అరణ్యం నుండి పాఠాలునమూనా
సహనము పెంపొందించుకోవడంలో తర్ఫీదు.
తర్ఫీదు యొక్క మరొక ఉద్దేశం సహనమును నిర్మించడం. ఏ క్రీడాకారుడు అయినా తర్ఫీదు కాలం కోసం మాత్రమే కాకుండా భవిష్యత్తులో వారు పాల్గొనే ప్రతి పోటీకి కూడా వారి శరీరానికి సహనము ఉండేలా వారి శిక్షకులచే తర్ఫీదు ఇవ్వబడుతుంది.
క్రీస్తు అనుచరులములుగా మనకు ఈ విషయంలో ఎటువంటి వ్యత్యాసం లేదు. అరణ్య కాలం మనకు వర్తమానం మాత్రమే కాకుండా సుదీర్ఘకాలం పాటు తర్ఫీదును ఇస్తుంది. ఇది మనలో సహనమును పెంపొందించడం ద్వారా వృద్ధి యొక్క తదుపరి కాలాలలో మనకు తర్ఫీదును ఇస్తుంది. ఇది అకాలంగా అనిపించవచ్చు,ఎందుకంటే అరణ్యంలో ఉన్నప్పుడు మనం మన రోజువారీ పోరాటాలలో చిక్కుకున్నాము,దీర్ఘకాల దృష్టిని మనం మరచిపోతాము. అరణ్యం శాశ్వతంగా ఉండదని గుర్తుంచుకోవడం ముఖ్యం. ఈ కాలంలో దేవుడు మనలో తన కార్యాన్ని పూర్తి చేసినప్పుడు,అయన మనల్ని తదుపరి కలంలోనికి తీసుకువెళతాడు. మన తదుపరి ప్రయాణాలలో మనం పట్టుదలతో ముందుకు సాగాలంటే, మనలో లోతుగా పొందుపరిచిన సహనము అవసరం. అరణ్యం ఆ విధంగా చేస్తుంది.
మీరు నిత్యత్వముగా భావించే దాని కోసం ఎదురు చూస్తున్నప్పుడు మీరు కొనసాగుతూ ఉండే విశ్వాసాన్ని పెంపొందించుకోవడం ప్రారంభిస్తారు. ఇది విడిచిపెట్టని విశ్వాసం ఎందుకంటే దేవుడు ఒక పనిలో ఉన్నాడని మీకు తెలుసు. మీరు చుట్టుముట్టినట్లుగా అనిపించినప్పుడు,మీకు ఇతర ఆచరణీయ ఎంపికలు లేనందున మీరు పైకి వెదకడం ప్రారంభిస్తారు. మీ పరిస్థితికి మాటలు న్యాయం చేయడం లేదని మీకు అనిపించినప్పుడు మీరు మీ స్వరంతో ఆరాధించడం ప్రారంభిస్తారు. కష్టమైన పరిస్థితులు మీ అంతరంగాన్ని ఎలా రూపొందిస్తాయో మీరు చూస్తారు.మీరు ఇకపై నిస్సత్తువగా వేచి ఉండరు లేదా మీ మీద మీరు జాలిపడరు,బదులుగా మీరు మీ పెదవులపై పాటతో మరియు మీ హృదయంలో నిరీక్షణతో ప్రతి రోజు వచ్చినట్లుగానే తీసుకుంటున్నారు. తుఫాను మేఘాలు మీపై విరుచుకుపడతాయని మీకు అనిపించినప్పుడు కూడా మీరు దారిలో చిలకరించే చిన్న అద్భుతాలకు కృతజ్ఞతలు చెప్పడం నేర్చుకుంటారు. మీరు అనిశ్చితి సమయాలలో కూడా ఆనందంగా ప్రశాంతంగా ఉంటారు, దేవునికి ప్రతి విషయంలోనూ ప్రణాళిక ఉందని పూర్తిగా తెలుసుకొని ఉంటారు.
మీరు యేసును అనుసరించేటప్పుడు ఈ కాలంలో స్థిరపరచ బడిన సహనం మీ జీవితాంతం మిమ్మల్ని ముందుకు తీసుకువెళుతుంది. జీవితం సులభం కాదు అయితే వ్యతిరేక నెలలో పెరిగిన శాశ్వత విశ్వాసం కారణంగా అది నెరవేరుతుంది.
ఈ ప్రణాళిక గురించి
ఎడారి సమయం అనేది తరచుగా మనలను నశించిపోయిన వారిని గానూ, త్యజించబడిన వారిని గానూ, విడిచిపెట్టబడినవారిని గానూ అనిపించేలా చేస్తింది. అయితే దీనిలో ఉన్న ఆసక్తికరమైన విషయం - ఇది దృక్ఫథం మార్పు, జీవిత పరివర్తనం, మరియు స్వభావంలో విశ్వాసం రూపొందడం. మీరు ఈ ప్రణాళిక చేస్తున్నప్పుడు మీరు అరణ్య అనుభవం విషయంలో ఆగ్రహించకుండా,దానిని హత్తుకొని,దేవుడు తన శ్రేష్టమైన కార్యాన్ని మీలో జరిగించడానికి అనుమతించాలని మీ విషయంలో ప్రార్థిస్తున్నాను.
More
ఈ ప్రణాళికను అందించినందుకు క్రిస్టీన్ జయకరన్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.instagram.com/christinegershom/