ది 2019 క్రికెట్ ప్రపంచ కప్ - అథ్లెట్ టెస్టిమోనైస్నమూనా

 ది 2019 క్రికెట్ ప్రపంచ కప్ - అథ్లెట్ టెస్టిమోనైస్

7 యొక్క 5

శ్రోతల కోసం అడడం

కేటీ పెర్కిన్స్‌, న్యూ జేఅలాండ్ 


 

న్యూజిలాండ్‌ స్త్రీల జాతీయ క్రికెట్‌ జట్టులో స్థానం సంపాదించడం పైనే మనసు పెట్టిన తర్వాత కేటీ పెర్కిన్స్‌ తన లక్ష్యం నుంచి చాలా దూరమైనట్టు గ్రహించింది. ఇదంతా తనకు 20-25 సంవత్సరాల వయసులో జరిగింది. అయితే ఆమె తన ఆటను దేవుని చేతికి అప్పగించినపుడు ఆమె అద్లెటిక్‌ జీవితం అద్భుతమైన మలుపు తిరిగింది. జనవరి 2012 లో న్యూజిలాండ్‌ వైట్‌ ఫెర్న్స్‌ తరపున ఆమె తన తొలి మ్యాచ్‌ ఆడింది. అప్పటినుంచి 100కు పైగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆమె ఆడింది. ఆమె న్యూజిలాండ్‌లో ఒక పోలీస్‌ ఆఫీసర్‌. ఆమె వయసు 30 సంవత్సరాలు. ఆమె చేసే పనులన్నిటికంటే ముందు పెర్కిన్స్‌ దేవునితో తన సంబంధానికి మొదట స్థానమిస్తుంది.

న్యూజిలాండ్‌ తరపున క్రికెట్‌ ఆడడం నాకున్న మొదటి కల. నాకు 5 ఏళ్ల యవసు నుంచే ఈ కల నాకొక అద్భుతమైన ప్రేరణనిచ్చింది. నాకు ఇతర కోరికలు కూడా ఉండేవి, అయితే క్రికెట్‌పై నాకున్న మక్కువ వాటిని అణగదొక్కింది.

బలమైన భక్తిగల కుటుంబ ప్రభావం నా జీవితంలో ఉంది. అందువల్ల చిన్నతనం నుంచే సంఘానికి హాజరవుతూ  ఉండేదానిని. నేనొక మంచి అమ్మాయిని, సండేస్కూలులో నేను నేర్చుకున్న పాఠాలను చక్కగా పాటించేదాన్ని. అయితే మంచి అమ్మాయిని కావడం, దేవుణ్ణి ఎరగడం అనేవి రెండు విభిన్నమైన విషయాలు. ఎన్నో సంవత్సరాలు ఒక మంచి స్నేహితురాలు నాకు భక్తి పాఠాలు నేర్పించింది. నాకు 15 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు దేవునితో సంబంధం గురించి అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. ఆ తర్వాత ఒక ఉదయాన్న సంఘంలో దేవునికి ప్రార్థించి, ఆయనను వెంబడించి, ఆయన మహిమ కోసం నా జీవితాన్ని జీవిస్తానని చెప్పినట్లు నాకు జ్ఞాపకముంది. ఆ సమయంలో పరిశుద్ధాత్మ నన్ను నింపాడు. నాలో అప్పుడు కలిగిన భావన, నా శరీరమంతా పాకిపోయింది. దాన్ని వర్ణించడం అసాధ్యం.

అయితే నేను క్రికెట్‌ను ఎంతో ప్రేమించాను కాబట్టి దాన్ని నా జీవితాశయంగా భావించాను. ఆ ఆటే నాకొక దేవతగా మారిపోయింది. క్రికెట్‌ రంగంలో నా విజయం, లేదా వైఫల్యమే నా విలువకు నిర్వచనంగా ఉండేది. ఆ రోజు నేనెలా ఆడానో అదే విధంగా నా భావోద్వేగాలు ఉండేవి.

2010-2011 లో నేను చాలా గడ్డు పరిస్థితులన్ని ఎదుర్కొన్నాను. వైట్‌ఫెర్న్‌ తరపున ఆడాలన్న నా కల నాకింకా దూరమైపోయింది. నేనేదో మార్చుకోవలసి వచ్చింది. నా జీవితంలో తర్వాత దశ మూలంగా నా జీవితం మొత్తం మారిపోయింది.

ఏప్రిల్‌ 2011 లో ఖశ్ర్‌ీఱఎa్‌వ ుతీaఱఅఱఅస్త్ర జaఎజూ కు నేను హాజరయ్యాను. అది క్రీస్తు కేంద్రితంగా జరిగిన క్యాంప్‌. అక్కడ దేవుని కోసం పరితపించే ఇతర అద్లెట్లను నేను కలిశాను. వాళ్లందరూ తమ క్రీడా ప్రపంచంలో దేవుని గురించి ఎక్కువ అర్థం చేసుకోవాలని అనుకుంటున్నవాళ్లే! మైదానంలో నేనెలాంటి ఫలితాలు సాధించాను అన్నదానిపై కాక నేను ఆట ఎలా ఆడాను అనేదానిపైనే దేవుడు దృష్టి పెడతాడనే వాస్తవానికి నా కళ్లు తెరుచుకున్నాయి. నేను దేవుని గురించీ ఒక్క శ్రోత గురించే ఆడడం నేర్చుకున్నాను. నాకు నిజమైన విలువ దేవునిలోనే ఉన్నదని గుర్తించాను.

