ప్రత్యేకంగా ఉండండినమూనా

ప్రత్యేకంగా ఉండండి

12 యొక్క 10

వివాహం ఒక నిబంధన, ఒప్పందం కాదు


7:1-11: ఈ భాగంలో అపొస్తలుడైన పౌలు అనేక సమస్యలను ప్రస్తావించారు. అతను వివాహంలో లైంగికతను గూర్చి (వ. 1-7), పెళ్లికాని వారితో మరియు విధవరాలతో వివాహం మరియు బ్రహ్మచర్యం గూర్చి (వ. 8-9), మరియు వివాహిత క్రైస్తవులతో విడాకుల గూర్చి (వ. 10-11) మాట్లాడుతారు. 


కొరింథీ నగరం లైంగిక అనైతికతకు మరియు మత వ్యభిచారానికి ప్రసిద్ది చెందింది. విశ్వాసులకు లైంగిక మరియు వివాహం గూర్చి కొన్ని సూచనల అవసరం. కాబట్టి పౌలు ఈ సమస్యలను 7వ అధ్యాయంలో ప్రస్తావించారు. కొరింథీయులు వారి వైవాహిక జీవితంలో నమ్మకంగా ఉండాలని పౌలు ఆజ్ఞాపించారు. విడాకులు తీసుకోకుండా ఉండమని కూడా ఆయన కోరతాడు.


ఒక భర్త లేదా భార్యకు ఎటువంటి చట్టబద్ధమైన కారణం లేకుండా విడాకులు తీసుకోవడానికి రోమీయుల చట్టం అనుమతించింది. కానీ పౌలు వివాహం యొక్క శాశ్వతతను నొక్కి చెప్పాడు. ఆయన ఇచ్చిన బోధన యేసు ఇచ్చిన ఆజ్ఞలపై ఆధారపడింది (మత్తయి 5:32; 19: 9; మార్కు 10:11; లూకా 16:18). బైబిల్ వివాహానికి ఉన్నత ప్రమాణాలను కోరుతుంది. ఎందుకంటే వివాహము దేవుని ముందు చేయబడిన నిబంధన, మనుషులు చేసుకొనే ఒప్పందం కాదు. 


ప్రార్థన: ప్రభువా, నా జీవిత భాగస్వామికి నమ్మకంగా ఉండడం ద్వారా నిన్ను మహిమపరచడానికి నాకు సహాయం చేయండి.


రోజు 9రోజు 11

ఈ ప్రణాళిక గురించి

ప్రత్యేకంగా ఉండండి

కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక ఈనాటి క్రైస్తవులకు సంబంధించిన అనేక సమస్యలను వివరిస్తుంది. ఈ పత్రికలోని మొదటి ఏడు అధ్యాయాల్లో నుండి ఆత్మీయ పాఠములు ఇస్తూ ఈ పాపపు లోకంలో క్రీస్తు కొరకు ప్రత్యేకమైన వారిగా జీవించాలని డాక్టర్ డేవిడ్ మెండే గారు మన్నల్ని ప్రోత్సహిస్తారు.

More

ఈ ప్రణాళికను అందించినందుకు ఎల్-షద్దాయ్ అసెంబ్లీ ఆఫ్ గాడ్ చర్చ్‌కు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://elshaddaiag.in/