ప్రత్యేకంగా ఉండండినమూనా
పరిశుద్ధమైన వారీగా పిలువబడ్డవారము
బైబిల్ గ్రంధము మనలను “పరిశుద్ధమైన వారము” అని సూచించినప్పుడు మనం సంపూర్ణుముగా పరిశుద్ధమైన వారము అని అర్థమా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు 1 కొరింథీ పత్రిక పరిచయాన్ని క్లుప్తంగా చూద్దాం.
క్రీ. శ. 54 లో కొరింథీలోని క్రైస్తవులకు అపొస్తలుడైన పౌలు ఈ పత్రికను వ్రాసారు. కొరింథీ పట్టణం ఒక ముఖ్యమైన వాణిజ్య మార్గంలో ఉంది. ఆ పట్టణం లైంగిక జారత్వమునకు, నానావిధమైన మత వైవిధ్యమునకు మరియు అవినీతికి ఖ్యాతి కలిగింది. కొరింథీలోని సంఘము ఈ ప్రభావాలతో పోరాడింది కాబట్టి అక్కడ అనేక సమస్యలను పరిష్కరించడానికి పౌలు కొరింథీయులకు ఈ పత్రికను వ్రాసారు.
1:1-9: మనము 1 కొరింథీ 1:1-19 చదివితే, అపొస్తలుడైన పౌలు కొరింథీలోని సంఘమును వారిని పలకరిస్తు వ్రాసారు (1-3) మరియు కొరింథీలోని సంఘపు వారిని మాటల జ్ఞానంతో మరియు ఆధ్యాత్మిక వరములతో ఆశీర్వదించినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు (4-9).
కొరింథీ సంఘములో చాలా సమస్యలు ఉన్నప్పటికీ, అపొస్తలుడైన పౌలు వారిని “పరిశుద్ధపర్చబడ్డవారు” అని మరియు “పవిత్రమైన వారు” అని పిలిచారు. స్థితిత్వంగా వారు పరిశుద్ధులు మరియు పవిత్రులు, కాని వారు ప్రతి రోజు ఆచరణాత్మకంగా పవిత్ర జీవితాన్ని జీవించాల్సిన అవసరం ఉండింది. మనుము పవిత్రమైన వారముగా పిలువబడ్డవారము కాబట్టి మనుము అట్టి రీతిగా జీవించడానికి ప్రయత్నిద్దాము.
ప్రార్థన: ప్రభువా, మాకిచ్చిన పరిశుద్ధమైన పిలుపు ప్రకారం జీవించడానికి మాకు సహాయం చేయండి.
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక ఈనాటి క్రైస్తవులకు సంబంధించిన అనేక సమస్యలను వివరిస్తుంది. ఈ పత్రికలోని మొదటి ఏడు అధ్యాయాల్లో నుండి ఆత్మీయ పాఠములు ఇస్తూ ఈ పాపపు లోకంలో క్రీస్తు కొరకు ప్రత్యేకమైన వారిగా జీవించాలని డాక్టర్ డేవిడ్ మెండే గారు మన్నల్ని ప్రోత్సహిస్తారు.
More
ఈ ప్రణాళికను అందించినందుకు ఎల్-షద్దాయ్ అసెంబ్లీ ఆఫ్ గాడ్ చర్చ్‌కు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://elshaddaiag.in/