జీవితమును భయము యొక్క స్వాధీనమునందు ఉంచుకొననీయకుమునమూనా
భయమే భయపడుచు పారిపోవుట గమనించుము
ఈ ప్రణాలికకి ఇది చివరి రోజు. ప్రతి రోజు మీ ఇన్బాక్స్లో ప్రోత్సహించే మెయిల్ను మీరు పొందాలనుకుంటే “రోజు కో అధ్బుతం” కి సబ్స్క్రయిబ్ చెయ్యండి.
భయము మానవుని సాధారణ అనుభవము. నేను కూడ కొన్ని సార్లు భయపడుచుందును. కాని ఒక రహస్యమును కనుగొంటిని. భయముతో జీవించునట్లు దేవుడు కోరలేదు. దానికి వ్యతిరేకముగా జీవింప కోరుచున్నాడు. భయము దానికదే విడిచి వెళ్ల వలసినదే!
దేవుడు దానిని తరుముటకు వాక్యము నిచ్చియున్నాడు. బైబిలు ప్రకటించిన దేమనగా...
· "ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి - అబ్రామా భయపడకుము. నేను నీకు కేడెము. నీ బహుమానము అత్యధిక మగు నని చెప్పెను" ( ఆదికాండము 15:1)
· అందుకు మోషె- భయపడకుడి. యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుహ్తీయులను ఇక మీదట మరి ఎన్నడును చూడరు" (నిర్గమకాండము 14:13)
· భయపడకుడి వారిని చూచి దిగులు పడకుడి. నీతో కూడ వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే.ఆయన నిన్ను విడివడు నిన్నెదబాయడు" (ద్వితీయోపదేశకాండము31:6)
· తత్తరిల్లు హృదయులతో ఇట్లనుడి - భయపడక ధైర్యముగా నుండుడి. ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండన దేవుడు చేయదగిన ప్రతి కార్యమును అయన చేయును. అయన వచ్చి తానే మిమ్మును రక్షించును" (యెషయా35:4)
· వారికి భయపడకుము. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైయున్నాను. ఇదే యెహోవా వాక్కు.(యిర్మియా 1:8)
· నేను నిన్ను రక్షింతును. భయపడక ధైర్యము తెచ్చుకొనుడి."(జెకర్య 8:13)
· చిన్నమందా భయపడకుడి రాజ్యము అనుగ్రపించుటకు మీ తండ్రికి ఇష్టమైయున్నది (లూక్ 12:32)
నేడు నీవు భయపడుటకు ఏ కారణమును లేదు.దేవుడు నీ కొరకు ఉండిన యెడల నీకు విరోధముగా ఎవరైనను ఉండరు(రోమా 8:31).
దేవుడు నీ కిచ్చు శాంతిని భయము దొంగిలించ నీయకుము. వాక్యమును ప్రకటించుము. భయపడుచు భయమే పారిపోవుట గమనించుము
ఈ ప్రణాళిక గురించి
భయము అనగా నేమి? "వాస్తవముగా ఉన్న ఆపద బట్టి కాని, ఊహించిన ఆపద బట్టి కాని వచ్చు నిరాశయే”. భయము అనునది క్రైస్తవ జీవితమునుందు హింసించుటకును అడ్డగించుటకును శత్రువు ద్వారా వాడబడు మొదటి ఆయుధము. కాని యేసు ఈ శత్రువునోడించెను!
More
ఈ ప్రణాళికను అందించడానికి మేము యేసు నొక్కి చెప్పాలనుకుంటున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://tu.jesus.net/