడు నీటిమూలముగాను ఆత్మమూలముగాను జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మమూలముగా జన్మించినది ఆత్మయునై యున్నది.” యోహాను 3:5-6
ఎవరైనా యేసును తమ జీవితంలోనికి అంగీకరించగానే, తమ ఆంతరంగిక పురుషునిలో ఆత్మీయ నూతనత్వం కలుగుతుంది. అది వారి జీవితాల్లోని పాపపు శిక్షను పూర్తిగా తొలగిస్తుంది.
దానితో పాటుగా, అవిశ్వాసుల పట్ల దేవుని అద్భుత ప్రేమను వారికి ప్రత్యక్షపరచడానికి వారి జీవితంలో పరిశుద్ధాత్మ పనిచేస్తాడు.
“తండ్రియొద్దనుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త, అనగా తండ్రి యొద్దనుండి బయలుదేరు సత్యస్వరూపియైన ఆత్మ వచ్చి నప్పుడు ఆయన నన్నుగూర్చి సాక్ష్యమిచ్చును.” యోహాను 15:26
నేడు, వ్యక్తీకరించబడిన దేవుని ప్రేమయైన యేసును మరియు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వాటన్నిటినీ విశ్వాసులకు మరియు అవిశ్వాసులకు ప్రకటించుట ద్వారా దేవుని ప్రేమను తెలిపే అద్భుతమైన పరిచర్యను పరిశుద్ధాత్మ కొనసాగిస్తున్నాడు.
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
మీరు ఎన్నడూ ఒంటరి కాదు. మీరు క్రైస్తవ విశ్వాసంలో 1 రోజు ఉన్నప్పటికీ లేదా 30 సంవత్సరాలు ఉన్నప్పటికీ, మన జీవితంలో ఎటువంటి సవాళ్ళు వచ్చినా ఈ సత్యం మారదు. దేవుని సహాయం ప్రభావవంతంగా ఎలా పొందుకోవాలో ఈ ప్రణాళిక ద్వారా నేర్చుకోండి. డేవిడ్ స్వాండ్ రచించిన “ఈ లోకంలోనుండి: ఎదుగుదల మరియు ఉద్దేశమునకు క్రైస్తవుని మార్గనిర్దేశం” అనే పుస్తకంలోనుండి సంగ్రహించబడింది.
More
ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము Twenty20 Faith, Inc.కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.twenty20faith.org/devotion1?lang=te