అరణ్యం నుండి పాఠాలునమూనా

అరణ్యం నుండి పాఠాలు

7 యొక్క 4

మన విశ్వాసాన్ని పరీక్షించడం

మనం ఎవరి మీద విశ్వాసం ఉంచాము మరియు మనం ఎందుకు చేస్తాము అనేది ముఖ్యం. యేసును నమ్మిన మనం చాలాసార్లు ఆయన మీద విశ్వాసం ఉంచడానికి ఎందుకు ఎంచుకున్నామో మర్చిపోతాము. కాబట్టి ఇబ్బందికరమైన సమయాలు మనల్ని తాకినప్పుడు,ఎవరిని సహాయం అడగాలి, సలహా కోసం ఎవరిని ఆశ్రయించాలి మరియు ఎవరితో సంబంధ పడాలి అని మనం ఆలోచించడం ప్రారంభిస్తాము. ఈ సమయాలలో మనం నమ్మదగిన సహాయ ఆధారాలు మన విశ్వాసం యొక్క నాణ్యత గురించి మనకు చాలా తెలియజేస్తాయి. సువార్తలలో యేసు, తన శిష్యులకు ఆవ గింజంత పెద్ద (లేదా చిన్న) విశ్వాసం కలిగి ఉండమని చెప్పాడు. ఆయన పరిమాణం కంటే నాణ్యతకు విలువనిచ్చాడని ఇది సూచిస్తుంది.

మన విశ్వాసం యొక్క నాణ్యత అరణ్యంలో పరీక్షించబడుతుంది. మన ప్రార్థనలు ప్రభావం లేకుండా కనిపించినప్పుడు ప్రార్థన పని చేస్తుందా అని మనం ఆశ్చర్యపోతాము. వరుస పరాజయాలు మనల్ని తాకినప్పుడు ఆయన చెప్పినట్టు దేవుడు మన పక్షాన ఉంటాడా అనే సందేహం కలుగుతుంది. ఒంటరితనమే ఒక స్థిరమైన తోడుగా ఉన్నప్పుడు,దేవుడు భవనాన్ని విడిచిపెట్టాడని మనం అనుకుంటాము.

మన పరీక్షలోని ఈ భాగానికి సంబంధించిన ముఖ్యమైన అంశం దేవుని వాక్యం వైపు మళ్లడం మరియు ఆయన తాను ఎవరై ఉన్నానని చెప్పాడో, ఆయన ఉన్నాడు మరియు ఉండబోతున్నాడనే దానితో ఆయనను హత్తుకొని యుండడం. కీర్తనా కారులు వారి కలవరం గురించీ, మరియు నిరాశ గురింఛీ పదేపదే వ్రాస్తారు మరియు వారు దేవుని స్వభావాన్ని చిత్రంలోకి తీసుకువస్తారు. స్థిరమైన ప్రేమ,సహనం,దయ,శక్తి మరియు స్వారూప్యం వంటి ఆయన సద్గుణాలను వారు కొనియాడారు.

చెయ్యవలసినది:

ప్రతిరోజు మీరు దేవుని వాక్యాన్ని చదివే మీ మౌన ధ్యాన సమయంలో, "నువ్వు...." అనే ఉపసర్గతో దేవుని దైవిక లక్షణాలను గమనించండి. ఉదాహరణకు, నువ్వు సర్వశక్తిమంతుడవు, నువ్వు అద్భుతమైనవాడవు, మొదలైనవి.

మీరు వాటిని గుర్తించిన తరువాత,ఈ దేవుని దైవిక గుణాలను ధ్యానిస్తూ కొన్ని నిమిషాలు గడపండి,ఈ తలంపులు మీలోనికి ఇంకి పోనివ్వండి, మరియు మీ జీవితంలో అరణ్యం తాకిన పొడి భాగాలకు సహితం విస్తరింపనివ్వండి. ఇది ఖచ్చితంగా మీకు నిరీక్షణనూ మరియు సమాధానమునూ తీసుకొని వస్తుంది.

రోజు 3రోజు 5

ఈ ప్రణాళిక గురించి

అరణ్యం నుండి పాఠాలు

ఎడారి సమయం అనేది తరచుగా మనలను నశించిపోయిన వారిని గానూ, త్యజించబడిన వారిని గానూ, విడిచిపెట్టబడినవారిని గానూ అనిపించేలా చేస్తింది. అయితే దీనిలో ఉన్న ఆసక్తికరమైన విషయం - ఇది దృక్ఫథం మార్పు, జీవిత పరివర్తనం, మరియు స్వభావంలో విశ్వాసం రూపొందడం. మీరు ఈ ప్రణాళిక చేస్తున్నప్పుడు మీరు అరణ్య అనుభవం విషయంలో ఆగ్రహించకుండా,దానిని హత్తుకొని,దేవుడు తన శ్రేష్టమైన కార్యాన్ని మీలో జరిగించడానికి అనుమతించాలని మీ విషయంలో ప్రార్థిస్తున్నాను.

More

ఈ ప్రణాళికను అందించినందుకు క్రిస్టీన్ జయకరన్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.instagram.com/christinegershom/