దేవుని కవచం - అపొస్తలుల చర్యలునమూనా
ఆత్మ యొక్క కత్తి
బైబిల్ కధ– పీటర్ సమూహంతో మాట్లాడతాడు "ఆక్ట్స్ 2:12-17, 22-30, 34-41"
రక్షణ వస్తువు కాకుండా, నిజానికి ఒక ఆయుధం అయినది, కవచం యొక్క మొదటి ముక్క అయిన ఆత్మ యొక్క కత్తి. దీని అర్ధం మనము దానితో శత్రువుపై దాడికి వెళ్ళవచ్చు. “ఆత్మ యొక్క కత్తి” అంటే బైబిల్, లేదా దేవుని మాట. మీ కత్తిని యుద్ధంలో ఉపయోగించటానికి, మీకు గ్రంధం తెలిసి ఉండాలి. దీని అర్ధం బైబిల్ని పదే పదే చదవటం మరియు బైబిల్ పద్యాలను గుర్తు పెట్టుకోవటం
ఆక్ట్స్ పుస్తకం నుండి ఈ రోజు వాస్తవ గాధలోలో సమూహానికి బోధించటానికి పీటర్ గ్రంధాన్ని ఉపయోగిస్తాడు. దేవుని నమ్మని వ్యక్తులు అక్కడ ఉన్నారు, వారు అతన్ని వెక్కిరించటం ప్రారంభించారు. అతన్ని వెక్కిరించిన వారితో మాట్లాడటానికి పీటర్ నిలబడ్డాడు; అతను వారికి కేవలము బోధించలేదు, కానీ యుద్ధాన్ని చేయటానికి గ్రంధాన్ని ఉపయోగించాడు. మనము గ్రంధాన్ని కంఠతా పట్టినప్పుడు, జీవితంలో మనకు అవసరం అయినప్పుడు దానిని ఉపయోగించవచ్చు. ఆ రోజు మూడు వేల మంది ప్రజలు రక్షించబడ్డారు మరియు చర్చిలో చేరారు ఎందుకంటే పీటర్ దేవుని మాటను బోధించాడు! ఎలాంటి దీవెన! ఈ ప్రత్యేక పరిస్థితి కోసం సరైన లేఖనాలను జ్ఞాపకం ఉంచుకున్నాడు అందువలన పీటర్ అతని కత్తిని నైపుణ్యంతో ఉపయోగించాడు. శత్రువుతో నైపుణంగా పోరాడాడు మరియు ప్రభువు కోసం 3000 మందిని గెలిచాడు! మీకు ఎన్ని బైబిల్ పద్యాలు తెలిస్తే, మీకు మీ కత్తితో అంత నైపుణ్యం వస్తుంది.
మనము మాటని చదివి గుర్తు ఉంచుకున్నప్పుడు, మనకి అవసరం అయినప్పుడు దేవుడు దానిని మన మెదడులోకి తెస్తాడు, మీరు మీ కత్తితో ఎలా ఉన్నారు?
"నేను దేవుని మాటను నేర్చుకొని నా రోజువారీ జీవితంలో ఉపయోగించాలని ఎంచుకున్నాను."
ప్రశ్నలు:
1. మీ శత్రువుతో మీరు ఎప్పుడు తగవు పెట్టుకోవచ్చు?
2. నిజ జీవితంలో మీ కత్తితో దాడి చేయటానికి ఉదాహరణ ఏమిటి?
3. ఆత్మ యొక్క కత్తి ఎలా దుర్వినియోగం చేయబడుతుంది?
4. పెంటెకాస్ట్ యొక్క దినములో పీటర్ చెప్పినదాని వలన ఎంత మంది ప్రజలు క్రైస్తవులుగా మారారు?
5. వారు క్రీస్తును అనుసరిస్తారని చెప్పటానికిచెప్పటానికి ఈ కొత్త క్రైస్తవులు ఏమి చేస్తున్నారు?
ఈ ప్రణాళిక గురించి
దేవుని సర్వాంగ కవచాన్ని ధరించుకోవడమనేది ప్రతిరోజూ ఉదయం చేయవలసిన ప్రార్థనలో చేయవలసిన ఆచారం కాదు, కానీ మనం యవ్వనంలో ఉన్నప్పుడే ప్రారంభించగల జీవన విధానం. క్రిస్టి క్రాస్ గారు వ్రాసిన ఈ పఠన ప్రణాళిక అపొస్తలుల కార్యముల గ్రంథంలోని కథానాయకులను (హీరోలను) ఎత్తి చూపుతోంది.
More
ఈ ప్రణాళికను అందించినందుకు Equip & Grow కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.childrenareimportant.com/telugu/armor/