నన్ను ఆజ్ఞాపించు – జీరో కాన్ఫరెన్స్‌నమూనా

నన్ను ఆజ్ఞాపించు – జీరో కాన్ఫరెన్స్‌

4 యొక్క 4

నడక కొనసాగించడం

మొదటి అడుగును మించి

ఈ వృత్తాంతంలో మధ్యభాగంలోని హఠాత్పరిణామం ఎంత ముఖ్యమైనదో ముగింపు కూడ అంతే ముఖ్య మైనది. “వారు దోనె యెక్కినప్పుడు గాలి అణిగెను. అంతట దోనెలో నున్నవారు వచ్చి -నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మ్రొక్కిరి.” బలపడిన విశ్వాసంగురించి అనేక ముఖ్యమైన సత్యాలను ఈ ముగింపు వెల్లడిచేస్తుంది.

మొదటగా, వారు దోనెలోకి ఎక్కేవరకు గాలి అణగలేదని గమనించండి. దేవుడు కొన్నిసార్లు గాలిని అణచి వేస్తాడు; మరికొన్నిసార్లు దానిలోనే మనల్ని కాపాడతాడు. రెండూ అద్భుతాలే. రెండూ ఆయన మహిమను వెల్లడించేవే.

రెండవదిగా, ఈ అనుభవం కేవలం పేతురులో మాత్రమే కాక, దోనెలో ఉన్నవారందరిలోను మార్పు తెచ్చింది. మీ విశ్వాసపుటడుగు కేవలం మీకు చెందినది మాత్రమే కాదు. మీ విజయాలను మీ పోరాటా లను చూస్తున్న వారందరిది, మీ ప్రయాణంనుండి నేర్చుకున్నవారందరిది.

ప్రార్థనాంశాలు:

మీ విశ్వాసప్రయాణం యేసుగురించి మీ అభిప్రాయాన్ని ఎట్లా మార్చివేసింది?

మీ విశ్వాసప్రయాణాన్ని ఎవరు గమనిస్తున్నారు?

పురోగమన సమయాలలో మాత్రమే కాక, మీ విశ్వాసం నిరంతరం ఉండేలాగా సహాయంచేయాలని దేవుడిని ప్రార్థించండి.

మీ సాక్ష్యంద్వారా ప్రభావితమయ్యేవారికొరకు ప్రార్థించండి.

వ్యక్తిగత అనువర్తన:

విశ్వాసపు వారసత్వం –వ్రాయడానికి సమయం తీసుకొనండి.

ఇప్పటివరకు మీ ప్రధాన విశ్వాసపుటడుగులు

ప్రతి ఒక అడుగునుండి నేర్చుకున్న పాఠాలు

ఈ అనుభవాలు దేవునిగురించి మీ అభిప్రాయాన్నెలా రూపుదిద్దాయి

మీ ప్రయాణంచేత ప్రభావితమైనవారెవరు

దేవుడు మిమ్మల్ని పిలుస్తున్న తదుపరి అడుగులు ఏవి

మననంకొరకు ప్రశ్నలు:

ఈ అనుభవం శిష్యులలో యేసుమీద ఉన్న అభిప్రాయాన్నెలా మార్చివేసింది?

మన విశ్వాసప్రయాణాన్ని కాపాడుకొనడంలో ఆరాధన ఏ పాత్రను పోషిస్తుంది?

ఇతరులలో విశ్వాసాన్ని ప్రోత్సహించడానికి మీ అనుభవాలను మీరెలా ఉపయోగించగలరు?

రోజు 3

ఈ ప్రణాళిక గురించి

నన్ను ఆజ్ఞాపించు – జీరో కాన్ఫరెన్స్‌

“నన్ను ఆజ్ఞాపించు.” ఎదురుగాలి నడుమ అటూ ఇటూ ఊగిపోతున్న దోనెలోనుండి పైకి ఎగసిపడు తున్న నీళ్లలోకి అడుగుపెట్టిన పేతురు జీవితం ఈ రెండు పదాలతో మారిపోయింది. దోనెనుండి యేసు దగ్గరకు అతని ప్రయాణం విశ్వాసం, ఏకాగ్రత మరియు పురోగమనం గురించి శాశ్వత సత్యాలను వెల్లడి చేస్తుంది. ఈ 4-రోజుల దైవధ్యానం మత్తయి 14:28-33 వచనాలను అన్వేషిస్తూ, మీరు యేసు పిలుపును గుర్తించడానికి, విశ్వాసంతో భయాన్ని అధిగమించడానికి మరియు తదేకదృష్టితో ఆయనను చూచే ఏకాగ్రతకు మిమ్మల్ని నడిపిస్తుంది. మీరు దోనె అంచున ఉన్నా గానీ లేదా నీళ్లమీద నడవడం నేర్చు కుంటున్నా గానీ, “నన్ను ఆజ్ఞాపించు” అని సాధారణ విశ్వాసులు ధైర్యంతో చెప్పినప్పుడు ఏమి జరుగు తుందో తెలుసుకుంటారు.

More

ఈ ప్రణాళికను అందించినందుకు Zero కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: www.zeroconferences.com/india