యేసు మాత్రమేనమూనా
యేసు మాత్రమే
మనం అనిశ్చిత కాలంలో జీవిస్తున్నాము. మానవజాతి ఎదుర్కొంటున్న సమస్యలకు అంతం లేదు, అయినా క్రీస్తు అనుచరులంగా “భయపడవద్దు” అని మనం తిరిగి తిరిగి కోరబడుతున్నాము. ఒత్తిడి, కష్టాలు అనివార్యం అయితే భయపడడం ఒక ఎంపిక అని నమ్మడానికి ఇది మనకు కారణాన్ని ఇస్తుంది. ఆందోళన ఒక ఎంపిక. సందేహం ఒక ఎంపిక. రాబోయే 8 రోజులు మీరు ఈ ప్రణాళికను చదువుతున్నప్పుడు మన ప్రపంచంలోని మసకబారిన పరిస్థితులలో యేసుపై మీ చూపు నిలపాలి అని మీ విషయంలో మా ప్రార్థన. మన భయాలను ఆయన మాత్రమే శాంతింపచెయ్యగలడు. సమస్యాత్మకంగా ఉన్న మన హృదయాలను ఆయన నిమ్మళపరుస్తాడు, మనకు గోచరం కాని శాంతిని ఇస్తాడు, మన లోకంలోని ఎండిన ప్రదేశాలను నిరీక్షణతో తడుపుతాడు. రానున్న కొద్ది రోజులలో మీరు ఎదుర్కొనే ప్రతి పరిస్థితిలోనూ బుద్ధిపూర్వకంగా ప్రభువైన యేసుమీద మీ గమనాన్ని నిలపాలని మిమ్మల్ని బతిమాలుతున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు సువార్త అద్దాల ద్వారా ఈ పూర్తి లోకాన్ని చూడడమూ, ఆయన మీద మీ దృష్టిని నిలపడమూ క్రమంగా ఒక అలవాటు అవుతుంది.
ప్రార్థన: ప్రియమైన ప్రభువా, నాలో ఉన్న తుఫానును నిమ్మళ పరచుము. ఈ దినం ఒక నూతన విధానంలో నీ మంచితనాన్నీ, ప్రేమనూ అనుభవించడానికి నాకు సహాయం చేయాలని నేను ప్రార్థిస్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను నీవు నాకు వెల్లడిపరచుకోవాలని ప్రార్థిస్తున్నాను. యేసు నామంలో, ఆమేన్.
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
ఈ గందరగోళ కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు గురించి మరింత తెలుసుకోడానికి యెంచుకోండి, అనిశ్చిత సమయాల్లో భయం విషయంలో విశ్వాసం కలిగియుండడానికి యెంచుకోండి. మీరు ఈ ప్రణాళికను చదువుతున్నప్పుడు ప్రతీ దినం ఏమి జరుగుతున్నప్పటికీ భవిష్యత్తులోనికి ధైర్యంగా అడుగు పెడతారని మేము నిరీక్షిస్తున్నాము.
More
ఈ ప్రణాళికను అందించినందుకు మేము ఆర్ జియాన్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: http://www.wearezion.in