ది 2019 క్రికెట్ ప్రపంచ కప్ - అథ్లెట్ టెస్టిమోనైస్నమూనా

 ది 2019 క్రికెట్ ప్రపంచ కప్ - అథ్లెట్ టెస్టిమోనైస్

7 యొక్క 3

క్రీస్తు లేకపోతే శూన్యమే!

జె.పి. డుమిని, దక్షిణ ఆఫ్రికా


 

జె.పి. డుమిని ప్రముఖ దక్షిణాఫ్రికా క్రికెటర్‌. ఇతడు కుడిచేతి వాటం ఆఫ్‌ స్పిన్నర్‌, ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్‌. ఇతడు దక్షిణాఫ్రికాలోని వెస్టర్న్‌కేప్‌లో పెరిగాడు. ఇతడు ఇప్పుడు తన సొంత జట్టు కేప్‌ కోబ్రాస్‌ తరపున, దక్షిణాఫ్రికా అంతర్జాతీయ జట్టులోనూ ఆడుతున్నాడు.

నేను 8 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు, స్ట్రాండ్‌ఫౌన్‌టెయిన్‌ క్రికెట్‌ క్లబ్‌ తరపున ఆడినప్పుడు క్రికెట్‌ పట్ల నాకు ఆసక్తి కలిగింది. క్రికెట్‌ నేను ఆస్వాదిస్తున్న సమయంలోనే, ఒక రోజున నా దేశం తరపున క్రికెట్‌ ఆడే టాలెంట్‌ నాకుందని మా నాన్నగారు నాకు చెప్పారు. 17 సం||ల వయసులో వెస్టర్న్‌ ప్రొవిన్స్‌తో క్రికెట్‌ ఆడడానికి నేను ఒప్పందం చేసుకున్నాను.

అద్భుతమైన కుటుంబం, స్నేహితులు, కోచ్‌లు, సపోర్టింగ్‌ సభ్యులు నాకున్నారు. వాళ్లనుబట్టి నేనెంతో ధన్యుణ్ణి. అయితే 2012 లో నా కాలు విరిగినప్పుడు నేను క్రీస్తు యేసులో వ్యక్తిగతంగా నమ్మకముంచాను. నా ఆధ్యాత్మిక యాత్ర ఇదెంతో కీలక సమయం. క్రీస్తు నిజంగా ఏమైయున్నాడు, ఆయన నా కోసం కలువరి సిలువలో ఏమి చేశాడు అనే విషయాలు తెలుసుకోవడానికి నాకు నిజంగా చాలా మంచి స్నేహితుల్ని నా చుట్టూ దేవుడు పెట్టాడు. వాళ్లే నన్ను నా విశ్వాసయాత్రలో నన్ను నడిపించాడు.

ఆ సమయం నుంచి, ఆయన నాకు ఇచ్చిన టాలెంట్‌తో క్రికెట్‌తో దేవుణ్ణి మహిమపరచాలనే తపన కలిగింది. నేను చేస్తున్న చిన్న చిన్న పనుల ద్వారా కూడా ఆయననూ, ఆయన నామాన్నీ మహిమపరచాలని నా కోరిక.

ప్రొఫెషనల్‌ అద్లెట్‌ కావడం వల్ల మా నుంచి ప్రజలూ, అధికారులూ, ఎంతో ఎక్కువ ఆశిస్తారు. ఆ అంచనాలవల్ల మేము కొన్నిసార్లు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఈ క్రీడా జీవితం చాలా సులభంగా కనిపిస్తుంది. కానీ ప్రొఫెషనల్‌ క్రికెటర్స్‌గా మేము ఎంతో సమయాన్నీ, శక్తినీ ధారపోయాల్సి ఉంటుంది. దానివల్ల ప్రతిరోజూ మేము ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటూ ఉంటాం. వ శక్తి మేరకు ప్రయత్నించి, మిగిలింది దేవుని చేతిలో పెట్టేయడం నేను ఎన్నో సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాను.

క్రీస్తు లేకపోతే నేనూ, నా బ్రతుకూ శూన్యమే. ఆయన లేకపోతే నేను సాధించిన విజయాల్లో ఏ ఒక్కటీ నాకు సాధ్యమై ఉండేది కాదు. మనమందరం పతనమైన ప్రాణులం. అందుకే క్రీస్తు మన కోసం చనిపోయాడు. ఇతరులు నా గురించి ఏమి చెబుతారనే దానిపై కాక ఆయన నా గురించి ఏమి చెబుతాడనే దాంట్లోనే నా గుర్తింపు ఉంది.

తన సమస్తాన్నీ, అన్ని సమయాల్లో సమర్పించిన క్రీస్తులా నేను ఉన్నాననీ, ప్రజల్ని ప్రేమించి, ఇతరుల అవసరాల్ని చూసి కనికరపడేవాణ్ణనీ, సేవకుని వైఖరిని కలిగినవాడిననీ నేను గుర్తిండిపోవాలి.

వాక్యము

రోజు 2రోజు 4

ఈ ప్రణాళిక గురించి

 ది 2019 క్రికెట్ ప్రపంచ కప్ - అథ్లెట్ టెస్టిమోనైస్

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అథ్లెట్ల నుండి ఫస్ట్-వ్యక్తి కథలు మరియు సాక్ష్యాలు.

More

మేము ఈ ప్రణాళికను అందించడానికి స్పోర్ట్Go మాగ్ కు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://sportgomag.com/