ది 2019 క్రికెట్ ప్రపంచ కప్ - అథ్లెట్ టెస్టిమోనైస్నమూనా
ప్రకాశమానమైన వెలుగు
కార్లోస్ బ్రాత్వేైట్, వెస్ట్ ఇండీస్
కార్లస్ బ్రాత్‌వైట్ వెస్టిండీస్ ఆల్ రౌండర్. ఇతడు బార్బడీస్ ప్రాంతానికి చెందినవాడు. T20 అంతర్జాతీయ వెస్టిండీస్ జట్టుకు 2016 లో ఇతడు కెప్టెన్ అయ్యాడు. టెస్ట్‌ల్లోనూ, వన్డే మ్యాచ్‌ల్లోనూ, T20 ల్లోనూ ఇతడు వెస్టిండీస్ తరపున ఆడుతున్నాడు. 2016 T20 ప్రపంచ కప్ ఫైనల్లో ఇంగ్లాండుతో ఆడుతున్నప్పుడు ఆఖరి ఓవర్లో వరుసగా 4 సిక్స్‌లు కొట్టాడు. వెస్టిండీస్ తరపున ఆ ఘనత సాధించిన మొదటి క్రికెటర్ ఇతడే.
నేను చిన్నప్పటినుంచే ప్రో క్రికెటర్ కావాలని కలలు కనేవాణ్ణి. అయితే పెద్ద పారిశ్రామికవేత్తను కూడా కావాలనుకున్నాను. నాకు 19 ఏళ్ళ వయసు వచ్చినప్పుడు, యూనివర్సిటీలో చదువు కొనసాగించాలా? లేదా కొన్నాళ్లు క్రికెట్ ఆటకు నన్ను నేను అంకితం చేసుకోవాలా? అనే మీమాంసలో పడ్డాను. అయితే అవసరమైతే డిగ్రీ తర్వాత చదువుకోవచ్చు అని భావించి క్రికెట్ ఆడడానికే నిర్ణయించుకున్నాను. అది చాలా ముఖ్యమైన నిర్ణయం. నా క్రీడా జీవితం విజయపథంలో పడినందుకు నేను చాలా ధన్యుణ్ణి.
T20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ నా జీవితాన్నే మార్చివేసింది. ఆ 4 సిక్స్‌లు నేనెలా కొట్టానో వివరించడం నాక్కూడా కష్టమే. అయితే అదొక గొప్ప అనుభూతి. జానపద సాహస కథల్లో మాత్రమే ఇలాంటివి సాధ్యమవుతాయి. అయితే ప్రపంచ కప్‌ను గెలవాలనే కల నెరవేరింది. దాన్ని గెలిచిన విధానం మాత్రం చాలా గొప్పగా అనిపించింది. ఫైనల్ మ్యాచ్‌లో ఆడడమూ, అనూహ్యంగా 4 సిక్స్‌లు కొట్టడమూ నేను ఎన్నడూ కలగనలేదు. నాకు ఆ సందర్భంలో మాటలు రాలేదు.
క్రీస్తును ప్రేమించిన ఇంట్లోనే నేను పెరిగి పెద్దవాడినయ్యాను. మా అమ్మ చాలా భక్తిగల క్రీస్తు అనుచరి. నేను చిన్నప్పటినుంచే సండేస్కూలుకు హాజరయ్యేవాణ్ణి. నా చుట్టూ ఉన్నదంతా క్రైస్తవ వాతావరణమే. సండేస్కూలుకు వెళ్లడం, చర్చిలో సమయం గడపడం అనేవి బాగా అలవాటైన పనులు. చిన్నతనం నుంచే మా అమ్మ నాకు క్రీస్తును పరిచయం చేసింది. నేను కూడా అలాగే పెరిగాను. కొన్నిసార్లు దారిదప్పినా, నాలో కలిగిన విశ్వాసాన్నిబట్టి మళ్ళీ దారిలోకొచ్చేవాణ్ణి.
నా సామర్థ్యం దేవుడు నాకిచ్చిన బహుమానం అని నేను భావిస్తాను. 2, 3 సం||ల వయస్సులోనే మా ఇంటి పెరట్లో డ్రైవ్స్ ఆడుతుండేవాణ్ణని నా నాన్నగారు చెబుతుండేవారు. నేను చాలా కష్టపడి పనిచేస్తుంటాను. కొందరు దేవుని దగ్గర నుండి బహుమానాలు తీసుకొని, ఇంక ఏమీ చేయాల్సిన అవసరం లేదనుకుంటారు. అయితే వాళ్లు జీవితంలో ఎదిగేకొలదీ, కొంత మెరుగవుతారు. తప్పనిసరిగా కష్టపడి పనిచేస్తేనే సత్ఫలితాలు వస్తాయి.
యజమాని దగ్గర నుండి తలాంతులు పొందుకుని వాటిని రెట్టింపు చేసినవాడి గురించీ, యజమాని ఇచ్చిన తలాంతును తీసుకుని దాన్ని భూమిలో పాతిపెట్టిన వాడి గురించీ బైబిల్లో ఉన్న ఉపమానం లాంటిది ఇది. దేవుడు నాకు బహుమానాన్ని ఇచ్చినందుకు నేను ఆయనకు కృతజ్ఞుణ్ణి. అయితే ఎదిగి, విజయాన్ని సాధించడానికి ఎంతో కష్టపడి పనిచేయాలి.
దేవుడు ఇప్పుడు నాకు దీనత్వాన్ని నేర్పిస్తున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఇమ్రాన్ తాహిర్, జె.పి. డుమిని, రాహుల్ ద్రావిడ్ మొదలైనవారితో డ్రెస్సింగ్ రూమ్‌ని పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. వాళ్లు చాలా దీనమనస్కులు. వాళ్లు క్రికెట్లో ఎంతో సాధించారు. క్రికెట్‌ను అభిమానించే భారత్‌లో అభిమానులు వాళ్ల దగ్గరకు ఫోటోలు తీయడం కోసం వచ్చినప్పుడు చాలా మర్యాదగా వారితో యస్, లేదా నో చెబుతుంటారు.
వాళ్లలా నేను ఉండడం కష్టమే. అది నేర్చుకొని ఇప్పుడు కరేబియన్‌కి దాన్ని తీసుకెళ్లి, నా స్నేహితుల ముందు దాన్ని ప్రదర్శించి, వాళ్లకు వెలుగుగా ఉండడం నా తక్షణ కర్తవ్యం.
__________
''యేసు దుఃఖించాడు'' - యోహాను 11:35
పురుషులు మనో నిబ్బరం గలవారై, బలవంతులై ఉండాలి అని నేను భావిస్తాను. అయితే 'యేసు దుఃఖిస్తే, నేను అలా ఎందుకు చెయ్యలేను. ఈ వచనం నన్ను నా భావోద్వేగాలకు అనుగుణంగా ఉండేలా చేసింది.
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అథ్లెట్ల నుండి ఫస్ట్-వ్యక్తి కథలు మరియు సాక్ష్యాలు.
More
మేము ఈ ప్రణాళికను అందించడానికి స్పోర్ట్Go మాగ్ కు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://sportgomag.com/