యేసు మాత్రమేనమూనా
యేసు మాత్రమే – దుష్టత్వాన్ని అధిగమించువాడు
భూమి మీద నివసిస్తున్నవారంగా మనం దాదాపు ప్రతీ దినం చెడును ఎదుర్కొంటున్నాము. తక్షణ తృప్తి కలిగించే వాటిని ఎన్నుకోవడానికీ, స్వలాభం కోసం పొదుపు చెయ్యడానికీ, మనుష్యులను దుర్వినియోగం చేయడానికీ, దురాశకు లోనవ్వడానికీ మనం శోధించబడతాము. యేసు జీవితాన్ని చూస్తున్నట్లయితే, ఆయన సంపూర్ణ దేవుడూ, సంపూర్ణ మానవుడూ అయినప్పటికీ శోధనను అధిగమించాడు. దుష్ట దృష్టిని ఎదుర్కొని దానిని అణచివేస్తాడు. అందువల్ల, యెంచుకొనే అవకాశం మనకు ఉన్నప్పటికీ దుష్టత్వంలోని పడిపోవడానికి, అది మనలను కిందకు తీసుకొనివెళ్ళడానికి మనం ఎటువంటి కారణాలను చూపించలేము. దుష్టత్వాన్ని మనం అధిగమించడానికి యెంచుకోవచ్చును లేదా దానికి లోబడడానికి యెంచుకావచ్చును. నేటి వాక్య భాగంలో అరణ్యంలో యేసుకు సాతాను కలిగించిన శోధనలను గురించి మనం చూస్తున్నాము. వేడిమితో ఉన్న అరణ్యంలో ఉపవాసం, ప్రార్థనలో ఉన్న యేసును తక్కువవానిగా చేసాడు. శోధకుడు ఆయన వద్దకు వచ్చినప్పుడు ఆయన ఆకలితోనూ, శారీరక అలసటతో ఉన్నాడు. ఆయన శారీరక ఆకలిని గురించి మాట్లాడడం ఆరంభించాడు. రాళ్ళను రొట్టెలుగా చేసుకోవాలని యేసును అడిగాడు, దానికి ద్వితీయోపదేశకాండం 8:3 వచనంలో “ఆహారమువలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాటవలన నరులు బ్రదుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి, నీవేగాని నీ పితరులేగాని యెన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను” వాక్యాన్ని ప్రస్తావిస్తూ యేసు దానికి జవాబిచ్చాడు.
ఒక మాటల ప్రవాహం ఇతర నీటి ప్రవాహాలకంటే దాని పరిసరాలతో సన్నిహితంగా సంబంధించబడింది, మనం దేవుని మాటలను స్వీకరించడానికి యెంచుకొన్నప్పుడు దేవునితోనే మనం సన్నిహితంగా సంబంధపరచబడతామని దీని అర్థం. మన హృదయాలలోనూ, మనం పెదవులపై దేవుని వాక్యాన్ని కలిగియుండకపోతే శత్రువుకు వ్యతిరేకంగా యుద్ధసామాగ్రిని కలిగియుండలేము. దేవుని వాక్యాన్ని సన్నిహితంగా తెలుసుకున్నందున శత్రువును ఏవిధంగా ఎదుర్కోవాలో యేసుకు ఖచ్చితంగా తెలుసు.
సాతాను చేసిన రెండవ పని ఏమిటంటే, దేవుని వాక్యాన్ని తన ప్రయోజనాలకు మలుపు తిప్పడం. సాతాను 91 వ కీర్తనను ప్రస్తావిస్తూ తనను తాను ఎత్తైన కొండశిఖరం నుండి కిందకు పడవేసుకొనమని చెప్పాడు. ఎందుకంటే ఆయనను గురించి శ్రద్ధ తీసుకోడానికి దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించాడని దేవుని వాక్యం వాగ్దానం చేసింది. ప్రభువును పరీక్షించవద్దని సాతానుకు చెప్పడంలో యేసు సంగ్రహమైన సమాధానం ఇచ్చాడు. ప్రణాళిక ప్రకారం కార్యాలు జరగనప్పుడు లేదా ఊహించని కార్యాలు జరిగినప్పుడు చాలా సార్లు దేవుణ్ణి ప్రశ్నించడానికి మనం శోధించబడతాము. మనం అర్థం చేసుకోవడానికి కష్టమైన విషయాలతో మనం పోరాటం చెయ్యవలసి వచ్చినప్పుడు మన జీవితంలోని ఎందుకు, ఎలా ప్రశ్నలు మనకు అర్థం కాకపోయినప్పటికీ మనం పరిపూర్ణంగా దేవుని యందు మన విశ్వాసాన్ని ఉంచాలి.
సాతాను చేసిన మూడవ పని ఏమిటంటే, ప్రపంచ రాజ్యాలను వాటి మహిమతో పాటు చూపిస్తూ ఆయన తనకు మ్రొక్కి ఆరాధించినట్లయితే వాటిని ఆయనకు వాటిని ఇస్తానని చెప్పాడు. యేసు సాతానును గద్దించాడు, ద్వితీయోపదేశకాండంలోని వచనాన్ని ప్రస్తావించాడు, “నీ దేవుడైన యెహోవాను ఆరాధించి ఆయనను మాత్రమే పూజించవలెను.” మనం ఎవరిని ఆరాధించాలి, దేనిని ఆరాధించాలనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే మనం ఆరాధించేది వ్యక్తి గానీ లేదా వస్తువు గానీ అవుతుంది. అది మన సంపద, వృత్తి, కుటుంబం లేదా మన పరిచర్య కూడా కావచ్చును. మన జీవితంలో దేవుని స్థానాన్ని తీసుకోనేదేదైనా అది ఒక విగ్రహం అవుతుంది, అనివార్యంగా ఒక విగ్రహం మనలను దేవుని నుండి దూరం చేస్తుంది. యేసు చేసినట్లుగా శోధనలను అధిగమించడానికి, మన జీవితంలోని ఈ రోజూ, ప్రతిరోజూ మనం ఎవరిని ఆరాధించాలో, ఎవరికీ సేవ చేయాలో యెంచుకోవాలి.
ప్రార్థన: ప్రియమైన ప్రభువా, దుష్టత్వం చేత అధిగమించబడకుండా, మంచితో చెడును అధిగమించడానికి మాకు సహాయం చేయాలని మేము ప్రార్థిస్తున్నాము. కేవలం నిన్ను మాత్రమే ఆరాధించడానికీ, నీ మాటను శ్రేష్టమైన రీతిలో తెలుసుకోవటానికీ, సమస్తంతో నిన్ను విశ్వసించడానికీ మాకు సహాయం చెయ్యండి. యేసు నామంలో, ఆమేన్
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
ఈ గందరగోళ కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు గురించి మరింత తెలుసుకోడానికి యెంచుకోండి, అనిశ్చిత సమయాల్లో భయం విషయంలో విశ్వాసం కలిగియుండడానికి యెంచుకోండి. మీరు ఈ ప్రణాళికను చదువుతున్నప్పుడు ప్రతీ దినం ఏమి జరుగుతున్నప్పటికీ భవిష్యత్తులోనికి ధైర్యంగా అడుగు పెడతారని మేము నిరీక్షిస్తున్నాము.
More
ఈ ప్రణాళికను అందించినందుకు మేము ఆర్ జియాన్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: http://www.wearezion.in