శీతాకాలం గడుస్తుండగా, నా క్రికెట్‌ ఆటలో దేవుడు ఎక్కడున్నాడని నా బెస్ట్‌ ఫ్రెండ్‌ నన్ను సవాలు చేసింది. నా ఆటలో దేవుడు లేడు అన్నది సత్యం. ప్రార్థనలో చాలాసేపు గడిపాను. నేను ఎన్నటికీ వైట్‌ ఫెర్న్‌లో సభ్యురాలిని కానేమో అనే వాస్తవంతో పోరాడాను. నేనేం సాధించగలనో అనే దానిపై కాక నేనెవర్ని అనే దాన్ని బట్టి నన్ను నేను ప్రేమించుకోవడం ఎలాగో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. ఆ తర్వాత సీజన్‌ వచ్చే సమయానికి నా జీవితకాల స్వప్నాన్ని దేవుని చేతుల్లో పెట్టేసాను.

నేను ఆ వేసవి కాలంలో ఎంతో స్వేచ్ఛ, సంతోషాలతో ఆడాను. అద్భుతంగా, అలవోకగా పరుగులు సాధించాను. నేను వైట్‌ ఫెర్న్‌ జట్టులో ఆడడానికి ఎంపికయ్యానని నాకు ఫోన్‌ వచ్చినప్పుడు ఆనందంతో ఏడ్చేశాను.

ప్రతీసారీ ఇలాంటి స్వేచ్ఛ సంతోషాలతో ఆడాలని నా ఆశ. కానీ అలా నేను ఆడలేకపోతున్నాను. నేను నిరంతరం స్థిరంగా ఆడడానికి ఇబ్బంది పడుతున్నాను. జీవితమూ క్రికెట్టూ నా ముందుకొచ్చినప్పుడు, నా దృష్టి క్రికెట్టు పైనా మరొకసారి మళ్లింది. ు 20 ప్రపంచ కప్‌ సెమీ ఫైనల్‌లో క్రికెట్‌పై నాకున్న ప్రేమ శూన్యమైపోయింది. నేను చాలా నిరాశ చెందాను. నా జీవితంలో నేను కోల్పోతున్నది దేవుణ్ణని నాకు తెలుస్తున్నది. నా ప్రార్థనలన్నీ దేవుడు పెడచెవిని పెడుతున్నాడని నాకు అనిపించింది. కానీ నిజానికి నేను దేవుడు చెబుతున్నది నిర్లక్షం చేస్తున్నాను. 

నేను న్యూజిలాండ్‌కి తిరిగి వెళ్ళగానే, సహాయం కోసం పాస్టర్ల దగ్గరకు, మానసిక నిపుణుల దగ్గరకూ వెళ్ళాను. నేను చర్చికి వెళ్ళేలా, క్రికెట్‌ నా జీవితంలోకి రాకుండా వాళ్ళు నాకు క్రమశిక్షణ చేశారు. నేను సరైన దారిలో నడుస్తూ దేవునికి క్రమక్రమ్‌గా దగ్గరయ్యాను. 

ఓటమిని నేను అన్నిసార్లు ఒకేలా భరించలేను. ఇదొక నిరంతర యుద్ధం. అయితే దేవుడు చెప్పే సత్యాలను నాకు నేనే గుర్తుచేసుకోవడానికి ప్రయత్నిస్తుంటాను. నేను దేవునిలో సంపూర్ణురాలను, ఆయన నన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాడు. నేనెప్పుడైతే ఆడేందుకు ధైర్యం కోల్పోతానో, అప్పుడు 1తిమోతి 1:7 ను గుర్తు చేసుకుంటాను. ''దేవుడు మనకు అనుగ్రహించిన ఆత్మ మనల్ని భయపెట్టదు గానీ మనకు శక్తినీ ప్రేమనూ ఇంద్రియ నిగ్రహాన్నీ ఇస్తుంది.''

100 మీటర్లు పరుగెత్తడానికి సిద్ధపడిన అద్లెట్‌ని ఊహించుకోండి. గమ్యాన్ని చేరుకోవడానికీ, తుపాకీ పేలడానికీ మధ్యలో జరిగిన పనే ఆ రన్నర్‌ జీవితంలో ఎనలేని ప్రభావం చూపిస్తుంది. అయితే ఆ అద్లెట్‌ పరిగెత్తడానికి ముందు గానీ, పరిగెత్తిన తర్వాత గానీ దేవుని ప్రేమ, త్యాగాలు ఏమీ మారవు. ఈ సాదృశ్యంలోని సత్యం నాకు బాగా కనెక్ట్‌ అయ్యింది. నా ఆటలోనూ, జీవితంలోనూ నా విశ్వాసం ఒక ముఖ్యపాత్ర పోషించేలా నేను అన్నివేళలా ప్రయత్నిస్తున్నాను. ఇతర ఆటగాళ్ళలో నేను అదే చూసినపుడు నేను నిజంగా వారిని అభినందిస్తున్నాను.

వాక్యము

రోజు 4రోజు 6

ఈ ప్రణాళిక గురించి

 ది 2019 క్రికెట్ ప్రపంచ కప్ - అథ్లెట్ టెస్టిమోనైస్

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అథ్లెట్ల నుండి ఫస్ట్-వ్యక్తి కథలు మరియు సాక్ష్యాలు.

More

మేము ఈ ప్రణాళికను అందించడానికి స్పోర్ట్Go మాగ్ కు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://sportgomag.com/