ది 2019 క్రికెట్ ప్రపంచ కప్ - అథ్లెట్ టెస్టిమోనైస్నమూనా

 ది 2019 క్రికెట్ ప్రపంచ కప్ - అథ్లెట్ టెస్టిమోనైస్

7 యొక్క 6

జీవం గల దేవుణ్ణి నమ్మండి

రువాన్‌ కల్పేజ్‌, శ్రీలంక


 

రువాన్‌ కల్పేజ్‌ ఒకప్పటి శ్రీలంక క్రికెటర్‌. ఇతడు 1992 ప్రపంచ కప్‌ టోర్నీలో ఆడాడు. ఆ తర్వాత జాతీయ స్థాయిలో శ్రీలంక, బంగ్లాదేశ్‌లకు కోచించ్‌ బాధ్యతలు చేపట్టి కాలం గడిపాడు.

నేను మాట్లాడుతున్న అనుభవం నా జీవితంలో ఎన్నో సంవత్సరాల క్రితం జరిగింది. కొన్ని సంవత్సరాల క్రితం నేను పనిచేసిన కంపెనీలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తిని నా కార్‌ సర్వీసింగ్‌కి ఇవ్వడానికి వెళ్ళినపుడు కలిశాను. మేము ఇంతకు ముందెన్నడూ ఒకరిని ఒకరం కలుసుకోలేదు. అయితే ఈ వ్యక్తి నాతో మాట్లాడాలని నా జీవితంలో కొంత సమయాన్ని దేవుడు నియమించాడు.

నా జీవితం క్రికెట్టు, మతమూ అనేవాటి చుట్టే తిరుగుతూ ఉంది. మా నాన్నగారు మంచి పేరున్న క్రికెటర్‌ కావడంతో 9 ఏళ్ల వయసునుంచే నాకు క్రికెట్‌ అంటే ఆసక్తి కలిగింది. టెస్టు జట్టులో శ్రీలంక తరపున ఆడడానికి నేను ఎంపికైనప్పుడు నా చిన్ననాటి కలలు నెరవేరాయి.

చాలా ఆచార సంప్రదాయాలున్న కుటుంబంలో నేను చాలా క్రమశిక్షణలో పెరిగాను. నేను మతాచారులను అనుసరించి, సరైన జీవితాన్నే జీవించానని అనుకున్నాను. అయితే క్రికెట్‌ ఆడుతున్నప్పుడు ఎన్నో చెడ్డ పనులు చేసేవాణ్ణి. వీటి గురించి నేనేమీ బాధపడేవాణ్ణి కాదు.

నా క్రికెట్‌ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలున్నాయి. నేను 1992 ప్రపంచ కప్‌ టోర్నమెంట్‌లు ఆడాను. అయితే 1996 లో జట్టులో స్థానం కోల్పోయాను. ఆటగాళ్ళ మధ్య విపరీతమైన పోటీ ఉండడంతో భవిష్యత్తులో మరలా స్థానం సంపాదించడం సులభం కాదని నాకు అర్థమయ్యింది.

అకస్మాత్తుగా ఈ నిరాశ నన్ను కృంగదీసింది. సర్వీస్‌ స్టేషన్‌ దగ్గర నేను కలిసిన వ్యక్తి కూడా నాలానే ఉన్నాడు. తనకు సమీపంగా ఉన్న దేవుడి గురించి అతడు మాట్లాడడం మొదలుపెట్టాడు. మనల్ని ప్రేమించే ఈ దేవుడే మనల్ని సృష్టించాడని అతడు చెప్పాడు. అంతేకాదు, నా జీవితాన్ని చక్కదిద్ది పరిస్థితుల్ని దేవుడు మార్చగలడని కూడా చెప్పాడు.

ఆ సమయంలో నా కుటుంబ జీవితం కూడా సరిగ్గా లేదు. నా భార్యను చాలా అపార్థం చేసుకున్నాను. ఆమెతో చాలాసార్లు వాదించాను. క్రీడా జీవితంలోని వైఫల్యాలకు తోడు కుటుంబ జీవితంలో గొడవలు నన్ను విసిగించాయి. నన్ను ప్రేమించి, నా గురించి శ్రద్ధ తీసుకుని, నేను అనుభవిస్తున్న కష్టాన్ని అర్థం చేసుకునే దేవుడు ఒకడున్నాడని విని నేను ఆశ్చర్యపోయాను. విశ్వాన్ని సృష్టించిన ఈ దేవుడే తన కుమారుడైన యేసును నా కోసం జీవించి, మరణించేందుకు పంపించాడని కూడా అతడు నాకు చెప్పాడు.

