ప్రత్యేకంగా ఉండండినమూనా

ప్రత్యేకంగా ఉండండి

12 యొక్క 9

మీ శరీరంలో దేవుణ్ణి మహిమపరచండి


6:12-20: ఈ వాక్యభాగంలో కొరింథీయులకు వేశ్యలను ఉపయోగించుకునే స్వేచ్ఛ ఉందని వారు భావించినట్లు మనం చూస్తాము. కాబట్టి క్రైస్తవ స్వేచ్ఛ గురించి వారి తప్పుడు అభిప్రాయాన్ని పౌలు సరిదిద్దుతున్నాడు. లైంగిక అనైతికత క్రీస్తుకు (వ. 15), ఒకరి సొంత శరీరానికి (వ. 16-18), మరియు పరిశుద్ధాత్మకు (వ. 19-20) వ్యతిరేకమైన పాపం.


చాలా మతాలు ఆత్మను ఆధ్యాత్మికంగా చూస్తాయి మరియు శరీరం భూసంబంధమైనదని భావిస్తారు. కానీ బైబిల్ అలాంటి అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తుంది. ఆత్మ మరియు శరీరం రెండూ దేవునిచే సృష్టించబడ్డాయి. యోహాను 1:14 లో దేవుని కుమారుడు శరీరధారియై, ఈ లోకానికి వచ్చాడు అనే విషయాని మనము చూడగలం.


కొరింథీ సంస్కృతిలో వేశ్యల వద్దకు వెళ్లడం ఆమోదయోగ్యమైన పద్ధతి. అయితే వారి శరీరాలు ప్రభువుకు చెందినవని మరియు పునరుత్థానం కోసం ఉద్దేశించబడ్డాయని (వ. 13-14) పౌలు కొరింథీ విశ్వాసులకు గుర్తు చేస్తున్నారు. అందుకే వారు తమ శరీరాలను పాపంతో అపవిత్రం చేయకూడదు. దానికి బదులుగా, వారి శరీరాలలో దేవుణ్ణి మహిమపరచాలని వారికి ఆజ్ఞాపించాడు (వ. 20). మనము అద్దె ఇంట్లో నివసిస్తే, ఆ ఇంటిని పాడు చేయకుండా జాగ్రత్తపడతాము కాదా? మీ శరీరం దేవునికి చెందినది. దాన్ని అపవిత్రం చేయవద్దు. మీ శరీరంలో దేవుణ్ణి మహిమపరచండి!


ప్రార్థన: ప్రభువా, పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి మరియు నా శరీరంలో నిన్ను మహిమపరచడానికి నీ కృపను నాకు దయచేయండి.


రోజు 8రోజు 10

ఈ ప్రణాళిక గురించి

ప్రత్యేకంగా ఉండండి

కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక ఈనాటి క్రైస్తవులకు సంబంధించిన అనేక సమస్యలను వివరిస్తుంది. ఈ పత్రికలోని మొదటి ఏడు అధ్యాయాల్లో నుండి ఆత్మీయ పాఠములు ఇస్తూ ఈ పాపపు లోకంలో క్రీస్తు కొరకు ప్రత్యేకమైన వారిగా జీవించాలని డాక్టర్ డేవిడ్ మెండే గారు మన్నల్ని ప్రోత్సహిస్తారు.

More

ఈ ప్రణాళికను అందించినందుకు ఎల్-షద్దాయ్ అసెంబ్లీ ఆఫ్ గాడ్ చర్చ్‌కు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://elshaddaiag.in/