అరణ్యం నుండి పాఠాలునమూనా
అరణ్యంలో శత్రువులు
మనలో ప్రతి ఒక్కరికి అరణ్యం ప్రేమగల దేవుడు చేత రూపొందించబడినప్పటికీ,కష్టమైన క్షణాలను నరకం యొక్క గొయ్యి నుండి జరిగే దాడులుగా సులభంగా అపార్థం చేసుకొంటాము. ఆసక్తికరమైన విషయం, ప్రభువైన యేసు అపవాదిచే శోధింపబడుటకు అరణ్యానికి పరిశుద్ధ ఆత్మ నడిపించాడు. అరణ్యం అనేది శక్తివంతమైన ఆపదలు, మరణపు అంచులు, అనేకమైన ఎత్తు స్థలాలతో నిండిన కాలం. అయితే మనం ఆయనకు సమీపంగా ఆకర్షించబడడానికీ మరియు ఆయన మీద ఎక్కువగా ఆధారపడటానికి దేవుడు వీటన్నింటిని అనుమతించాడు.
ఇలా చెప్పిన తరువాత, ఈ కాలంలో మన గమనాన్ని నిరుత్సాహపరచడానికి,కలవర పరచడానికి, బంధించడానికి శత్రువు తన శక్తి మేరకు ప్రతిదానినీ జరిగిస్తాడు. వాడు ఒక దుర్మార్గపు శత్రువు,వాడి నినాదం దొంగిలించడం,చంపడం మరియు నాశనం చేయడం. వీటిని జరిగించాడానికి వాడు తన ఆయుధశాలలోని అన్ని ఆయుధాలను ఉపయోగిస్తాడు. ఈ కాలంలో మనం అనుభవించే అనేక భావోద్వేగాల మధ్య సమాధానాన్ని కనుగొనడమే విజయాన్ని అనుభవించడంలో కీలకమైన అంశం.
మన విశ్వాసాన్ని తారుమారు చేయడానికి, మనం మన సహనాన్ని కోల్పోయేలా చెయ్యడానికి మరియు మనల్ని ఎండిపోయేలా చెయ్యడానికి ఉద్రిక్త స్థితిలో పనిచేసే శత్రువుల పథకాలను గుర్తించడం కూడా చాలా ముఖ్యం. అపవాది ఎవరినైనా మ్రింగివేయాలని చూస్తున్న గర్జించే సింహం లాంటివాడని మనం 1పేతురులో చదువుతాము. అపొస్తలుడైన యాకోబు మనల్ని వినయంగా ఉండమని పిలుపునిచ్చాడు,తద్వారా మనం అపవాడిని ఎదిరించగలము. ఈ పరిస్థితిలో వాడు పారిపోతాడు అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు.
అరణ్యం మధ్యలో అపవాది పన్నాగాల విషయంలో మనం తెలివితక్కువగా ఉన్నందున చాలా తరచుగా ఇబ్బంది తీవ్రమవుతుంది. దేవుని మంచితనం మరియు సన్నిధిని మనం సందేహించేలా చెయ్యడం, రాబోయే వాటి గురించి భయపడటం మరియు ఆందోళనగా ఉండేలా చెయ్యడం మరియు ప్రస్తుతం ఉన్న విధానాలను అవి ఉండవలసిన విధానాలతో పోల్చి చూస్తూ సణిగేలా చెయ్యడం ప్రాథమికంగా వాడి విధానంగా ఉంటుంది.
ఈ దాడులను ఎదుర్కోవడానికి, ఇంతవరకు మనల్ని నడిపించిన దేవునికి సమీపంగా మన మార్గాన్ని కనుగొనవలసిన అవసరం ఉంది. మన పోరాటాన్ని గుర్తించి,దానిని బయటికి పిలవడం ద్వారా మూలాల నుండి భయం,సందేహం మరియు అసంతృప్తిని ప్రతి అంశాన్ని వెలుపలికి తీయాలి. మనం శత్రువు ముందు భయపడాల్సిన అవసరం లేదు, అయితే మనం యేసులో ఉన్న విజయం గురించి ధైర్యంగానూ, నమ్మకంగానూ నిలబడగలము. దేవుని వాక్యాన్ని కత్తిలాగా ఉపయోగించండి, మరియు విజయం మీదే అని విశ్వసిస్తూ అన్ని సమయాలలో ఆత్మలో ప్రార్థిస్తూ ఉండండి.
ఈ ప్రణాళిక గురించి
ఎడారి సమయం అనేది తరచుగా మనలను నశించిపోయిన వారిని గానూ, త్యజించబడిన వారిని గానూ, విడిచిపెట్టబడినవారిని గానూ అనిపించేలా చేస్తింది. అయితే దీనిలో ఉన్న ఆసక్తికరమైన విషయం - ఇది దృక్ఫథం మార్పు, జీవిత పరివర్తనం, మరియు స్వభావంలో విశ్వాసం రూపొందడం. మీరు ఈ ప్రణాళిక చేస్తున్నప్పుడు మీరు అరణ్య అనుభవం విషయంలో ఆగ్రహించకుండా,దానిని హత్తుకొని,దేవుడు తన శ్రేష్టమైన కార్యాన్ని మీలో జరిగించడానికి అనుమతించాలని మీ విషయంలో ప్రార్థిస్తున్నాను.
More
ఈ ప్రణాళికను అందించినందుకు క్రిస్టీన్ జయకరన్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.instagram.com/christinegershom/