యేసు మాత్రమేనమూనా
యేసు మాత్రమే – నమ్మదగినవాడు
మీకు ఒక వాగ్దానం చెయ్యబడి, అది నెరవేర్చబడకుండ ఉన్న అనుభవం మీకు ఎప్పుడైనా కలిగిందా? బహుశా మీరు ఒకరికి వాగ్దానం చేసి ఉండవచ్చు, దానిని నెరవేర్చడానికి మీ శక్తి మేర శ్రేష్టమైన రీతిలో నెరవేర్చడానికి ప్రయతించినప్పటికీ పరిస్థితులు మీకు సహకరించి యుండకపోవచ్చు. ఫలితంగా మీరు ప్రజలను నిరాశపరిచారు. ఏవిధంగానైనా వాగ్దానాలు నేరవేర్చబడవలసి ఉంది. మానవులంగా మన శక్తిమేర ప్రయత్నం చెయ్యాలి, మన నిబద్దతలలో మనం విఫలం చెందవచ్చు. మరోవైపు, ఆకాశాన్నీ, భూమినీ సృష్టించిన వాడూ, మన పరలోకపు తండ్రి, ఆయన తన వాక్కును నేరవేరుస్తాడు. ప్రభువైన యేసు నమ్మదగిన వాడుగా అధికంగా అర్థం చేసుకోవడంలో ఆయన తండ్రిని సమీపంగా పరిశీలించాలి. ఆయన సమస్త విశ్వాసపాత్రతకు ఆధారమైన తండ్రి. విశ్వసనీయత పదం “ఏమునా” అనే హెబ్రీ పదం నుండి తీసుకోబడింది. - స్థిరమైన, మార్పులేని, స్థిరమైనది. ఆరాధించబడే దేవతలన్నిటినుండీ ప్రత్యేకమైనదిగా చూపించే దేవుని ఏకైక దైవలక్షణం “విశ్వసనీయత.”
ఆయన తన మాట విషయంలో నమ్మదగినవాడుగా ఉన్నాడు. ఆయన తన ప్రజలకు నమ్మదగినవాడు ఉన్నాడు. ఆయనను వెంబడించడానికి యెంచుకున్నవారికి ఆయన నమ్మదగినవాడుగా ఉన్నాడు. మన దేవుడు ఆ విధంగా ఉన్నాడు.
మీరు దేవుని నమ్మకత్వాన్ని అనుమానించినట్లయితే- మీ చుట్టూ, మీ వైపుకూ చూడండి. మనం నశించిపోకుండా చేసేది ఆయన నమ్మకత్వమే.
నేటి బైబిలు పఠనం ప్రభువైన యేసు రూపాంతరమును గురించి వివరిస్తుంది. ఈ చర్య చాలా కీలకమైన భాగాన్ని కలిగియుండి, యేసు మరణం, పునరుత్థానం వరకు ఇది నడిపించింది. ఎందుకంటే ఇది యేసు గుర్తింపు, ధర్మశాస్త్రమూ, ప్రవక్తలూ చెప్పిన దానికి నెరవేర్పు, దేవుని వాక్కు విషయంలో ఆయన విశ్వసనీయతకు రుజువునై ఉంది.
ఆదికాండము నుండి మలాకీ వరకు ఉన్న బైబిలు కథనాన్ని మనం చూసినప్పుడు మనకు పునరావృత కాల చక్రం ఉందని తెలుస్తుంది. విశ్వసనీయుడైన తన ప్రజలు జీవించడానికి ఆజ్ఞలు ఇస్తున్నాడు, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే విశ్వాసంలేని ప్రజలు, స్వీయకృత పరిణామాలు, శ్రమలు, పశ్చాత్తాపంతో మొర్రపెట్టడం, దేవుడు జాలితో స్పందించడం, తన ప్రజలకు పునరుద్ధరణ కలిగించడం – ఇదంతా ఒక కాల చక్రం. మానవుని అస్థిరత, పాపభూయిష్టత మధ్య దేవుడు నమ్మదగిన వాడుగా ఉన్నాడు. బైబిలులోని పాత నిబంధన అంతటిలోనూ యేసును గురించిన ప్రవచనాలు 55 వరకూ ఉన్నాయి. ఆయన జీవితం, ఆయన జననం, యవ్వనం, పరిచర్య, రాజ్యం మొదలైన వాటి గురించినవి ఉన్నాయి. కేవలం ఒకటి లేక రెండు ప్రవచనాలను నెరవేర్చడం కాదు కాని ఆయన ఈ ప్రవచానాలన్నిటినీ ఆయన వేరవేర్చడం అత్యద్భుతమైన సంగతి. మన తండ్రి దేవుడు ఆయన పలికిన ప్రతీ వాగ్దానాన్నీ నెరవేర్చిన వాడుగా ఉన్నాడు. మెస్సీయను పంపిస్తానని ఆయన వాగ్దానం చేశాడు, మనలను ఆయన విఫలం చెయ్యలేదు. అంతేకాకుండా మనలను రక్షించడానికీ, మనలను ఆయన వద్దకు పునరుద్ధరించడానికి ఆయన తన సొంత కుమారుని ఈ లోకానికి పంపించాడు. కేవలం దేవుడు మాత్రమే మన విషయంలో లోతుగా శ్రద్ధ చూపించాడు. మనుష్యులను తన కుటుంబంలోనికి దత్తత తీసుకోవడానికి మానవాళికి ప్రతిగా తన ఏకైక కుమారుడిని బలిగా ఇచ్చేంతగా ఆయన తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు.
ప్రార్థన: ప్రియమైన ప్రభువా, మా ఆత్మకు సంబంధించిన ప్రతీ కాలంలోనూ మీ విశ్వాస్యతను జ్ఞాపకం ఉంచుకోవాలని మేము ప్రార్థిస్తున్నాము. నీవు మాకు చేసినదానంతటినీ మేము మరచిపోకుండా రాబోతున్నదాని విషయంలో నిన్నే విశ్వసించుదుము గాక. అన్ని తరాలకు నిలిచియుండే నీ విశ్వాస్యతను బట్టి తండ్రీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను. యేసు నామంలో. ఆమేన్.
ఈ ప్రణాళిక గురించి
ఈ గందరగోళ కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు గురించి మరింత తెలుసుకోడానికి యెంచుకోండి, అనిశ్చిత సమయాల్లో భయం విషయంలో విశ్వాసం కలిగియుండడానికి యెంచుకోండి. మీరు ఈ ప్రణాళికను చదువుతున్నప్పుడు ప్రతీ దినం ఏమి జరుగుతున్నప్పటికీ భవిష్యత్తులోనికి ధైర్యంగా అడుగు పెడతారని మేము నిరీక్షిస్తున్నాము.
More
ఈ ప్రణాళికను అందించినందుకు మేము ఆర్ జియాన్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: http://www.wearezion.in