యేసు మాత్రమేనమూనా
యేసు మాత్రమే- మానవజాతి కోసం నిరీక్షణ
మన జీవితాల్లో ఏ వ్యక్తి లేదా వస్తువుచేత నింపబడలేని దేవుని పరిమాణం, దేవుని రూపం శూన్యత మనందరిలోనూ ఉంది. నాయకులు, వైద్య విజ్ఞానం, సాంకేతికత లేదా సంబంధాలమీద మన పూర్తి విశ్వాసాన్ని ఉంచలేము. మన ఆరోగ్యం విఫలమైనప్పుడు లేదా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పుడు లేదా మన ఉద్యోగం పోగొట్టుకున్నప్పుడు లేదా విఫలమైన వివాహాన్ని అనుభవించినప్పుడు, ప్రపంచం అంతం అవుతున్నట్టు లేదా అధ్వాన్నంగా మారిపోతున్నట్లు అనిపిస్తుంది. క్రీస్తును ఎరిగిన వారు ఆయనను ప్రేమించండి, ఆయనను వెంబడించండి, అంతటితో కథ అంతం కాదు. మనం జీవించడానికీ, మన దర్శనాన్ని వెంబడించడానికీ, ఎప్పటికి విడిచిపెట్టకుండా ఉండడానికీ నిరీక్షణ ఒక కారణాన్ని ఇస్తుంది. చెడు సమయాలలోనుండి దేవుడు అద్భుతమైన క్షేమాన్ని అనుగ్రహిస్తాడని మనం విశ్వసించవచ్చు. ఎండిన కాలాలలోనుండి ఊహించని ఫలాలను భరించడానికి ఆయన సహాయం చేస్తాడు. విచారంలోనుండి ఆయన బలాన్ని అనుగ్రహిస్తాడు. మన జీవితాల కేంద్రంలో ఉన్నప్పుడు ఏదీ వ్యర్ధం కాదు. ఎందుకంటే ఆయన చొరవకు మించినది ఏమీ లేదు, ఆయన నియంత్రణలోనుండీ ఏదీ తప్పించుకోలేదు.
ఆయన లేకుండా మనం చూసేదంతా శ్రమలూ, అవినీతి, ఉదాసీనత, ద్వేషం మాత్రమే. ఆయనతో మనం జీవిత కష్టతరమైన పరిస్థితులలో శాంతి, ఆనందం, ప్రేమ, సహనం, సమాధానాలను కనుగొంటాము. ఈ రోజు మన ప్రపంచానికి యేసుక్రీస్తు మాత్రమే నిరీక్షణ.
ప్రార్థన: ప్రియమైన ప్రభువా, మేము అనిశ్చిత సమయాల్లో జీవిస్తున్నప్పుడు సహితం నీ మీద మా నిరీక్షణనూ, విశ్వాసాన్నీ ఉంచాలని ప్రార్థిస్తున్నాను. ప్రతి సంఘర్షణలో ఆనందాన్నీ, ఉద్దేశ్యాన్నీ కనుగొనడంలో మాక సహాయం చెయ్యండి. దానిలోనుండి మంచిని తీసుకొనివస్తావని మేము విశ్వసిస్తున్నాము. సర్వ లోకాన్ని నీ చేతుల్లో ఉంచుకొని, మీ పిల్లలందరికీ మంచి తండ్రిగా ఉన్నందుకు కృతజ్ఞతలు. యేసు నామంలో, ఆమేన్.
ఈ ప్రణాళిక గురించి
ఈ గందరగోళ కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు గురించి మరింత తెలుసుకోడానికి యెంచుకోండి, అనిశ్చిత సమయాల్లో భయం విషయంలో విశ్వాసం కలిగియుండడానికి యెంచుకోండి. మీరు ఈ ప్రణాళికను చదువుతున్నప్పుడు ప్రతీ దినం ఏమి జరుగుతున్నప్పటికీ భవిష్యత్తులోనికి ధైర్యంగా అడుగు పెడతారని మేము నిరీక్షిస్తున్నాము.
More
ఈ ప్రణాళికను అందించినందుకు మేము ఆర్ జియాన్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: http://www.wearezion.in