అరణ్యం నుండి పాఠాలునమూనా

అరణ్యం నుండి పాఠాలు

7 యొక్క 3

మన స్వభావాన్ని పరీక్షించడం

ఎటువంటి విద్య నైనా పొందిన ప్రతి ఒక్కరికీ పరీక్ష యొక్క ప్రాముఖ్యత తెలుసు. విద్యార్థి యొక్క పురోగతి మరియు అభివృద్ధిని చూపించే ఉద్దేశ్యంతో ఒక పరీక్ష ఏర్పాటు చెయ్యబడుతుంది. మరియు వారు తదుపరి స్థాయి విద్యకు సిద్ధంగా ఉన్నారో లేదో కూడా పరీక్షను బట్టి నిర్ణయిస్తారు. ఆత్మీయంగా,మన ప్రయాణం యొక్క తదుపరి భాగానికి సిద్ధం కావడానికి మనం పరీక్షించబడే ఒక మార్గం అరణ్యం.

మన పరీక్ష యొక్క ప్రాథమిక ప్రాంతం మన శీలంలో ఉంది. మన చుట్టూ లేనప్పుడు రహస్యంగా మనం ఏమై ఉన్నామో అనేదే మన శీలం. ఇది అదృశ్యంగా మన బాహ్య స్వభావాలను మరియు అనివార్యంగా మన పూర్తి జీవితాలను ఆకృతి చేసే భాగం ఇది. ఒక వ్యక్తి విజయవంతంగానూ, సమర్ధవంతంగానూ మరియు ఆకర్షణీయంగానూ ఉండగలడు కానీ వారి శీలంలో లోపాలు ఉన్నట్లయితే ఆ ఇతర విషయాలు ఏవీ ముఖ్యమైనవిగా ఉండవు. మనలో ప్రతి ఒక్కరు అపరిపూర్ణులుగా ఉంటాము. మనమందరం మన శీలంలో లోపాలను కలిగి ఉన్నాము మరియు యేసును అనుసరించడం ద్వారా ఆయన స్వస్థతను తీసుకురావడం మరియు మన వ్యక్తిగత మరియు రహస్య జీవితాలలో లోతుగా పరివర్తనను ప్రారంభిస్తాడని ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ పరివర్తన మనం దేవునితో మన నడకలో ఎదుగుతున్నప్పుడు ఇతరులకు కనిపించడం ప్రారంభమవుతుంది.

మన శీలాన్ని రూపొందించడానికి అరణ్యం చాలా ఆసక్తికరమైన మార్గాన్ని కలిగి ఉంది. సుదీర్ఘ నిరీక్షణలు,నష్టం మరియు శూన్యత యొక్క కఠినమైన పరిస్థితులు మన హృదయాలను పరీక్షించడానికి, తద్వారా మన శీలాన్ని పరీక్షించడానికి ఒక మార్గాన్ని కలిగి ఉంటాయి. మనం ఏమనుకుంటున్నామో,మనం చెప్పేది మరియు చేసేది అన్నీ మనం లోపల ఎవరిమై ఉన్నామో అనేదానితో నేరుగా ముడిపడి ఉంటాయి. మనలోని అంతర్గత మనిషి మీద ఉన్న తెరను తీసివేసేందుకు మరియు నిజంగా లోతుగా మనం ఏమై ఉన్నామో మనల్ని మనం చూడటానికి మనకు సహాయపడే అసాధారణ మార్గాన్ని అరణ్యం కలిగి ఉంది.

రాజైన దావీదు,తాను రాసిన అనేక కీర్తనలలో, అతని భావాలనూ మరియు భయపెట్టే నిజాయితీలో అతని లోపభూయిష్ట స్వభావాన్ని గురించి వ్రాస్తాడు. ఆ ప్రకటనలలోని శక్తివంతమైన విషయం - తన దేవుడు తనను మార్చడానికి సర్వశక్తిమంతుడని మరియు ఆయన ప్రేమ చాలా దృఢంగా ఉందని తెలుసుకుని దుర్బలత్వంతో తన సమస్యలను అంగీకరించాడు.

మనల్ని మనం దగ్గరగా చూసుకుని మన వ్యక్తిగత శీలాన్ని పరీక్ష చేసుకుంటే ఎలా ఉంటుంది. మనం ఏమి కనుగొంటాము? మనం దేవుని ముందు పవిత్రంగా రావడానికి ఇష్టపడతామా?

చెయ్యవలసినది:

ఈ కాలంలో మీరు గమనించిన “నేను”తో ప్రారంభమయ్యే మరియు ప్రతికూల శీలంలక్షణాలతో ముగిసే ప్రకటనల జాబితాను సిద్ధపరచనది. దీని ఉద్దేశ్యం మిమ్మల్ని అవమానించడం లేదా దోషిగా చేయడం కాదు,అయితే మీలోని ఈ భాగాలను యేసు యొక్క సురక్షితమైన మరియు స్వస్థపరిచే చేతులకు బహిర్గతం చేయడమే.

ప్రార్థన:

శాశ్వతుడవైన దేవా,

నేను ………,………,………..

నా పాపాన్ని నీ వద్ద ఒప్పుకుంటున్నాను. నా పాపాలను క్షమించి, నా గాయాలను మాన్పమని, నా అపరాధాన్ని తుడిచిపెట్టి, స్వచ్ఛమైన హృదయంతో నన్ను మరోసారి నీ ముందు నిలబెట్టమని నేను అడుగుతున్నాను. నా ప్రార్థన విన్నందుకు ధన్యవాదాలు.

నీ కుమారుడు, యేసు నామమును నేను ప్రార్థిస్తున్నాను,ఆమేన్!

రోజు 2రోజు 4

ఈ ప్రణాళిక గురించి

అరణ్యం నుండి పాఠాలు

ఎడారి సమయం అనేది తరచుగా మనలను నశించిపోయిన వారిని గానూ, త్యజించబడిన వారిని గానూ, విడిచిపెట్టబడినవారిని గానూ అనిపించేలా చేస్తింది. అయితే దీనిలో ఉన్న ఆసక్తికరమైన విషయం - ఇది దృక్ఫథం మార్పు, జీవిత పరివర్తనం, మరియు స్వభావంలో విశ్వాసం రూపొందడం. మీరు ఈ ప్రణాళిక చేస్తున్నప్పుడు మీరు అరణ్య అనుభవం విషయంలో ఆగ్రహించకుండా,దానిని హత్తుకొని,దేవుడు తన శ్రేష్టమైన కార్యాన్ని మీలో జరిగించడానికి అనుమతించాలని మీ విషయంలో ప్రార్థిస్తున్నాను.

More

ఈ ప్రణాళికను అందించినందుకు క్రిస్టీన్ జయకరన్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.instagram.com/christinegershom/