ప్రత్యేకంగా ఉండండినమూనా
వెలుగులో జీవించండి
6:1-11: ఈ వాక్యభాగంలో అపొస్తలుడైన పౌలు క్రైస్తవేతర న్యాయమూర్తుల ముందు చిన్న సమస్యలు పరిష్కరిస్తున్న క్రైస్తవులను ఉద్దేశించి వ్రాసాడు. సంఘం తమలో తాము అలాంటి వివాదాలను పరిష్కరించుకోగలదని ఆయన వారికి చెబుతాడు. విశ్వాసులలో కొందరు ఇంకా లోకరీతిగా జీవిస్తున్నారు. కాబట్టి కొరింథీయుల అపవిత్ర పనులను పౌలు ఖండించారు. అట్టివారు దేవుని రాజ్యయంలో వారసత్వం పొందలేరని హెచ్చరించారు.
అరణ్య ప్రయాణంలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయటకు వచ్చినప్పటికీ ఐగుప్తు వారిలోనే ఉందని మనం చూడగలము. అదే విధంగా రక్షింపబడిన తరువాత కూడా కొంతమంది క్రైస్తవులు తమ పాత జీవితానికి తిరిగి వెళ్ళాలనే ఆకర్షణకు లోనవుతారు. కొరింథీ క్రైస్తవులకు జరిగింది అదే. వారిలో కొందరు వారి పాత జీవిత సరళి ప్రకారం జీవిస్తున్నారు.
కాని మనము క్రొత్త జీవితాని పొందుకున్నాము కాబట్టి దేవుని వాక్యానికి అనుగుణంగా జీవించాలి. మనుము పరిశుద్ధ రక్తములో కడుగబడి పవిత్రులై ప్రభువు దృష్టిలో నీతిమంతులుగా మార్చబడ్డాము (వ. 11). కాబట్టి మనము దేవుడు చేసిన పరివర్తనను మన జీవితాలద్వారా ప్రదర్శించాలి. మనం పాపం చేసినప్పుడు వెంటనే పశ్చాత్తాపపడి దానిని విడిచిపెట్టాలి. మనం ఇక చీకటిలో జీవించలేము. వెలుగులో జీవించండి!
ప్రార్థన: ప్రభువా, చీకటి పనులను విడిచిపెట్టి వెలుగులో జీవించుటకు నాకు సహాయం చేయండి.
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక ఈనాటి క్రైస్తవులకు సంబంధించిన అనేక సమస్యలను వివరిస్తుంది. ఈ పత్రికలోని మొదటి ఏడు అధ్యాయాల్లో నుండి ఆత్మీయ పాఠములు ఇస్తూ ఈ పాపపు లోకంలో క్రీస్తు కొరకు ప్రత్యేకమైన వారిగా జీవించాలని డాక్టర్ డేవిడ్ మెండే గారు మన్నల్ని ప్రోత్సహిస్తారు.
More
ఈ ప్రణాళికను అందించినందుకు ఎల్-షద్దాయ్ అసెంబ్లీ ఆఫ్ గాడ్ చర్చ్‌కు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://elshaddaiag.in/