ఈ దేవుని గురించి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు గురించీ విన్న తర్వాత నా జీవితం సరైన మార్గంలో లేదని తెలుసుకున్నాను. నా జీవితాన్ని మార్చుకుని, దానిని దేవునికి అప్పగిస్తే, ఆయన నన్ను సరిచేసి నడిపిస్తాడని అనుకున్నాను. నా జీవితంలో అతి క్లిష్టమైన పరిస్థితుల గుండా వెళ్తూ, నా హృదయాన్ని తెరిచి దేవుణ్ణి లోపలికి ఆహ్వానించినపుడు, అదెంతో అద్భుతంగా మారిపోయింది.

ఆ తర్వాత జీవితం ఇంతకు ముందులా లేదు. దాన్ని తిరిగి కనుగొన్నాననే అనుభూతి నాలో కలిగింది. నా జీవితంలో ప్రతి విషయాన్నీ దేవుడు మార్చివేశాడు. రెండు సంవత్సరాల తర్వాత శ్రీలంక జట్టులో ఆడాలని నాకు ఆహ్వానం అందింది. ఇంగ్లాండులో 1999 ప్రపంచ కప్‌ టోర్నీలో మరొకసారి శ్రీలంక తరపున ఆడాను. నా కుటుంబ జీవితం కూడా మెరుగయ్యింది.

నా భార్యతో సంతోషంగా, శాంతిగా జీవిస్తున్న తృప్తి ఇప్పుడు నాకుంది. దేవుడు నాకు కూతుర్నీ, కొడుకునూ ఇచ్చి దీవించాడు. పరిస్థితులు కష్టంగా మారినప్పుడు నేను ఇప్పుడు విసుగు చెందను. నాతో నడిచే దేవుడున్నాడని నాకు తెలుసు. నా జీవితాన్ని మార్చి, కొత్త మార్గాన్ని నాకు ఇచ్చింది యేసేనని నాకు తెలుసు. యేసు లేకపోతే నా జీవితం ఒక వైఫల్యమే అయ్యి ఉండేది.

2000 లో నేను క్రికెట్‌ నుంచి రిటైర్‌ అయ్యాను. గత 18 సంవత్సరాలుగా అంతర్జాతీయ కోచ్‌గా నేను ప్రపంచమంతటా ప్రయాణిస్తున్నాను. నా జీవితాన్ని శాసించేది ఇక ఏమాత్రం క్రికెట్‌ కాదు. నాకు సమస్తాన్నీ కొత్తగా చేసిన ప్రభుయేసులోనే నా నమ్మకం. సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడని నాకు తెలుసు.

ఈరోజే యేసుకు నీ జీవితాన్ని అప్పగించమని నిన్ను బతిమాలుతున్నాను. సంపూర్ణ ఆనందం, శాంతి, సంతృప్తి ఉండే కొత్త జీవితం అనే అద్భుతాన్ని అనుభవించు. 'ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను' అని యేసు చెబుతున్నాడు (మత్తయి 11:28). జీవం గల దేవునిలో మీరు నమ్మకం ఉంచండి. ఆయన నిన్ను ఎన్నడూ సిగ్గుపడనియ్యడు. ఆయన నిన్న, నేడు, నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడు. మనం ఆయనలో విజయులుగా ఉండవచ్చు.



వాక్యము

రోజు 5రోజు 7

ఈ ప్రణాళిక గురించి

 ది 2019 క్రికెట్ ప్రపంచ కప్ - అథ్లెట్ టెస్టిమోనైస్

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అథ్లెట్ల నుండి ఫస్ట్-వ్యక్తి కథలు మరియు సాక్ష్యాలు.

More

మేము ఈ ప్రణాళికను అందించడానికి స్పోర్ట్Go మాగ్ కు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://sportgomag.com/