యేసు మాత్రమేనమూనా
యేసు మాత్రమే- నిజమైన రాజు
యేసు రాజుల రాజు, ప్రభువుల ప్రభువు. ఆయన వాగ్దానం చేయబడిన మెస్సీయ అనేదానికి ప్రతీకగా ఒక గాడిద పిల్లపై యెరూషలేములోకి ప్రవేశించినప్పుడు ఆయన రాజ్యం రుజువు చేయబడింది. ఆయన అధికారం మనిషి చేత ఇవ్వబడలేదు కాని దేవుడే ఇచ్చాడు. ఆయన రాజ్యం ఈ లోకసంబంధమైనది కాదు. యేసు భూమిపై నడిచినప్పుడు అతను బోధించాడు, స్వస్థపరిచాడు, దేవుని శక్తి, అధికారంతో ప్రజలను విడిపించాడు. మనుష్యులు యేసును కలిసినప్పుడు వారు యేసుకు ఉన్న శక్తినీ, అధికారాన్నీ గుర్తించారు, ఆయనను విశ్వసించారు. ఇది వారి జీవితంలో పురోగతికి దారితీసింది. యేసు అనుచరులంగా, మనకు యేసు మాదిరిగానే శక్తి, అధికారం ఉంది. విచారకరంగా మనం వాటిని ఆచరణలో పెట్టము. ఈ శక్తి, అధికారం ఇతరులను కించపరచడం, వారి విషయంలో కఠినంగా ఉండడానికి కాదు, అయితే క్రీస్తులో మన స్థానాన్ని అర్థం చేసుకోడానికి ఇవి ఇవ్వబడ్డాయి. మనం క్రీస్తుతో సహ వారసులం అని తెలుసుకోవడం. మనం క్రీస్తులో నిలిచియుండి కొనసాగుతున్నప్పుడు యేసు చేసిన వాటిని మనమూ చేయగలమని విశ్వసించడం. మన జీవితంలో క్రీస్తు ప్రభుత్వానికి సంపూర్తిగా లోబడకపోతే ఈ శక్తి, అధికారంలో మనం ఎప్పుడూ భాగస్తులం కాలేము. మన వైఖరి వినయ పూరితమైనదిగానూ, ఆయన సంపూర్తిగా లోబడేదిగానూ ఉండాలి.
యేసు ఇతరుల వలే కాకుండా ఆయన ఒక రాజ్యానికి రాజు. క్రీస్తును ప్రేమించేవారు, ఆయన సేవలో తమ జీవితాలను సమర్పించుకొన్న వారి హృదయాలలో స్థాపించబడిన రాజ్యం. ఈ రాజ్యం కనిపించనిది అయితే చాలా వాస్తవమైనది, ఇది ఆరంభంలో స్వల్పమైనదిగా ఉంది, అయితే నిమిష నిమిషానికి వృద్ధి చెందుతుంది. దాని విస్తరణలో ఇది సహజాతీతమైనది, ఇది అంతా ప్రకృతిలో కలసిపోయిఉంది. తలక్రిందులుగానూ, కుడి యెడమలుగా ఉన్న రాజ్యం, దీని పౌరులు భూమిపై ఉన్నప్పుడు శక్తివంతమైన, ప్రభావవంతమైన జీవితాలను గడపడానికి ఇది కారణమవుతుంది. మన జీవితాలను రాజ్య పరంగా జీవించినప్పుడు అది మన దృక్పథాన్ని మారుస్తుంది, తరువాత మన జీవితాలను మారుస్తుంది. మనం ఇకపై మనకోసం కాదు, దేవుని కొరకూ, మనుష్యులకొరకూ జీవిస్తాము. మనం మనకోసం వస్తువులను నిల్వ చేసుకోము, అయితే అవసరతలో ఉన్నవారికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. మనం నివసించే ప్రదేశంలో మనం ఉప్పుగానూ, వెలుగుగానూ మారుతాము. ఇక్కడ మన మంచి క్రియలూ, మనలో ఉన్న క్రీస్తు పోలికలు మనల్ని ప్రత్యేకమైన వారిగా ఉంచుతుంది. మన చుట్టూ అవి కనిపిస్తాయి. మనుష్యులు ఎక్కడినుండి వచ్చారు లేదా వారివద్ద ఏమి ఉంది అని కాకుండా వారు ఎవరై ఉన్నారో దానిని బట్టి మనం చూస్తాము. ప్రతి ఒక్కరిలోనూ, ప్రతీదానిలోనూ మనం శ్రేష్టమైన దానిని చూస్తాము ఎందుకంటే మన రాజు, ప్రభువు మన దృక్ఫథాలను మార్చాడు. మనం ఆయన కోసం జీవిస్తాము, ఆయన తీసుకొని వెళ్ళిన ప్రతీ చోటికీ ఆయనను వెంబడించడానికీ, ఆయన అడిగినదానిని చెయ్యడానికి మనం సిద్ధంగా ఉన్నాము.
ప్రార్థన: ప్రియమైన దేవా, మీ ప్రభుత్వానికి లోబడడానికి నాకు సహాయం చెయ్యమని ప్రార్థిస్తున్నాను. ప్రతిదీ అర్థం చేసుకోవడం, అన్నింటినీ నియంత్రించడంలోని నా అవసరాన్ని నేను అప్పగిస్తున్నాను, నా జీవితాన్ని నీ స్వాధీనం చేసుకో, మీ దృఢమైన హస్తంతో నన్ను నడిపించు. నా జీవితంలో నీ రాజ్యం రావాలి, పరలోకంలో నీ చిత్తం నేరవేరునట్లు భూమి మీద నేరవేరాలని పార్తిస్తున్నాను. యేసు నామంలో. ఆమేన్.
ఈ ప్రణాళిక గురించి
ఈ గందరగోళ కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు గురించి మరింత తెలుసుకోడానికి యెంచుకోండి, అనిశ్చిత సమయాల్లో భయం విషయంలో విశ్వాసం కలిగియుండడానికి యెంచుకోండి. మీరు ఈ ప్రణాళికను చదువుతున్నప్పుడు ప్రతీ దినం ఏమి జరుగుతున్నప్పటికీ భవిష్యత్తులోనికి ధైర్యంగా అడుగు పెడతారని మేము నిరీక్షిస్తున్నాము.
More
ఈ ప్రణాళికను అందించినందుకు మేము ఆర్ జియాన్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: http://www.wearezion.in