ప్రత్యేకంగా ఉండండినమూనా

ప్రత్యేకంగా ఉండండి

12 యొక్క 7

కొద్దిగా పులిసిన పిండినిగూర్చి జాగ్రత్త వహించండి


5:1-13: ఈ వచనాలలో అపొస్తలుడైన పౌలు లైంగిక అనైతికత యొక్క పాపాన్ని మరియు దానిపై కొరింథీ సంఘము యొక్క అశ్రద్ధను ప్రస్తావిస్తారు. ఒక ఘోరమైన పాపం చేసిన వ్యక్తిని వెలివేయమని సంఘాన్ని ఆదేశిస్తాడు.


బ్రిటన్‌లో ఒక వ్యక్తి ఒక పామును పెంచిన కథను నేను విన్నాను. ఆ పాము బలంగా మరియు పెద్దదిగా పెరిగింది. ఒక రోజు ఈ ఎనిమిది అడుగుల పొడవైన కొండచిలువ తనను పెంచిన వ్యక్తిని చంపింది. పాపం కూడా అలాంటిదే. మన జీవితంలో పాపాన్ని అలరిస్తే, అది ఒక రోజు మనల్ని నాశనం చేస్తుంది.


సంఘములో ఒక వ్యక్తి యొక్క పాపాత్మకమైన ప్రవర్తన తరచుగా పులిసిన పిండి వలె ఉంటుంది. ఇది ఇతర సంఘ సభ్యులకు కూడా వ్యాపిస్తుంది. క్రీస్తు శరీరంలో పాపాన్ని వెలివేసే ముఖ్యమైన మరియు బాధాకరమైన బాధ్యత సంఘ నాయకులపై ఉంది. వ్యక్తిగత స్థాయిలో, పులిసిన పిండివలె పాపం ప్రారంభం అయినప్పుడు ప్రతి క్రైస్తవుడు ఆ పాపంతో తీవ్రంగా వ్యవహరించాలి. లేకపోతే పాపం మన పూర్తి జీవిని మరియు ఆధ్యాత్మిక జీవితాని నాశనం చేస్తుంది.


ప్రార్థన: ప్రభువా, పాపం నన్ను చంపే ముందు పరిశుద్ధాత్ముని ద్వారా పాపాన్ని చంపడానికి నాకు సహాయం చేయండి.


రోజు 6రోజు 8

ఈ ప్రణాళిక గురించి

ప్రత్యేకంగా ఉండండి

కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక ఈనాటి క్రైస్తవులకు సంబంధించిన అనేక సమస్యలను వివరిస్తుంది. ఈ పత్రికలోని మొదటి ఏడు అధ్యాయాల్లో నుండి ఆత్మీయ పాఠములు ఇస్తూ ఈ పాపపు లోకంలో క్రీస్తు కొరకు ప్రత్యేకమైన వారిగా జీవించాలని డాక్టర్ డేవిడ్ మెండే గారు మన్నల్ని ప్రోత్సహిస్తారు.

More

ఈ ప్రణాళికను అందించినందుకు ఎల్-షద్దాయ్ అసెంబ్లీ ఆఫ్ గాడ్ చర్చ్‌కు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://elshaddaiag.in/