నన్ను ఆజ్ఞాపించు – జీరో కాన్ఫరెన్స్‌నమూనా

నన్ను ఆజ్ఞాపించు – జీరో కాన్ఫరెన్స్‌

4 యొక్క 1

అడుగు వేయడం

“నన్ను ఆజ్ఞాపించు” అని చెప్పే ధైర్యం

పేతురు అభ్యర్థన చాలా విచిత్రంగా ఉండడం మీరెప్పుడైనా గమనించారా? ఎదురుగాలి నడుమ, ఇతరులు భద్రతకొరకు తమ దోనెను అంటిపెట్టుకొని ఉండగా, పేతురు విభిన్నమైనదానిని చూశాడు. సహజ నియమాలను మరియు మానవహేతువును ప్రతిఘటిస్తూ యేసు యెదుటకు వెళ్లే అవకాశంకొరకు చూశాడు.

“ప్రభువా, నీవే అయితే నీళ్లమీద నడిచి నీయొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్ము” అని పేతురు అన్నాడు. ఈ మాటలు విశ్వాసంతో అడుగువేయడంగురించి మూడు శక్తిమంతమైన విషయాలను వెల్లడిచేస్తాయి.

గుర్తింపు లేదా పరిశోధన (“నీవే అయితే”) – యేసు ఉనికిని పేతురు నిర్ధారించుకోవాలనుకున్నాడు. దిశ లేదా మార్గనిర్దేశం (“నీ యొద్దకు వచ్చుటకు”) – విశ్వాసంతో అతను వేసిన అడుగులో స్పష్టమైన ఉద్దేశ్యం మరియు గమ్యం ఉన్నాయి. విధేయత లేదా లోబడడం (“నాకు సెలవిమ్ము”) – అతను తనను తాను యేసు అధికారానికి అప్పగించుకున్నాడు. ఈ విషయం ఆలోచించండి: పేతురు యేసును తన దగ్గరకు రమ్మని అడగలేదు. వేరొక అద్భుతకార్యం చేయాలని కోరుకొనలేదు. అసాధ్యమైన పరిస్థితిలోకి తనకు సెలవిమ్మని అడిగాడు, ఎందుకంటె అతను గంభీరమైనదానినేదో గ్రహించాడు – యేసుతో ఉండడానికి తన తెగువ తగినదే అనుకున్నాడు.

ప్రార్థనాంశాలు:

“రమ్ము” అని మీ జీవితంలో యేసు ఎక్కడ చెప్పాడు?

సౌకర్యమనే ఏ దోనెను విడిచిపెట్టడానికి మీరు పిలువబడ్డారు?

విధేయత చూపే ముందు సరైన పరిస్థితులకొరకు మీరు వేచి చూస్తున్నారా?

మీకు సందేహించే రంగాలలోకి “నాకు సెలవిమ్మని” చెప్పే ధైర్యంకొరకు ప్రార్థించండి.

వ్యక్తిగత అనువర్తన:

“నాకు సెలవిమ్ము” గురించి మీ స్వంత ప్రార్థనను వ్రాసుకొనండి. సూటిగా ఉండండి:

మీరు ప్రస్తుతం ఉన్న సౌకర్యవంతమైన “దోనె”

యేసు మిమ్మల్ని నడవమన్న “నీళ్లు”

మీరు అధిగమించవలసిన భయాలు

మీరు వేయవలసిన మొదటి అడుగు

మననంకొరకు ప్రశ్నలు:

యేసు పిలుపుపట్ల పేతురు వెంటనే ప్రతిస్పందించడంలో మీకేమనిపించింది?

ఇతర శిష్యులు దోనెలోనే ఉండిపోవడంగురించి మీరేమనుకుంటున్నారు?

దేవుని పిలుపుపట్ల మీ ప్రతిస్పందనను ఎట్లా పేతురు ప్రతిస్పందనతో పోల్చవచ్చు?

రోజు 2

ఈ ప్రణాళిక గురించి

నన్ను ఆజ్ఞాపించు – జీరో కాన్ఫరెన్స్‌

“నన్ను ఆజ్ఞాపించు.” ఎదురుగాలి నడుమ అటూ ఇటూ ఊగిపోతున్న దోనెలోనుండి పైకి ఎగసిపడు తున్న నీళ్లలోకి అడుగుపెట్టిన పేతురు జీవితం ఈ రెండు పదాలతో మారిపోయింది. దోనెనుండి యేసు దగ్గరకు అతని ప్రయాణం విశ్వాసం, ఏకాగ్రత మరియు పురోగమనం గురించి శాశ్వత సత్యాలను వెల్లడి చేస్తుంది. ఈ 4-రోజుల దైవధ్యానం మత్తయి 14:28-33 వచనాలను అన్వేషిస్తూ, మీరు యేసు పిలుపును గుర్తించడానికి, విశ్వాసంతో భయాన్ని అధిగమించడానికి మరియు తదేకదృష్టితో ఆయనను చూచే ఏకాగ్రతకు మిమ్మల్ని నడిపిస్తుంది. మీరు దోనె అంచున ఉన్నా గానీ లేదా నీళ్లమీద నడవడం నేర్చు కుంటున్నా గానీ, “నన్ను ఆజ్ఞాపించు” అని సాధారణ విశ్వాసులు ధైర్యంతో చెప్పినప్పుడు ఏమి జరుగు తుందో తెలుసుకుంటారు.

More

ఈ ప్రణాళికను అందించినందుకు Zero కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: www.zeroconferences.com/india