జీవితమును భయము యొక్క స్వాధీనమునందు ఉంచుకొననీయకుమునమూనా

జీవితమును భయము యొక్క స్వాధీనమునందు ఉంచుకొననీయకుము

7 యొక్క 1

జీవితమును భయము యొక్క స్వాధీనమునందు ఉంచుకొననీయకుము

అసలు భయము అనగా నేమి? "వాస్తవముగా ఉన్న ఆపద బట్టి కాని, ఊహించిన ఆపద బట్టి కాని వచ్చు నిరాశయే” 

భయమునకు నిర్వచనము. నేను వేయు ప్రశ్న ఇదియే: జీవితము నుండి భయము ఆధిక్యత  పొందిన యెడల జరుగున దేమి? భయపడుట. 

జరుగబోవు కీడు కలిగించు భయము, తటాలున కలుగు భయము బలముగా కలుగుటతో కర్తవ్యము నాటంకపరచు చున్నవి. భయము మన యొక్క కార్యములు స్థంభింపచేయును. సందేహము. పుట్టించును. ఆంతర్యములోని. దేవుని యేర్పాటులను రద్దు చేయును.

భయము అనునది క్రైస్తవ జీవితమునుందు హింసించుటకును అడ్డగించుటకును శత్రువు ద్వారా వాడబడు మొదటి ఆయుధము. కాని యేసు ఈ శత్రువునోడించెను! (కొలస్సి 2:15) శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ  అనునవి దేవుడు ఇచ్చినవి. ఆయన శక్తిమంతుడగు సృస్టికర్త. జయశీలు నిగా తిరిగి రానైయున్న దేవుడు. 

నిస్సందేహముగా దేవుని పవిత్రమగు ప్రేమ నీ హృదయమందలి భయమును తీసి వేయుచున్నది. నీ యెడల దేవునికి గల ప్రేమ భయము యొక్క అన్ని రూపములను ధ్వంసము చేయుచున్నది. "ప్రేమలో భయముండదు. అంతే కాదు, పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్లగొట్టును. భయము దండనతో కూడినది. భయపడు వాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడిన వాడు కాదు" (1యోహను 4:18).  శాశ్వతమగు ఈ సత్యమునందు నిలబడి ఒప్పుకొనుము.

నేడు దీనినంగీకరించుము ...దేవుని వాక్యము నీ విశ్వాసమును పోషించును. దేవుని ఆత్మ సవాలు చేయుచు,  మోసుకొని పోవుచు,  ప్రాకరములను దాటునట్లును, కొండలను చొచ్చుకొని పోవునట్లు చేయుచున్నాడు. ఆయన శక్తి ద్వారా నీవు సాహసకర్యములు చేయుదువు (కీర్తనలు 18:29 మరియు  2సముయేలు 22:30)

ప్రార్థనలో  కలిసి నిలుచుదము.. ప్రభువా, నా ప్రభుడవు, రక్షకుడవని నా నోటితో ఒప్పుకొను చున్నాను. నీ వాక్యము ద్వారా నీవు చెప్పినది సత్యమనియు ఒప్పుకొనుచున్నాను. శక్తి, ప్రేమ ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ నిచ్చియున్నావు; నీనుండే దానిని పొందియున్నాను. నాలోని భయము, దాని అధికారమును పోగొట్టుకొని, నీ నామమునందు అది దాని శక్తిని పోగొట్టు కొనినదై , దాని అధికారము తీసి వేయబడినదై యున్నది. అవన్నియు నా జీవితమును  , భావోద్రేకములను, పరిస్థితులను సమస్తమును  సమర్పించినందుననే జరిగియున్నవి. నీ నామమును   మహిమపరచున్నాను. నీవిచ్చిన స్వేచ్చ కొరకును భయమును జయించుటకిచ్చిన స్ధితికిని  వందనములు యేసు నామమున ప్రార్థించుచున్నాను. ఆమెన్.

 

ప్రతి రోజు మీ ఇన్బాక్స్లో ప్రోత్సహించే మెయిల్ను మీరు పొందాలనుకుంటే “రోజు కో అధ్బుతం” కి  సబ్స్క్రయ ిబ్ చెయ్యండి.

రోజు 2

ఈ ప్రణాళిక గురించి

జీవితమును భయము యొక్క స్వాధీనమునందు ఉంచుకొననీయకుము

భయము అనగా నేమి? "వాస్తవముగా ఉన్న ఆపద బట్టి కాని, ఊహించిన ఆపద బట్టి కాని వచ్చు నిరాశయే”. భయము అనునది క్రైస్తవ జీవితమునుందు హింసించుటకును అడ్డగించుటకును శత్రువు ద్వారా వాడబడు మొదటి ఆయుధము. కాని యేసు ఈ శత్రువునోడించెను!

More

ఈ ప్రణాళికను అందించడానికి మేము యేసు నొక్కి చెప్పాలనుకుంటున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://tu.jesus.net/