దేవుని కవచం - అపొస్తలుల చర్యలునమూనా
విశ్వాసం యొక్క డాలు
బైబిల్ కధ – పాల్ మరియు ఓడ బద్దలవ్వటం "ఆక్ట్స్ 27:21-37, 28:1 "
ఈ రోజు విశ్వాసం యొక్క డాలు గురించి నేర్చుకుంటున్నాము, రక్షణకు గొప్ప ఆయుధం ఎందుకంటే దానిని చుట్టూ తిప్పి నిర్దిష్ట దాడుల నుండి మనల్ని రక్షించుకోవచ్చు. చెడు యొక్క మండే బాణాలను ఆర్పటానికి దీనిని ఉపయోగించవచ్చని బైబుల్ చెబుతుంది. బాణాలు ఒకవేళ “వస్తే” అని చెప్పదు, కానీ అవి “వచ్చినప్పుడు” వాటిని ఎదుర్కోవడానికి శక్తి లేకుండా ఉండకూడదు. నిజం ఏమిటంటే శత్రువు నిరంతరం మనపై దాడి చేస్తూనే ఉంటాడు. మీ శత్రువు మండుతున్న బాణాలు వేసి మీ ధ్యాస మరలించి ఆశ్చర్యపరచాలని అనుకుంటాడు. ప్రత్యేకించి మీ కోసం తన వ్యూహాన్ని రచిస్తాడు. మీ అలవాట్లని, లోతైన భయాలను మరియు బలహీనతలను అధ్యయనం చేస్తాడు, మరియు ప్రత్యేకించి ఆ ప్రాంతాలకు తన బాణాలను గురిపెడతాడు
విశ్వాసం అంటే అతని ఆధ్యాత్మిక రాజ్యాన్ని చూడకపోయినా, దేవుణ్ణి మరియు అతని మాటను నమ్మటము. అతన్ని చూడలేకపోయినా దేవుడు ఉన్నాడని మనకు తెలుసు, మరియు మన గుండెలలో అది విశ్వాసము. మనకి విశ్వాసం ఉంటే, శత్రువు యొక్క ఈ దాడులను మనము ఓడించవచ్చు.
ఆక్ట్స్ యొక్క పుస్తకం నుండి ఈ రోజు బైబిల్ కధలో, ఒక భయంకరమైన తుఫాను సమయంలో పాల్ సముద్రం వద్ద ఉన్నాడు, మరియు ఓడలో ఉన్న ఎవ్వరూ తుఫాను వలన మరణించరని దేవుడు అతనికి చెప్తాడు! దేవుని చూడలేకపోయినా, దేవుడు అతనితో చెప్పినవి నమ్మటానికి పాల్ ఎంచుకున్నాడు. తరువాత పాల్ అందరికీ దేవుడు చెప్పినవి చెప్పి, బలం కోసం ఎక్కువగా భోజనం తినేలా చూడటం ఉద్వేగభరితంగా ఉంటుంది. పాల్ దేవుని నమ్మటమే కాదు, కానీ ఇతరులతో దేవుని సందేశం పంచుకోవడానికి మరియు దానిపై చర్య తీసుకోవడానికి కూడా సిద్ధమయ్యాడు! ఓడ బద్దలవ్వటం వలన ఎవరైనా మరణించి ఉంటే అతను తీవ్రంగా ఇబ్బంది పడి ఉండేవాడు. కొన్నిసార్లు దేవుని మాటను మనము మనుష్యులను నమ్మినదానికంటే ఎక్కువగా నమ్మి బహిరంగంగా చెప్పవలసి ఉంటుంది.
మీరు చూడని దాని గురించి నిర్ధరణకు వచ్చి మీ విశ్వాసం అనే డాలుని తీస్తారా? ఈ రకంగ మీరు మీ శత్రువుని గెలవవచ్చు మరియు అతని మండే బాణాలను ఆర్పివేయవచ్చు!
" దేవుని నమ్మాలని విశ్వాసాన్ని ఉంచాలని నేను ఎంచుకున్నాను.”
ప్రశ్నలు:
1.నిజ జీవితంలో, “చెడు వ్యక్తి యొక్క ప్రచండ బాణాలు” ఏవి?
2. సాధారణ జీవితంలో మీ విశ్వాసం యొక్క డాలుతో బాణాన్ని పగలకొట్టటానికి ఒక నిర్దిష్ట ఉదాహరణ ఏది?
3. మీ విశ్వాసం లేకుండా మీ ఇంటిని వదిలి వెళ్ళరని మీరు ఎలా నిర్ధారించుకుంటారు?
4. ఈ రోజు బైబిల్ కధలో పాల్ ఓడ పైన ఉన్నప్పుడు పాల్ ఎక్కడికి వెళ్తున్నాడు? ఓడ మీద ఎంత మంది మనుష్యులు ఉన్నారు?
5. తుఫాను వలన ఓడ నాశనం అవుతుంది కానీ ఎవ్వరూ మరణించరని పాల్ ఎలా తెలుసుకున్నాడు?
ఈ ప్రణాళిక గురించి
దేవుని సర్వాంగ కవచాన్ని ధరించుకోవడమనేది ప్రతిరోజూ ఉదయం చేయవలసిన ప్రార్థనలో చేయవలసిన ఆచారం కాదు, కానీ మనం యవ్వనంలో ఉన్నప్పుడే ప్రారంభించగల జీవన విధానం. క్రిస్టి క్రాస్ గారు వ్రాసిన ఈ పఠన ప్రణాళిక అపొస్తలుల కార్యముల గ్రంథంలోని కథానాయకులను (హీరోలను) ఎత్తి చూపుతోంది.
More
ఈ ప్రణాళికను అందించినందుకు Equip & Grow కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.childrenareimportant.com/telugu/armor/