నన్ను ఆజ్ఞాపించు – జీరో కాన్ఫరెన్స్‌నమూనా

పైకి చూడడం
తదేకదృష్టిలోని శక్తి
పేతురు దోనెనుండి దిగిన మరుక్షణంలోనే సహజనియమాలు వర్తించని ప్రాంతంలోకి ప్రవేశించాడు. అతనిని కబళించే అవే నీళ్లు అతని పాదాలక్రింద స్థిరమైన నేలమోపు అయ్యాయి. ఈ భిన్నతను కలి గించినదేమి? యేసుమీద అతని దృష్టిలో ఏకాగ్రత ఉంది.
దృశ్యాన్ని పరిశీలించండి: చీకటి రాత్రి, బలమైన గాలులు, ఎగసిపడుతున్న అలలు. అయినప్పటికి మత్తయి వర్ణన సాదాసీదాగా ఇలా తెలియజేస్తుంది: “యేసునొద్దకు వెళ్లుటకు నీళ్లమీద నడచెను.” ఈ వర్ణనలోని సాదాతనం ఒక గంభీరమైన సత్యాన్ని వెల్లడిచేస్తుంది: మన నేత్రాలు యేసుమీద నిలిచి నప్పుడు ఆయనవైపు చేసే ప్రయాణంలో అసాధ్యమైనది సైతం మాటమాత్రమైన వివరణ కాగలదు.
గ్రీకు భాషలో “నొద్దకు వెళ్లుటకు” అనే మాటలకు ఉపయోగించబడిన పదం నిరంతర చర్యను సూచిస్తుంది. పేతురు కేవలం అడుగులు వేయడం మాత్రమే కాదుగాని, అతను ముందుకు నడుస్తున్నాడు. ప్రతి ఒక అడుగు వాస్తవంమీద విశ్వాసపుటడుగు, భౌతికంగా అసాధ్యమైనదానిమీద ఆథ్యాత్మిక వాస్తవం.
ప్రార్థనాంశాలు:
మీ ఏకాగ్రతతో ఏ అన్యమనస్కతలు లేదా పరధ్యానాలు పొటీపడుతున్నాయి?
మీరు మీ సమయాన్ని యేసువైపు చూడడానికి వాడుతున్నారా, మీ పరిస్థితులవైపు చూడడానికి వాడు తున్నారా?
మీ దృష్టి దేవునిమీద నిలిచి ఉండడానికి మీకు సహాయంచేయాలని ఆయనను ప్రార్థించండి.
మీ దృష్టిని యేసుమీదనుండి మరల్చేవాటిని గుర్తించే వివేచనకొరకు ప్రార్థించండి.
వ్యక్తిగత అనువర్తన:
“తదేకదృష్టి పత్రిక” ను (గేజ్ జర్నల్) నేడే ప్రారంభించండి:
మీ దృష్టి యేసుమీద నిలిచిన సమయాలను వ్రాయండి.
ఏవి మీలో అన్యమనస్కతలు కలిగించాయో వ్రాయండి.
మీరు చూచినదాని ఆధారంగా మీ దృక్పథం ఎలా మారిందో వ్రాయండి.
మననంకొరకు ప్రశ్నలు:
మీ చుట్టూ ఉన్న పరిస్థితులను సైతం మీరు మర్చిపోయేలా మీరు యేసుమీద దృష్టి నిలిపిన చివరి సమయం ఎప్పుడు?
కష్టసమయాలలో మీరు క్రీస్తుమీద మీ దృష్టిని నిలిపి ఉంచడానికి ఏది మీకు సహాయం చేస్తుంది?
మీరు ఏకాగ్రతతో యేసుమీద మీ దృష్టిని నిలిపినప్పుడు మీ పరిస్థితి ఎట్లా మారిపోతుంది?
ఈ ప్రణాళిక గురించి

“నన్ను ఆజ్ఞాపించు.” ఎదురుగాలి నడుమ అటూ ఇటూ ఊగిపోతున్న దోనెలోనుండి పైకి ఎగసిపడు తున్న నీళ్లలోకి అడుగుపెట్టిన పేతురు జీవితం ఈ రెండు పదాలతో మారిపోయింది. దోనెనుండి యేసు దగ్గరకు అతని ప్రయాణం విశ్వాసం, ఏకాగ్రత మరియు పురోగమనం గురించి శాశ్వత సత్యాలను వెల్లడి చేస్తుంది. ఈ 4-రోజుల దైవధ్యానం మత్తయి 14:28-33 వచనాలను అన్వేషిస్తూ, మీరు యేసు పిలుపును గుర్తించడానికి, విశ్వాసంతో భయాన్ని అధిగమించడానికి మరియు తదేకదృష్టితో ఆయనను చూచే ఏకాగ్రతకు మిమ్మల్ని నడిపిస్తుంది. మీరు దోనె అంచున ఉన్నా గానీ లేదా నీళ్లమీద నడవడం నేర్చు కుంటున్నా గానీ, “నన్ను ఆజ్ఞాపించు” అని సాధారణ విశ్వాసులు ధైర్యంతో చెప్పినప్పుడు ఏమి జరుగు తుందో తెలుసుకుంటారు.
More
ఈ ప్రణాళికను అందించినందుకు Zero కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: www.zeroconferences.com/india