దేవుని కవచం - అపొస్తలుల చర్యలునమూనా

దేవుని కవచం - అపొస్తలుల చర్యలు

10 యొక్క 8

మోక్షం యొక్క హెల్మెట్

బైబిల్ కధ – సాల్ యొక్క కన్వర్షన్ "ఆక్ట్స్ 9:1-19 "

మోక్షం యొక్క హెల్మెట్లను మనము ధరించటము ముఖ్యము ఎందుకంటే తలపై దెబ్బ తగిలితే అది ప్రమాదకరం కావచ్చు. మనము హెల్మెట్ పెట్టుకున్నామని మనము ఎలా ఖచ్చితంగా తెలుసుకోగలము? శిలువపై ఏసు క్రీస్తు ముగించిన పని మీద మన మోక్షం ఆధారపడి ఉంటుందని బైబిల్ స్పష్టంగా చెప్పించి.మన పాపాల కోసం అతను మరణించినప్పుడు, అతను మూల్యం చెల్లించాడు మరియు మనకి మోక్షాన్ని తెచ్చాడు! మంచి పనులతో మనము స్వర్గంలోకి దారిని సంపాదించలేము, కానీ కేవలము ఏసు క్రీస్తుని నమ్మి మాత్రమే సంపాదించగలము. మోక్షం యొక్క హెల్మెట్లు ధరించటానికి ప్రతి రోజూ సెరిమనీ ప్రార్ధన అవసరం లేదు.ప్రభువు ఏసు క్రీస్తుని మోక్షం కోసం నమ్మినప్పుడు, అప్పుడు మనము హెల్మెట్లౌ ధరించి ఉన్నట్లు!

ఆక్ట్స్ యొక్క పుస్తకం నుండి ఈ రోజు బైబిల్ కధలో దేవుడు సాల్ కు అధ్భుతమైన మార్గంలో కనిపించడు. తరువాత పాల్ గా మారిన సాల్, క్రైస్తవులను ఎగతాళి చేసి, హింసిస్తూ ఉండేవాడు. ఒక రోజు డమాస్కస్ దారిలో, సాల్ కి అకస్మాత్తుగా, ఏసు స్వర్గం నుండి మెరుపులా కనపడ్డాడు మరియు సాల్ గుడ్డివాడిలా నేలపై పడిపోయాడు.మూడు రోజుల తరువాత, అతన్ని నయం చేయటానికి మరియు క్రీస్తు వద్దకు తేవడానికి దేవుడు ఒక క్రైస్తవుని పంపాడు . ఆ వారం సాల్ ఏసును నమ్మాడు మరియు రక్షించబడ్డాడు! ప్రభువు ఏసు క్రీస్తు ని మోక్షం కోసం మీరు నమ్మి పార్ధిస్తే, పాల్ లాగే మీరు కూడా మీ మోక్షం యొక్క హెల్మెట్ ను ఈ రోజే పెట్టుకోవచ్చ్చు.

నాతో ప్రార్ధించండి, “ప్రియమైన ఏసు, నేను పాపినని మరియు తప్పు చేశానని నేను ఈ రోజు అంగీకరిస్తున్నాను. నా పాపాల కోసం నీవు శిలువపై మరణించావని మరియు నీవు వాస్తవానివి అని నేను నమ్ముతాను. నిన్ను నా ప్రభువు మరియు రక్షకుడిగా నా మనస్సులోకి నిన్ను అంగీకరిస్తున్నాను. నన్ను అంగీకరించినందుకు, ప్రేమించినందుకు, మరియు నీ స్వర్గంలో నాకు శాశ్వత జీవితం ఇచ్చినందుకు ధన్యవాదాలు.”

" నా మోక్షం కోసం నేను ప్రభువు ఏసు క్రీస్తుని నమ్మాలని ఎంచుకున్నాను.”

ప్రశ్నలు:

1. మోక్షం గురించి మీరు ఖచ్చితంగా ఉండగలరా?

2. మీరు ముక్తిని కోల్పోతారని అనుకుంటున్నారా?

3. డమాస్కస్ పట్టణానికి వెళ్ళటానికి అతని గుర్రాన్ని ఎక్కుతున్నప్పుడు సాల్ కి ఏమి జరిగింది?

4. డమాస్కస్ యొక్క అననియస్ కు దేవుడు ఏమి చెప్పాడు?

5. అననియస్ దేవునికి ఏమి చెప్పాడు? మనము దేవునికి ఫిర్యాదు చేసినప్పుడు ఏమి జరుగుతుంది?

రోజు 7రోజు 9

ఈ ప్రణాళిక గురించి

దేవుని కవచం - అపొస్తలుల చర్యలు

దేవుని సర్వాంగ కవచాన్ని ధరించుకోవడమనేది ప్రతిరోజూ ఉదయం చేయవలసిన ప్రార్థనలో చేయవలసిన ఆచారం కాదు, కానీ మనం యవ్వనంలో ఉన్నప్పుడే ప్రారంభించగల జీవన విధానం. క్రిస్టి క్రాస్ గారు వ్రాసిన ఈ పఠన ప్రణాళిక అపొస్తలుల కార్యముల గ్రంథంలోని కథానాయకులను (హీరోలను) ఎత్తి చూపుతోంది.

More

ఈ ప్రణాళికను అందించినందుకు Equip & Grow కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.childrenareimportant.com/telugu/armor/