ప్రత్యేకంగా ఉండండినమూనా

ప్రత్యేకంగా ఉండండి

12 యొక్క 3

సిలువ పై కేంద్రీకృతమైన జీవితం


2:1-16: అపొస్తలుడైన పౌలు క్రీస్తు సిలువను గురించి మొదట 1:17 లో ప్రస్తావించారు. 1 కొరింథీయులకు 2:1-5 లో కూడా సిల్వను గూర్చి మాట్లాడుతున్నాడు. వాక్చాతుర్యంపై కాకుండా సిలువ సందేశంపై దృష్టి పెట్టానని ఆయన చెప్పారు. కొరింథీలోని విశ్వాసులు మానవ జ్ఞానం కంటే క్రీస్తుపై విశ్వాసం ఉంచేలా ఆయన ఇలా చేసారు. 2:6-16లో సువార్త మర్మమైన దేవుని జ్ఞానం అని అది పరిశుద్ధాత్మ ద్వారా వెల్లడిపర్చబడుతుంది అని పౌలు వ్రాసారు.


కొన్ని సంఘాలు వినోదాల పై కేంద్రీకృతమైనవి. పాపం గురించి ప్రస్తావించడం కాని ఖండించడం కాని చేయకుండా వారు తమ సంఘసభ్యులను వినోదాలతో సంతోషంగా ఉంచడానికి నిరంతరం ప్రయత్నిస్తుంటారు. వారు వేదిక నుండి వారి వ్యక్తిత్వాన్ని ఎలా అభివృద్ధిపరచుకోవాలో బొద్తిస్తుంటారు. కాని సిలువను గురించి చాలా అరుదుగా బోధిస్తుంటారు. పౌలు మాత్రం సిలువ సందేశాన్ని నిరంతరం బోధించాడు.


పౌలు యొక్క ప్రధాన బోధన అంశం క్రీస్తు సిలువే. ఎందుకో తెలుసా? క్రీస్తు యొక్క బలి ద్వారా మాత్రమే క్షమాపణ సాధ్యమవుతుంది. అయితే మన సంగతేమిటి? మనము సిలువను గురించి నొక్కి చెబుతున్నామా? మనం సిలువ గురించి పాడాలి. సిలువ గురించి బోధించాలి. అలాగే మనం సిలువను మోసుకొని యేసును వెంబడించాలి. సిలువ పై కేంద్రీకృతమైన జీవితాన్ని మనము జీవిద్దాం.


ప్రార్థన: ప్రియమైన తండ్రీ, సిలువ పై కేంద్రీకృతమైన జీవితాన్ని జీవించడానికి మరియు మీ నామమునకు మహిమ తెచ్చేందుకు మీ కృపను నాకు దయచేయండి.


రోజు 2రోజు 4

ఈ ప్రణాళిక గురించి

ప్రత్యేకంగా ఉండండి

కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక ఈనాటి క్రైస్తవులకు సంబంధించిన అనేక సమస్యలను వివరిస్తుంది. ఈ పత్రికలోని మొదటి ఏడు అధ్యాయాల్లో నుండి ఆత్మీయ పాఠములు ఇస్తూ ఈ పాపపు లోకంలో క్రీస్తు కొరకు ప్రత్యేకమైన వారిగా జీవించాలని డాక్టర్ డేవిడ్ మెండే గారు మన్నల్ని ప్రోత్సహిస్తారు.

More

ఈ ప్రణాళికను అందించినందుకు ఎల్-షద్దాయ్ అసెంబ్లీ ఆఫ్ గాడ్ చర్చ్‌కు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://elshaddaiag.in/